Peddireddy
-
పెద్దిరెడ్డి సుధారాణి అక్రమ అరెస్ట్ బాబు, పవన్ పై రోజా ఫైర్
-
అధికారంలో ఉంది మీరే.. పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగే సమాధానం
-
మీరు తీసుకునేది ‘ట్యాపింగ్’ పైసలే : మాజీ మంత్రి పెద్దిరెడ్డి
కరీంనగర్: ఫోన్ ట్యాపింగ్ ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు పంపుతున్న సొమ్ముతో కార్పొరేటర్లను, ప్రజాప్రతినిధులను, నాయకుల ను కొనాలని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నరు.. ఆ డబ్బు తీసుకునేవాళ్లకు మేం చెప్పేదొక్కటే.. మీరు తీసుకునే సొమ్ము ఫోన్ ట్యాపింగ్ పైసలే.. విచారణలో బయటపడితే మీకు గండమే.. జైలుకు వెళ్లక తప్పదని మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడ సంగప్ప హెచ్చరించారు.కరీంనగర్‌కు చెందిన కొందరు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్లు చర్చ జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రధాని మోదీ నాయకత్వమే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పుకోలేని స్థితిలో కాంగ్రెస్ ఉందని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్ల రద్దు అంటూ ఆ పార్టీ విష ప్రచారం చేస్తోందన్నారు. కాంగ్రెస్ హయాంలో మంచి నీళ్లు దొరకలేదన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నిజమైన బీసీ అయితే మోదీ, సంజయ్ బీసీలేనని, నువ్వు బీసీ పక్షం ఉంటావో.. ఓసీ పక్షం ఉంటావో చెప్పాలని డిమాండ్ చేశారు. నాయకులు కొలగాని శ్రీనివాస్, బొమ్మ జయశ్రీ,, బొంతల కల్యాణ్, కటకం లోకేశ్ పాల్గొన్నారు.ఇవి చదవండి: ప్రచారంపై ఫోకస్ పెంచిన ప్రధాన పార్టీలు.. -
భారీ మెజారిటీతో మళ్లీ గెలుదాం
-
వాడుకుంటాడు బలి చేస్తాడు
-
వైఎస్ కుటుంబాన్ని చీల్చిన దుర్మార్గుడు చంద్రబాబు: పెద్దిరెడ్డి
-
చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్
-
ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా వైఎస్ జగన్ మళ్ళీ సీఎం అవుతారు: పెద్దిరెడ్డి
-
ఏ కష్టం వచ్చినా జగన్ వెంటే ఉంటాం: పెద్దిరెడ్డి
-
సాంకేతిక కారణాలతో మాత్రమే అరెస్ట్ అక్రమ అంటున్నారు
-
విద్యుత్ కోతలు ఉండకూడదనే తరచూ సీఎం జగన్ సమీక్షలు
-
అభివృద్ధిని అడ్డుకునేందుకు బాబు కుట్రలు
-
తెరపైకి మళ్లీ పెద్దిరెడ్డి..!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ టికెట్ మహాకూటమికి కేటాయించనున్నారా..? ఉమ్మడి కరీంనగర్లో ఇప్పటివరకు సీపీఐకి మాత్రమే ఒక్కసీటును కేటాయించిన కాంగ్రెస్ హుజూరాబాద్ టీడీపీకి ఇవ్వనుందా..? కూకట్పల్లి వ్యూహం బెడిసికొట్టడంతో మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇనుగాల పెద్దిరెడ్డిని బుజ్జగించిన చంద్రబాబు హుజూరాబాద్ నుంచి రంగంలోకి దింపనున్నారా..? ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డిని బాబు అమరావతికి పిలుచుకున్నారా..? టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సమీప బంధువు పాడి కౌశిక్‌రెడ్డికి తొలి, రెండో జాబితాలో అవకాశం కల్పించకపోవడం వెనుక ఆసలు కారణం ఇదేనా..? హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పుడు జోరుగా చర్చించుకుంటున్న అంశాలు ఇవి. రెండు రోజులుగా రాష్ట్ర, దేశ రాజధానిలలో జరుగుతున్న పరిణామాలు కూడా వీటినే సూచిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకటి సీపీఐకి కేటాయించిన కాంగ్రెస్ పార్టీ 10 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. హుజూరాబాద్, కోరుట్లలో మాత్రం ఎవరినీ ప్రకటించలేదు. తాజాగా శనివారం కాంగ్రెస్ మూడో జాబితా విడుదల చేయనున్నట్లు ప్రకటించగా.. హుజూరాబాద్ నుం చి మహాకూటమి