
బీసీలు రాజ్యాధికారాన్ని సాధించాలి: అరుణ్‌రిషి
నల్లగొండ టౌన్: బీసీలు రాజ్యాధికారాన్ని సాధించే దిశగా ఉద్యమాలను నిర్వహించాలని బీసీ యువజన, విధ్యార్థి జాతీయ సంఘం సమన్వయకర్త డాక్టర్ అరుణ్‌రిషి పిలుపునిచ్చారు. మంగళవారం బీసీ చైతన్యయాత్ర మేల్కోలుపులో భాగంగా జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కేవలం రెండు , మూడు కులాలు మాత్రమే రాజ్యాధికారం సా«గించాయన్నారు. బీసీలు అన్ని రంగాలలో నేటికి వెనుకబడి ఉన్నారని, రాజ్యాధికార సాధనతోనే అన్ని రంగాలలో అబివృద్ధి సాద్యమవుతుందన్నారు. బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలా వెంకటేశ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రా సాధనలో బీసీల పాత్ర కీలకమైందన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో దుడుకు లక్ష్మినారాయణ, రమేష్, అరవింద్, అంజయ్య, వెంకన్నగౌడ్, మల్లేష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.