krishna yadav
-
బల్దియా టు అసెంబ్లీ
చెరుపల్లి వెంకటేశ్: కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఎదిగిన వారెందరో ఉన్నారు. హైదరాబాద్ బల్దియా నుంచే ఇలా ఎదిగిన వారూ చాలామంది ఉన్నారు. కార్పొరేటర్లుగా పోటీ చేసి గెలిచినా, ఓడి నా పట్టు వదలకుండా కృషి చేసి పైమెట్టు ఎక్కారు. ఎక్కువ పర్యాయాలు ఎమ్మెల్యేలుగా గెలవడంతోపాటు మంత్రులైన తలసాని శ్రీనివాస్ యాదవ్, టి.పద్మారావుగౌడ్, సి.కృష్ణయాదవ్, ముఖేశ్‌గౌడ్ తదితరులు నగరపాలకసంస్థ కార్పొరేటర్లుగా పోటీచేసిన వారే. ఎంసీహెచ్ నుంచే మొదలు తొలిసారిగా చాలామంది ఎంసీహెచ్(మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్) 1986 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ ఎన్నికల్లో మోండా డివిజన్ నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీచేసిన తలసాని, పద్మారావు చేతిలో ఓడిపోయారు. అనంతరం తలసాని 5 పర్యాయాలు ఎమ్మెల్యే గా గెలిచి టీడీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పలుశాఖలు నిర్వహించారు. ఇక 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పద్మారావు బీఆర్ఎస్ ప్రభు త్వంలో మంత్రిగానూ, డిప్యూ టీ స్పీకర్‌గా నూ పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కృష్ణయాదవ్ టీడీపీ హయాంలో మంత్రిగానూ, ప్ర భుత్వ విప్‌గానూ పనిచేశారు. మూడుసార్లు ఎమ్మె ల్యే అయిన ముఖేశ్‌గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తొలుత టీడీపీ కార్పొరేటర్‌గా ఉన్న రాజాసింగ్ బీజేపీ నుంచి రెండు పర్యాయాలు ఎమ్యెల్యేగా ఎన్నికై మూడోసారి పోటీ చేస్తున్నారు. ఓటమి నుంచి గెలుపు.. దోమలగూడ, జవహర్‌నగర్ నుంచి కార్పొరేటర్లుగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ జి.సాయన్న, డా.కె.లక్ష్మణ్ తర్వాతి కాలంలో ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో సాయన్న ఐదు పర్యాయాలు, లక్ష్మణ్ రెండుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. లక్ష్మణ్ ప్రస్తు తం రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. సాయన్న మరణానంతరం ప్రస్తుతం ఆయన కుమార్తె లాస్య నందిత తండ్రి ప్రాతినిధ్యం వహించిన కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. మూసారాంబాగ్ కార్పొరేటర్‌గా ఓడిపోయిన తీగల కృష్ణారెడ్డి 2002లో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్‌గా గెలిచారు. ఆ తర్వాత మహేశ్వరం నియోజకవర్గం నుంచి 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సీన్ రివర్స్ ►మోండా డివిజన్‌కు పోటీ చేసిన పద్మారావు చేతిలో శ్రీనివాస్‌యాదవ్ కార్పొరేటర్‌గా ఒకసారి, సికింద్రాబాద్ నుంచి శాసనసభ ఎన్నికల్లో ఒకసారి ఓడిపోగా, శ్రీనివాస్‌యాదవ్ చేతిలో ఎమ్మెల్యే ఎన్నికల్లో పద్మారావు ఒకసారి ఓడిపోయారు. ►జవహర్‌నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గోపాల్ చేతిలో ఓటమిపాలైన లక్ష్మణ్, ముషీరాబాద్‌లో 2014లో గోపాల్‌పై ఎమ్మెల్యేగా గెలిచారు. తిరిగి 2018లో గోపాల్ గెలవగా లక్ష్మణ్ ఓడారు. పార్టీ అధ్యక్షులుగానూ కార్పొరేటర్లుగా పోటీ చేయడం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలైన శ్రీనివాస్‌యాదవ్, కృష్ణయాదవ్ , సాయన్న, ముఠా గోపాల్ హైదరాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షులుగానూ పనిచేశారు. పద్మారావు టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షుడిగా పనిచేశారు. లక్ష్మణ్ బీజేపీ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. ఎంపీలుగానూ.. ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఒవైసీ సైతం కార్పొరేటర్ నుంచి ఎంపీ స్థాయికి ఎదిగారు. బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా చేసిన రేణుకాచౌదరి ఎంపీగా, కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఇలా బల్దియా నుంచి రాజకీయప్రస్థానం ప్రారంభించి తదనంతరం గెలిచినవారు, ఓడిన వారు ఇంకా ఎందరో ఉన్నారు. పలువురు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లుగానూ పనిచేశారు. కృష్ణారెడ్డి, సు«దీర్‌రెడ్డి హుడా చైర్మన్లుగానూ వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో... పోటీలో సిట్టింగ్ కార్పొరేటర్లు ప్రస్తుతం బల్దియా సిట్టింగ్ కార్పొరేటర్లలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన జగదీశ్వర్‌గౌడ్ శేరిలింగంపల్లి నుంచి , విజయారెడ్డి ఖైరతాబాద్ నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు. తోకల శ్రీనివాసరెడ్డి(బీజేపీ) రాజేంద్రనగర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. శాస్త్రిపురం కార్పొరేటర్‌గా ఉన్న మహ్మద్ మోబిన్ బహదూర్‌పురా నుంచి ఎంఐఎం అభ్యర్థిగా బరిలో ఉన్నారు. షేక్‌పేట కార్పొరేటర్ రాషెద్ ఫరాజుద్దీన్ జూబ్లీహిల్స్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీలు సైతం.. మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్‌రెడ్డి ఉప్పల్ నుంచి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు. ఎంఐఎం మాజీ కార్పొరేటర్ బి.రవియాదవ్ రాజేంద్రనగర్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ మేయర్లు, డిప్యూటీ మేయర్ కూడా జీహెచ్ఎంసీ మేయర్లుగా పనిచేసిన జులి్ఫకర్ అలీ, మాజిద్‌హుస్సేన్ ఎంఐఎం అభ్యర్థులుగా చారి్మనార్, నాంపల్లి నియోజకవర్గాల నుంచి ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. డిప్యూటీ మేయర్‌గా పనిచేసిన జాఫర్ హుస్సేన్ ఇప్పటికే రెండు పర్యాయాలు నాంపల్లి ఎమ్మెల్యేగా చేసి మూడోసారి యాకుత్‌పురా నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. వీరిలో జుల్ఫికర్‌అలీ, మాజిద్ హుస్సేన్‌లు మేయర్ల పదవీకాలం ముగిశాక సైతం తిరిగి కార్పొరేటర్లుగానూ పనిచేశారు. మాజిద్ ప్రస్తుతం సిట్టింగ్ కార్పొరేటర్‌గా కూడా ఉన్నారు. తలసాని శ్రీనివాస్‌యాదవ్ సనత్‌నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. సుదీర్‌రెడ్డి ఎల్బీనగర్ నుంచి రెండుపర్యాయాలు గెలిచి మళ్లీ బరిలో ఉన్నారు. ముఠాగోపాల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి, తిరిగి పోటీ చేస్తున్నారు. పద్మారావు సికింద్రాబాద్‌లో మూడుసార్లు గెలిచారు. మళ్లీ బరిలో నిలిచారు. హిమాయత్‌నగర్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణయాదవ్ రూపాంతరం చెందిన అంబర్‌పేట నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా బరి లో ఉన్నారు. -
కేసీఆర్ సర్కార్‌కు కౌంట్‌డౌన్ మొదలు
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ సర్కార్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది.. ప్రగతి భవన్లో కేసీఆర్ ఉండేది కేవ లం 90 రోజులే.. ఆ తర్వాత శాశ్వతంగా ఫాంహౌస్‌లోనే ఆయన ఉండబోతున్నారు’అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘ప్రగతి భవన్.. కేసీఆర్ కుటుంబ భవన్ తప్ప తెలంగాణ ప్రజలది కాదు. కేసీఆర్ కుటుంబం రూ. వేల కోట్ల దోపిడీ చేసింది. అందుకే అడుగడుగునా బీఆర్ఎస్ను ప్రజలు నిలదీస్తున్నారు. కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో... ఇది తెలంగాణ ప్రజల నినాదం’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు రాష్ట్రానికి వస్తుంటే వాటిలో పాల్గొనే తీరికలేని, కుట్రలు చేసే సీఎం తెలంగాణకు అవసరమా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు పన్నినా.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. శనివారం పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ నేత టి. ఆచారిల సమక్షంలో మాజీ మంత్రులు సి. కృష్ణయాదవ్, జె.