
గ్రేటర్ టీడీపీ నాయకత్వంపై మాజీ మంత్రి అసంతృప్తి
హైదరాబాద్:గ్రేటర్ టీడీపీ నాయకత్వంలో అసంతృప్తుల స్వరం తీవ్రమవుతోంది. నగర టీడీపీ నాయకత్వంపై ఎప్పట్నుంచో గుర్రుగా ఉన్న మాజీ మంత్రి కృష్ణయాదవ్ తాజాగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన భవిష్యత్ కార్యచరణపై సోమవారం కార్యకర్తలతో సమావేశమైన కృష్ణయాదవ్.. గ్రేటర్ లో పార్టీ చేపట్టే కార్యక్రమాలకు తనను ఆహ్వానించకపోవడంపై మనస్తాపం చెందారు. ఎమ్మెల్యేలు సాయన్న, మాగంటి గోపీనాథ్ వైఖరిని ఈ సందర్భంగా కృష్ణయాదవ్ తప్పుబట్టారు. పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపులేదని కార్యకర్తల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో పార్టీని వీడాలని ఆయనకు కార్యకర్తలు సూచించినట్లు తెలుస్తోంది. తనకు జరుగుతున్న అవమానంపై నేడో- రేపో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడ్ని కృష్ణయాదవ్ కలిసే అవకాశం ఉంది.