
టీడీపీలో చిచ్చు రేపిన కమిటీలు
హైదరాబాద్: టీడీపీ ప్రకటించిన కమిటీలతో ఆ పార్టీలో చిచ్చు రేగింది. కమిటీల్లో తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని తెలంగాణ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆదివారం జరిగిన కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యుల ప్రమాణస్వీకారానికి సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, పెద్దిరెడ్డి, కృష్ణయాదవ్ గైర్హాజరయ్యారు.
తమకు ఇచ్చిన పదవుల పట్ల ఈ ముగ్గురు నాయకులు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. రేవూరి ప్రకాశ్ రెడ్డిని కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం పట్ల ఎర్రబెల్లి అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. కష్టపడిన వారికి పార్టీలో ప్రాధ్యానత ఇవ్వలేదని వాపోయినట్టు తెలుస్తోంది.
మరో సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు కూడా ఈరోజు కార్యక్రమానికి రాలేదు. అయితే తాను పార్టీలో క్రియాశీలకంగా లేనని, అందుకే రాలేదని ఆయన తెలిపారు. ఆలస్యంగా వచ్చినప్పటికీ అశోక్ గజపతి రాజుతో చంద్రబాబు ప్రమాణం చేయించడం గమనార్హం.