చిత్తరంజన్‌దాస్, సిర్పూర్ జెడ్పీటీసీ రేఖా సత్యనారాయణ, మరో నేత బండల రామచంద్రారెడ్డి, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పెద్దసంఖ్యలో కార్యకర్తలు బీజేపీలో చేరారు. వారికి కిషన్‌రెడ్డి, ఈటల, అరుణ కాషాయ కండువాలు కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అనేక సర్వేల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటమి ఖాయమని తెలియడంతో కేసీఆర్ బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాదు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఅర్ఎస్కు ఓటేసినట్టేనని కిషన్‌రెడ్డి ఆరోపించారు. గెలిచే పరిస్థితి లేదు కాబట్టే ఇష్టమొచ్చిన హామీలను కాంగ్రెస్ ఇస్తోందని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీలు కాదు... 60 గ్యారెంటీలు ఇచ్చినా కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రాదన్నారు. పార్టీ గెలుపునకు కృషి: కృష్ణయాదవ్, చిత్తరంజన్‌దాస్ ‘రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతం చేయాల్సిన అవసరం ఉంది. కిషన్‌రెడ్డి నాయకత్వంలో సైనికుడిలా పనిచేస్తా. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తా’అని మాజీ మంత్రి కృష్ణయాదవ్ చెప్పారు. మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపులో నా పాత్ర కూడా ఉంటుందని అనుకుంటున్నా’అని పేర్కొన్నారు. తిరుగులేని శక్తిగా బీజేపీ ఎదగనుంది: ఈటల ‘బీఅర్ఎస్కు బీజేపీని ప్రత్యామ్నాయంగా ప్రజలు భావిస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది బీజేపీలోకి వస్తున్నారని... రాబోయే కాలంలో తెలంగాణ గడ్డపై తిరుగులేని శక్తిగా బీజేపీ ఎదగబోతోందని చెప్పారు. డీకే అరుణ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు. -
బీజేపీలో కృష్ణయాదవ్ చేరికకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి సి.కృష్ణయాదవ్ బీజేపీలో చేరికకు బ్రేక్ పడింది. బుధవారం బీజేపీ కా ర్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పార్టీ లో చేరాల్సి ఉండగా, ఆ కార్యక్రమం వాయిదా పడింది. ఆయనపై ఉన్న స్టాంప్‌ల కుంభకో ణం కేసు, ఇతరత్రా కారణాలతో కొందరు నగర పార్టీ నేత లు కృష్ణయాదవ్ బీజేపీలోకి రావడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. గతంలో టీడీపీ, బీఆర్ఎస్లో ఉన్న కృష్ణ్ణయాదవ్ను చేర్చుకునే విషయంలో కోర్ కమిటీ ఇంకా తుది నిర్ణయం తీసుకోకముందే ఆయన చేరిక ముహూర్తం ఖరారు చేసుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మొత్తం మీద చేరిక కార్యక్రమం వాయిదా పడటంతో ఆయన అనుచరులు నిరాశకు గురయ్యారు. కృష్ణయాదవ్, తుల ఉమ వ్యవహారంలో ఈటల కినుక! కృష్ణయాదవ్‌ను పార్టీలో చేర్పించే విషయంలో కొంతకాలంగా సంప్రదింపులు జరిపి, పార్టీ నేతలతోనూ మాట్లాడిన రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కూడా ఈ పరిణామంతో అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది. మరోవైపు అధికార బీఆర్ఎస్ను వదిలి తనతో పాటు బీజేపీలోకి వచ్చిన మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ ఆశిస్తున్న వేములవాడ అసెంబ్లీ స్థానం విషయంలో హామీ లభించక పోవడంపైనా ఈటల కినుక వహించినట్టు చెబుతున్నారు. మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు కుమారుడు డాక్టర్ వికాస్‌రావును పార్టీలో చేర్చుకోవడంపై కూడా ఆయన అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. త్వరలోనే బీజేపీలో చేరుతా: కృష్ణయాదవ్ నాంపల్లి (హైదరాబాద్): ‘బీఆర్ఎస్ పార్టీ కోసం ఏడేళ్లు పనిచేశాను. కానీ బీఆర్ఎస్ నన్ను గుర్తించలేదు. నా సేవలను వినియోగించుకోలేదు. మరో రెండు, మూడ్రోజుల్లో బీజేపీలో చేరి బడుగు బలహీన వర్గాలకు సేవ చేస్తా’అని మాజీ మంత్రి కృష్ణయాదవ్ అన్నారు. ఈ మేరకు బుధవారం నాంపల్లిలోని రెడ్‌రోజ్ ఫంక్షన్ హాలులో పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కృష్ణయాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ టికెట్ ఇస్తానని చెప్పి రెండు పర్యాయాలు మోసం చేసిందన్నారు. -
లక్షల్లో సొమ్ము చేతులు మారాయి: కృష్ణయాదవ్
