ఏడాదిలోనే ఎన్నో చేశాం! | Telangana CM Revanth Reddy Tweet Over Congress One Year Of Ruling | Sakshi
Sakshi News home page

ఏడాదిలోనే ఎన్నో చేశాం!

Published Mon, Dec 9 2024 4:15 AM | Last Updated on Mon, Dec 9 2024 4:15 AM

Telangana CM Revanth Reddy Tweet Over Congress One Year Of Ruling

మహిళా, రైతు సంక్షేమం.. నిరుద్యోగులకు కొలువులు 

తెలంగాణ ప్రజలందరి నమ్మకానికి కృతజ్ఞతలు 

ఎక్స్‌ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి సుదీర్ఘ ట్వీట్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే ఎన్నో అంశాల్లో రికార్డులు నెలకొల్పిందని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఎక్స్‌లో ఆయన ఆదివారం సుదీర్ఘ ట్వీట్‌ పెట్టారు. ఏడాది పాలనలో సాధించిన ప్రగతిని వివరించారు. ‘మీ సొంత ప్ర భుత్వం ప్రజాపాలన మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా నేను నా ప్రజలతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను.

మొదటి సంవత్సరం వ్యవసాయ రుణా ల మాఫీ, పంట బోనస్, ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల్లో మీ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. మన మహిళా సంక్షేమ పథకాలు, కుల గణన, పర్యావరణ కేంద్రీకృత పట్టణాభివృద్ధి విధానాలు ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. తెలంగాణ ప్రజలందరి నమ్మకానికి నా కృతజ్ఞతలు’అని పేర్కొన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి తన సందేశంలో పలు అంశాలను ప్రస్తావించారు

మహిళా సంక్షేమం: ఉచిత బస్సు, గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500లకే వంట గ్యాస్‌ సిలిండర్‌. 

రైతులు
25 లక్షల మంది రైతులకు వ్యవసాయ రుణాల మాఫీ, రూ. 21,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ. 
సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌. 
 రైతులకు 24/7 ఉచిత విద్యుత్‌. 

హౌసింగ్‌
నాలుగు లక్షల ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయి. 

యువతకు ఉద్యోగాలు
ఒక్క ఏడాదిలో యువతకు55,000లకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు. ప్రైవేట్‌లో లక్షల ఉ ద్యోగాలను సృష్టించాం. గత 12 ఏళ్లలో నిరుద్యోగిత రేటును అత్యల్ప స్థాయికి తెచ్చాం. 
యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటు. 
మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా యుద్ధం. 
యంగ్‌ ఇండియా స్కిల్స్‌ విశ్వవిద్యాలయం, యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ విశ్వవిద్యాలయం స్థాపన. 

ఆర్థిక వృద్ధి / పట్టణాభివృద్ధి
గత తొమ్మిది నెలల్లో రెట్టింపు ఎఫ్‌డిఐల సాధన. గత 11 నెలల్లో మొత్తం పెట్టుబడులు 200 శాతానికి పైగా పెరిగాయి. 
వాతావరణ మార్పు సవాళ్లను ఎదుర్కొనేందుకు అర్బన్‌ రీ ఇమాజినేషన్‌ ప్రోగ్రామ్‌ను చేపట్టేందుకు భారతదేశంలో హైదరాబాద్‌ను మొదటి నగరంగా మార్చడం. 
భారీ వృద్ధితోపాటు అత్యంత నివాసయోగ్యంగా మార్చేందుకు ఫ్యూచర్‌ సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో రీజినల్‌ రింగ్‌ రోడ్, రీజినల్‌ రింగ్‌ రైల్, రేడియల్‌ రోడ్లు, మెట్రో రైల్‌ రెండో దశ, భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్‌ సిటీతో సహా అనేక ఇతర ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టాం. 

కులాల సర్వే
దేశంలోనే మొట్టమొదటి సమగ్ర కుల సర్వే ద్వారా తెలంగాణ పౌరుల నుంచి వివరాల సేకరణ  
ఇతర అంశాలు
ట్రాన్స్‌జెండర్‌ మార్షల్స్‌ ద్వారా ట్రాఫిక్‌ను ని యంత్రించే భారతదేశపు మొదటి నగరంగా హైదరాబాద్‌ త్వరలో అవతరించబోతోంది. 
 ప్రజాస్వామ్య, ఉదారవాద విలువల పునరుద్ధరణ. 
డిసెంబర్‌ 9న (సోమవారం) సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement