రాజ్యాధికారంతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బార్క కృష్ణయాదవ్ అన్నారు.
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణయాదవ్
నవాబుపేట, న్యూస్‌లైన్: రాజ్యాధికారంతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బార్క కృష్ణయాదవ్ అన్నారు. పలువురు బీసీ సంఘం నాయకులతో కలిసి గురువారం ఆయన మండలకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో అధిక శాతం బీసీలున్నా రాజ్యాధికారానికి మాత్రం నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుంటున్నాయన్నారు. బీసీలంతా ఈవిషయాన్ని గమనించి రాజ్యాధికారం కోసం పోరాడాలన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో తిరిగి బీసీలనంతా ఏకం చేయనున్నట్లు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రఘు మాట్లాడుతూ.. శుక్రవారం నవాబుపేట మండల శాఖను ఎన్నుకోవడం జరుగుతుందని, మండలంలోని అన్ని గ్రామాల బీసీలు అధిక సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షుడు రమేష్‌యాదవ్, షాబాద్ మండల అధ్యక్షుడు రాచ రాములు, ఎం.వెంకటస్వామి, ఖలీల్, మాజీ సర్పంచ్ కోదండం, కిష్టయ్య, ప్రభు, గోవర్దన్, రవి తదితరులు పాల్గొన్నారు.