హైదరాబాద్ : ఓవైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు తరుముకొస్తుంటే తెలంగాణ టీడీపీకి మరో గట్టి షాకే తగిలింది. గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీ ఆకర్ష్‌కు కొంతమంది నేతలు వెళ్లిపోగా, మిగిలినవారు అసంతృప్తితో ఆ పార్టీకి దూరం అవుతున్నారు. తాజాగా సొంతపార్టీపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ గ్రేటర్ ఉపాధ్యక్ష పదవికి కృష్ణయాదవ్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ పార్టీలో బడుగు, బలహీన వర్గాలవారికి అన్యాయం జరుగుతోందని విమర్శించారు. గ్రేటర్ టికెట్ల కేటాయింపులో లక్షల రూపాయిలు చేతులు మారాయని ఆరోపించారు. పార్టీని కొందరు నాయకులు గుప్పెట్లో పెట్టుకుంటున్నారని, కొందరి వ్యవహార శైలి వల్ల పార్టీ నాశనం అవుతోందని కృష్ణయాదవ్ ధ్వజమెత్తారు. -
గ్రేటర్లో తెలంగాణ టీడీపీకి షాక్
హైదరాబాద్ : గ్రేటర్లో తెలంగాణ టీడీపీకి షాక్ తగిలింది. తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్ష పదవికి మాజీ మంత్రి కృష్ణయాదవ్ శుక్రవారం రాజీనామా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల టికెట్ల కేటాయింపులో తనను పట్టించుకోలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు గ్రేటర్ ఎన్నికల సమయంలో కృష్ణయాదవ్ రాజీనామా ఆ పార్టీలో గుబులు రేపుతోంది. కాగా పాతబస్తీకి చెందిన కృష్ణయాదవ్ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నారు. తెలుగు విద్యార్థి నాయకుని నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. 1994లో హిమాయత్ నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. విప్‌గా పనిచేశారు. చంద్రబాబు హయాంలో కార్మిక శాఖ, పశు సంవర్థక శాఖ మంత్రిగా పని చేశారు. అయితే నకిలీ స్టాంపుల కుంభకోణంలో 2003లో టిడిపి ప్రభుత్వ హయాంలోనే కృష్ణయాదవ్ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత టిడిపిలో చేరేందుకు ప్రయత్నించినా ప్రయత్నాలు ఫలించలేదు. ఎట్టకేలకు అధ్యక్షుడి అనుమతితో పార్టీలో చేరారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ లో చేరడంతో గ్రేటర్ అధ్యక్షుడిగా కృష్ణయాదవ్ పేరు తెరపైకి వచ్చింది. అయితే అనూహ్యంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు గ్రేటర్ అధ్యక్ష పదవి వరించింది. దీంతో అప్పటి నుంచి కృష్ణయాదవ్ అసంతృప్తిగా ఉన్నారు. చివరకు గ్రేటర్ ఎన్నికల టికెట్ల కేటాయింపులో తనను పట్టించుకోకపోవడంతో ఆయన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. -
టీడీపీలో చిచ్చు రేపిన కమిటీలు
-
టీడీపీలో చిచ్చు రేపిన కమిటీలు
హైదరాబాద్: టీడీపీ ప్రకటించిన కమిటీలతో ఆ పార్టీలో చిచ్చు రేగింది. కమిటీల్లో తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని తెలంగాణ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆదివారం జరిగిన కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యుల ప్రమాణస్వీకారానికి సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, పెద్దిరెడ్డి, కృష్ణయాదవ్ గైర్హాజరయ్యారు. తమకు ఇచ్చిన పదవుల పట్ల ఈ ముగ్గురు నాయకులు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. రేవూరి ప్రకాశ్ రెడ్డిని కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం పట్ల ఎర్రబెల్లి అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. కష్టపడిన వారికి పార్టీలో ప్రాధ్యానత ఇవ్వలేదని వాపోయినట్టు తెలుస్తోంది. మరో సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు కూడా ఈరోజు కార్యక్రమానికి రాలేదు. అయితే తాను పార్టీలో క్రియాశీలకంగా లేనని, అందుకే రాలేదని ఆయన తెలిపారు. ఆలస్యంగా వచ్చినప్పటికీ అశోక్ గజపతి రాజుతో చంద్రబాబు ప్రమాణం చేయించడం గమనార్హం. -
గ్రేటర్ టీడీపీ నాయకత్వంపై మాజీ మంత్రి అసంతృప్తి
హైదరాబాద్:గ్రేటర్ టీడీపీ నాయకత్వంలో అసంతృప్తుల స్వరం తీవ్రమవుతోంది. నగర టీడీపీ నాయకత్వంపై ఎప్పట్నుంచో గుర్రుగా ఉన్న మాజీ మంత్రి కృష్ణయాదవ్ తాజాగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన భవిష్యత్ కార్యచరణపై సోమవారం కార్యకర్తలతో సమావేశమైన కృష్ణయాదవ్.. గ్రేటర్ లో పార్టీ చేపట్టే కార్యక్రమాలకు తనను ఆహ్వానించకపోవడంపై మనస్తాపం చెందారు. ఎమ్మెల్యేలు సాయన్న, మాగంటి గోపీనాథ్ వైఖరిని ఈ సందర్భంగా కృష్ణయాదవ్ తప్పుబట్టారు. పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపులేదని కార్యకర్తల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పార్టీని వీడాలని ఆయనకు కార్యకర్తలు సూచించినట్లు తెలుస్తోంది. తనకు జరుగుతున్న అవమానంపై నేడో- రేపో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడ్ని కృష్ణయాదవ్ కలిసే అవకాశం ఉంది. -
సిగ్గుంటే తిరిగి పోటీ చేసి గెలువ్
తలసానికి కృష్ణ యాదవ్ సవాల్ సిటీబ్యూరో: టీడీపీ జెండాతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి... పార్టీ మారి దొడ్డిదారిన మంత్రి పదవి చేపట్టిననాయకుడు స్థాయి మరచి తమ అధినాయకుడు చంద్రబాబును విమర్శించడం తగదని హైదరాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు సి.కృష్ణయాదవ్ పరోక్షంగా తలసాని శ్రీని వాస యాదవ్‌పై ధ్వజమెత్తారు. అధికారపు అహంకారంతో రాజ్యాంగమంటే తెలి యని, చట్టాలపై విశ్వాసం లేని వ్యక్తి చంద్రబాబును నోటికొచ్చినట్లు విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో అధికార ప్రతినిధి ఎం.ఆనందర్ కుమార్ గౌడ్, కార్యదర్శి నైషధం సత్యనారాయణమూర్తిలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నీతి, నిజాయితీ, సిగ్గు, లజ్జ అంటున్న ఆయనకు నిజంగా అవి ఉంటే ఒక్క సెకన్లో రాజీనామా చేసి, తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. దమ్ము, ధైర్యం, నైతిక విలువలు ఉంటే ప్రజాతీర్పు కోరాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యవహారాన్ని ఆసరాగా చేసుకొని చంద్రబాబుపై నోటికొచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్న పలువురు మంత్రులు ఎన్టీఆర్ రాజకీయ భిక్షతోనే ఈ స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. తలసాని మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచీ ఆయన ఫోన్ కాల్‌డేటాను తీయాలని, ఎవరెవరిని బెదిరించారో, ప్రలోభపెట్టారో తెలుస్తుందన్నారు. సమావేశంలో బాల్‌రాజ్‌గౌడ్, శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ కొత్త నాటకం అనంతరం సెక్రటరీ జనరల్ ఎమ్మెన్ శ్రీనివాసరావు, జిల్లా నాయకుడు మేకల సారంగపాణి, వివిధ నియోజకవర్గాల ఇన్చార్జులు విలేకరులతో మాట్లాడుతూ, టీడీపీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్తో కలిసి కొత్త నాటకానికి తెర తీసిందన్నారు. తెలుగుదేశాన్ని ఎదుర్కొనే దమ్ము, సత్తాలేకే కాంగ్రెస్, టీఆర్ఎస్ కుమ్మక్కై వికృత క్రీడ ప్రారంభించాయని ఆరోపించారు. -
కలం కబుర్లు...
సీఎం నంబర్ ఇస్తే పోలే! ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి రూపంలో తలనొప్పి వచ్చి పడింది. ప్రభుత్వం రైతు రుణ విముక్తి పథకం గురించి గొప్పగా చెప్పుకుంటోందని, ఆ పథకం డొల్ల మాత్రమేనని విమర్శించిన రఘువీరారెడ్డి ఈ పథకంపై సందేహాలుంటే నేరుగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఫోన్ చేయాలని నేరుగా మంత్రి సెల్‌ఫోన్ నంబరు వెల్లడించారు. దీంతో మంత్రికి క్షణం తీరిక లేకుండా వరుసగా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఫోన్లు శరపరంపరగా వస్తూనే ఉన్నాయి. రుణ మాఫీ సంగతేంటంటూ ప్రతి ఒక్కరూ ఫోన్ చేయడమే కాకుండా కనీసం పావుగంట సేపు మాట్లాడుతున్నారట. వారు మాట్లాడే సమయంలో మధ్యలోనే కట్ చేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయన్న భయంతో కొన్ని ఫోన్లు మాట్లాడారట. ఇక లాభం లేదనుకున్న మంత్రివర్యులు ఫోన్లకు సమాధానం చెప్పేందుకు ప్రత్యేకంగా పీఏను కేటాయించారు. అయితే, సందేహాలు తీర్చుకునేందుకు ఫోన్ చేసిన రైతులు పీఏ చెప్పిందంతా విన్న తరువాత మీరెవరని ప్రశ్నించి.. పీఏ అన్న సమాధానం రాగానే రైతులు మంత్రిగారేమయ్యారంటూ నిట్టూరుస్తున్నారట. ఈ విషయం ఆయనే మీడియాకు చెప్పుకోగా, అది విన్న టీడీపీ సహచరుడొకరు విరుగుడు మంత్రం బోధించారు.. మంత్రిగారికెందుకు తంటాలు..! అదేదో ముఖ్యమంత్రి ఫోన్ నంబర్ ఇస్తే పోలే..! మౌనం వెనుక బావ..! ఏపీ శాసనసభ లాబీల్లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీడియాతో మాట కలపకుండా మౌనంగా ఉంటున్నారు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలతో తనదైన శైలిలో మాట్లాడుతున్న బాలయ్య.. మీడియా ప్రతినిధుల మాట మాత్రం వినిపించుకోనట్లు ఉంటున్నారు. దీని వెనుక ఆయన బావ, టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆదేశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ స్వతహాగా మనసులో ఏమీ దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంటారు. విలేకరులు పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై ప్రశ్నిస్తే బాలకృష్ణ సమాధానాలతో పార్టీకి, ప్రభుత్వానికి ఏ తంటా వస్తుందోనన్న ఆందోళనతో.. శాసనసభ సమావేశాల్లో నోరు మెదపొద్దని సీఎం స్పష్టంగా చెప్పటంతో మాట్లాడించేందుకు ఏ విలేకరి ఎంత ప్రయత్నించినా నోరు మెదపడం లేదని ఎమ్మెల్యేలు చెవులు కొరుక్కుంటున్నారు. ‘తెల్గీ’దేశం ఆఫీసుకు వెడదామా..? స్టాంపుల కుంభకోణం కేసులో మూడేళ్లు జైలు శిక్ష అనుభవించి వచ్చిన సి.కృష్ణాయాదవ్ ఇప్పుడు హైదరాబాద్ నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడయ్యారు. మధ్యలో ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కృష్ణాయాదవ్‌ను ఇప్పుడు హైదరాబాద్ పార్టీ అధ్యక్ష పదవి వరించింది. కానీ, ఆయన నాయకత్వం నచ్చనివారు నగర టీడీపీ కార్యాలయా న్ని ‘తెల్గీ ఆఫీసు’ అంటున్నారు. స్టాంపుల కుంభకోణంలో ప్రధాన నిందితుడు అబ్దుల్ కరీం తెల్గీతో పాటు కృష్ణాయాదవ్ చాలాకాలం పూణే జైలులో ఉన్నారు. దానిని దృష్టిలో ఉంచుకుని తెలుగు తమ్ముళ్లు ఆ పార్టీ ఆఫీసును కాస్త తెల్గీ ఆఫీసు అంటూ పేరును కుదించారు. ఇది తెలియని తమ్ముళ్లు తెలుగును కుదించి ‘తెల్గీ’ అని పిలుచుకుంటున్నారా.. ? అంటూ నోళ్లు వెళ్లబెడుతున్నారు. హమ్మయ్య.. మన సీఎం సారేనట! ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు హెలికాప్లర్లు పెద్దశబ్దంతో ఆకాశంలో ఎగురుతూ వస్తుంటే.. ఆ పల్లె వాసులు భయపడ్డారు. ఒక్క హెలికాప్టర్ కిందకు దిగుతుంటేనే పెద్ద శబ్దం వస్తుంది, అలాంటిది నాలుగు హెలికాప్టర్లు తక్కువ ఎత్తులో ఆకాశంలో దూసుకువస్తుంటే భయపడరా....మరి? ఇటీవల రాచకొండ ప్రాంతాన్ని సందర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, సహచర మంత్రులు, ఉన్నతాధికారులు నాలుగు హెలికాప్టర్లలో అక్కడికి వెళ్లారు. మామూలుగా వాహనాల శబ్దం కూడా పెద్దగా ఉండని రాచకొండ పల్లెల్లో ఈ నాలుగు హెలికాప్టర్ల రాకను చూసి పల్లీయులు చాలా కంగారు పడ్డారట. మళ్లీ నక్సలైట్లు ఏమైనా వచ్చి ఇక్కడ క్యాంపు ఏర్పాటు చేసుకున్నారా ...? అదితెలిసి పోలీసులు వస్తున్నారేమో అని పల్లెవాసులు ఉలిక్కిపడ్డారట. వచ్చింది ముఖ్యమంత్రి అని తెలిసి‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్నారట. ఈ విషయం ఓ ఉన్నతాధికారే స్వయంగా సహచర అధికారులకు చె బుతూ కడుపుబ్బ నవ్వించారు. -
తెరపైకి మళ్లీ కృష్ణయాదవ్
గ్రేటర్ టీడీపీలో కృష్ణయాదవ్ పేరు మళ్లీ తెర మీదకు వచ్చింది. గ్రేటర్ అధ్యక్షుడుగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ సైకిల్ దిగి కారు ఎక్కుతుండటంతో అదే సామాజిక వర్గానికి చెందిన కృష్ణయాదవ్ కు హైదరాబాద్ జిల్లా అధ్యక్ష పదవి వరించింది,. తలసాని, తీగల కృష్ణారెడ్డి పార్టీకి దూరం కావటంతో వెనువెంటనే ఆయనకు పార్టీ పగ్గాలు ఇచ్చారు. దాంతో తలసానికి గట్టిగా ఎదుర్కొనేందుకే కృష్ణయాదవ్‌కు అధ్యక్ష పదవి కట్టబెట్టినట్లు తెలుస్తోంది. పాతబస్తీకి చెందిన కృష్ణయాదవ్ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నారు. తెలుగు విద్యార్థి నాయకుని నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. 1994లోహిమాయత్ నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. విప్‌గా పనిచేశారు. చంద్రబాబు హయాంలో కార్మిక శాఖ, పశు సంవర్థక శాఖ మంత్రిగా పని చేశారు. అయితే నకిలీ స్టాంపుల కుంభకోణంలో 2003లో టిడిపి ప్రభుత్వ హయాంలోనే కృష్ణయాదవ్ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత టిడిపిలో చేరేందుకు ప్రయత్నించినా ప్రయత్నాలు ఫలించలేదు. ఎట్టకేలకు అధ్యక్షుడి అనుమతితో ఏడాదిన్నర క్రితం ఆయన టీడీపీలో చేరారు. ఇక కృష్ణాయాదవ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇద్దరూ ఒకే సారి శాసనసభలో కలిసి అడుగుపెట్టారు. తెలుగుదేశం పార్టీలో నగరం నుంచి బలమైన నాయకులుగా ముద్రపడ్డారు. అర్ధబలం, అంగబలంలోనూ వారిద్దరు సమఉజ్జీలే. అయితే ఆ తర్వాత ఆ ఇద్దరి మధ్య రాజకీయ వైరం నెలకొంది. ఎంతలా అంటే ఒకరి నీడను మరొకరు సహించలేనంతగా. ఆ తర్వాత నకిలీ స్టాంపుల కుంభకోణంలో ఇరుక్కుని కృష్ణాయాదవ్ పార్టీ నుంచి బహిష్కృతుడు కావడంతో తలసానికి పార్టీలో మరింత ప్రాధాన్యత పెరిగింది. ఓ దశలో తలసాని... పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు తలనొప్పిగా మారారు కూడా. అనుకున్నది సాధించుకునేందుకు తలసాని పార్టీ మారే అస్త్రాన్ని కూడా పలుమార్లు ఉపయోగించుకున్నారు. -
సవతుల మధ్య పోరుకు తెరలేపిన లాలూ
రాజకీయాల్లో ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఏం చేసినా, ఏం మాట్లాడినా సెన్సేషనల్ గా ఆసక్తికరంగా ఉంటాయి. బీహార్ ఎన్నికల్లో ఓ ఆసక్తికరమైన పోరుకు లాలూ తెర లేపారు. స్థానిక రాజకీయ నాయకుడు రణబీర్ యాదవ్ కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పూనమ్ దేవి యాదవ్ ఖగారియా నియోజకవర్గంలో జేడీ(యూ) పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే రెండవ భార్య కృష్ణ యాదవ్ కు లాలూ తన పార్టీ ఆర్జేడి తరపున టికెట్ ఇచ్చి ఆసక్తికరమైన పోరుకు తెరలేపారు. పూనమ్ దేవి, కృష్ణ యాదవ్ లిద్దరూ స్వంత అక్కా చెల్లెల్లు కావడం విశేషం. ఇద్దరు సవతులు పోటీలో నిలవడాన్ని చాలా తేలికగా తీసుకున్నారు. నేను జేడీ(యూ) పార్టీ ఎమ్మెల్యేను, నా పార్టీ కోసం పని చేస్తాను అని అన్నారు. అంతేకాక తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని.. తాము అన్యోన్యంగా ఉంటామన్నారు. ఇదిలా ఉండగా అథ్లెట్ గా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కృష్ణ యాదవ్ కు తన అక్క అంటే చాలా ఇష్టమట. అంతేకాక వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు కూడా. ఎవరూ గెలువాలనేది ప్రజలు నిర్ణయిస్తారని.. ఎవరి గెలుపుపై వారు ధీమాగా ఉన్నారు. లాలూ లెక్కలు పనిచేస్తాయో.. లేక పూనమ్ తన ఎమ్మెల్యే గిరిని నిలబెట్టుకుంటుందో వేచి చూడాల్సిందే. -
రాజ్యాధికారంతోనే బీసీలకు న్యాయం
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణయాదవ్ నవాబుపేట, న్యూస్‌లైన్: రాజ్యాధికారంతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బార్క కృష్ణయాదవ్ అన్నారు. పలువురు బీసీ సంఘం నాయకులతో కలిసి గురువారం ఆయన మండలకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో అధిక శాతం బీసీలున్నా రాజ్యాధికారానికి మాత్రం నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుంటున్నాయన్నారు. బీసీలంతా ఈవిషయాన్ని గమనించి రాజ్యాధికారం కోసం పోరాడాలన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో తిరిగి బీసీలనంతా ఏకం చేయనున్నట్లు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రఘు మాట్లాడుతూ.. శుక్రవారం నవాబుపేట మండల శాఖను ఎన్నుకోవడం జరుగుతుందని, మండలంలోని అన్ని గ్రామాల బీసీలు అధిక సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షుడు రమేష్‌యాదవ్, షాబాద్ మండల అధ్యక్షుడు రాచ రాములు, ఎం.వెంకటస్వామి, ఖలీల్, మాజీ సర్పంచ్ కోదండం, కిష్టయ్య, ప్రభు, గోవర్దన్, రవి తదితరులు పాల్గొన్నారు. -
9 నుంచి కీలక ఉద్యమం
విజయవాడ, న్యూస్‌లైన్ : ఈ నెల 9వ తేదీ నుంచి కీలకమైన ఉద్యమం ప్రారంభమవుతుందని ఏపీఎన్జీవో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్య యువజన సదస్సు బెంజ్‌సర్కిల్ సమీపంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ హాలులో గురువారం జరిగింది. హాలు ప్రాంగణం అంతా సమైక్య నినాదాలతో హోరెత్తిపోయింది. అశోక్‌బాబు మాట్లాడుతూ 9న సమైక్యాంధ్ర విద్రోహ దినంగా పరిగణించాలన్నారు. అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే లక్షలాది మందితో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు కృష్ణయాదవ్ మాట్లాడుతూ చదువు, సంస్కారం లేని సోనియా గాంధీ రాష్ట్ర విభజన చేస్తున్నారని విమర్శించారు. పీవీ నరసింహారావు గాంధీ కుటుంబాన్ని పక్కనబెట్టి పాలన సాగించారని, తెలుగువారు కలిసి ఉంటే మరలా వారికి ఎటువంటి ఆపద వస్తుందోనని రాష్ట్రాన్ని విభజిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రాంతవాసులు గతంలో ఆంధ్రప్రదేశ్‌లో కలుస్తామని చెప్పి కలిసి, అభివృద్ధి చెందిన తరువాత విడిపోతామని డిమాండ్ చేస్తే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రాష్ట్ర సమైక్య యువజన కన్వీనర్ కిశోర్‌కుమార్ మాట్లాడుతూ శ్రీకృష్ణ కమిటీ 9 నెలల పాటు రాష్ట్రం అంతటా పర్యటించి తెలంగాణా అభివృద్ధి చెందిందని, విభజన జరిగితే అనేక కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని నివేదికలో సమర్పించినట్లు చెప్పారు. సీమాంధ్రకు రూ.10 లక్షల కోట్లు ప్యాకేజి ఇస్తామని ప్రకటనలు చేస్తున్నారు.. ఆ డబ్బు ఎక్కడి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. నరేంద్రమోడి చిన్న రాష్ట్రాలకు బీజేపీ అనుకూలమని ప్రకటిస్తున్నారు కదా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ర్టంలో కూడా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఉంది.. దాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ కోసం టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ ఇంట్లో ఎవరైనా చనిపోయారా అని ప్రశ్నించారు. విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి మాట్లాడుతూ రాజకీయాలు తిండి పెట్టవని, ఉద్యమంలో భాగంగా పాఠశాలలు, కళాశాలలు తక్కువ పనిగంటలు పెట్టి అందరూ ఉద్యమంలో పాల్గొనాలని సూచించారు. తెలుగు జాతిని ఢిల్లీలో అమ్మేశారని విమర్శించారు. సోనియాగాంధీకి తెలుగు ప్రజలపై ఆసక్తి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యాంద్ర విద్యార్ది జేఏసీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి మదిలో సమైక్యాంధ్ర నినాదం ఉంటూనే ఉందన్నారు. గుంటూరు జిల్లా జేఏసీ ప్రతినిధి శేషు మాట్లాడుతూ రాష్ట్ర విభజన ఆగేవరకు ఉద్యమం ఆగదన్నారు. భావితరాల భవిష్యత్తు కోసమే ఈ ఉద్యమం చేపడుతున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తోందని తెలిపారు. ప్రకాశం జిల్లా జేఏసీ ప్రతినిధి జగదీష్ మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఎందుకు రాష్ట్ర విభజనను ఆపలేకపోతున్నారని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా జేఏసి ప్రతినిధి డేవిడ్ మాట్లాడుతూ సమైక్య రాష్ర్టంలోనే విద్యార్థులకు ఉద్యోగాలు రావడం లేదు, రాష్ట్ర విభజన జరిగితే లభిస్తాయా అని అడిగారు. నేడు బంద్‌కు పిలుపు కేంద్ర కేబినెట్ రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ ఏపీ ఎన్జీవో సంఘం వేరొక ప్రకటనలో శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చింది.