అభ్యర్థిగా పెద్దిరెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం శుక్రవారం నుంచి జోరందుకుంది. కూకట్పల్లి వ్యూహం బెడిసినందు వల్లే... హుజూరాబాద్‌కు పెద్దిరెడ్డి పేరు ప్రతిపాదన.. మహాకూటమికి రూపకల్పన జరిగిన మరుసటి రోజు నుంచే తెలుగుదేశం పార్టీ హుజూరాబాద్, కోరుట్ల స్థానాలను అడుగుతోంది. అదేవిధంగా సీపీఐ హుస్నాబాద్, టీజేఎస్ కరీంనగర్, హుజూరాబాద్, రామగుండంలపై దృష్టి పెట్టాయి. అయితే.. కాంగ్రెస్, కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులు పలు దఫాలుగా జరిపిన చర్చల అనంతరం సీట్ల సర్దుబాటులో రాజీ ధోరణి ప్రదర్శించాయి. ఇదే సమయంలో మొదట హుజూరాబాద్ స్థానాన్ని ఆశించిన ఇనుగాల పెద్దిరెడ్డి అధిష్టానం అంగీకారంతో కూకట్‌పల్లికి మారారు. ఇక మొదట కోరుట్ల నుంచి పోటీ చేయాలనుకున్న టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ కూడా విముఖత వ్యక్తం చేయడంతో జిల్లాలో ఆ రెండు స్థానాలకు టీడీపీ దూరమైంది. మూడు స్థానాలపై కన్నేసిన టీజేఎస్ సైతం స్థబ్దుగా ఉండగా, హుస్నాబాద్‌పై సీపీఐ మాత్రం పట్టు వీడలేదు. ఈ నేపథ్యంలో సీపీఐకి హుస్నాబాద్‌కు కేటాయించిన కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్, కోరుట్లలో తమ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమైంది. అప్పటికే రెండు విడతల్లో 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇదే సమయంలో కూకట్పల్లి స్థానాన్ని నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసినికి కేటాయించడంతో అక్కడ పెద్దిరెడ్డికి షాక్ తగిలింది. దీంతో మనస్థాపానికి గురైన పెద్దిరెడ్డి తనదైన శైలిలో చంద్రబాబు తీరుపై అసంతృప్తి వెళ్లగక్కారు. ఇదిలా వుంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు ఆయన భార్య, అల్లుడు వరసయ్యే మరొకరికి ఇప్పటికే టికెట్లు ఇచ్చినందువల్ల హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్‌రెడ్డికి టికెట్ ఇవ్వవద్దని కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఫిర్యాదు చేశారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని హుజూరాబాద్ నుంచి పెద్దిరెడ్డిని పోటీలోకి దింపాలన్న యోచనలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అమరావతిలో చంద్రబాబుతో పెద్దిరెడ్డి భేటీ.. ఢిల్లీ నుంచి కౌశిక్‌రెడ్డి తిరుగుపయనం.. తాజా పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం అమరావతికి పిలిపించుకున్నారు. కూకట్పల్లి టికెట్ అనివార్యంగా సుహాసినికి ఇవ్వాల్సి రావడంతో హుజూరాబాద్ నుంచి మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసే విషయమై చంద్రబాబు అమరావతిలో పెద్దిరెడ్డితో చర్చించినట్లు తెలిసింది. కూకట్‌పల్లిపై మాట ఇవ్వడంతో అక్కడ తాను ప్రచారం చేసుకున్న తరుణంలో హఠాత్తుగా జరిగిన మార్పుపై ఈ సందర్భంగా పెద్దిరెడ్డి కొంత ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాగా.. హుజూరాబాద్ నుంచి పోటీ చేసినా తెలుగుదేశం పార్టీ, సైకిల్ గుర్తుపై పోటీ చేస్తే ఓట్లు పడవన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో ఓ స్థానం నుంచి ఖచ్చితంగా పోటీ చేయాలనుకుంటున్న టీడీపీ నేత కోరుట్ల విషయమై కూడా కొంత సమాలోచనలు జరిపినట్లు చెప్తున్నారు. ఒకవేళ హుజూరాబాద్ నుంచి పోటీ చేయాల్సి వస్తే టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి చేయి గుర్తుపై చేస్తే ఫలితం ఉంటుందన్న చర్చ జరిగినట్లు సమాచారం. ఇదిలా వుంటే మొదటి జాబితాలోనే తన పేరు వస్తుందని భావించిన పాడి కౌశిక్‌రెడ్డి తొలి, రెండో జాబితాల్లో రాకపోవడంతో ఖంగుతిన్నారు. చివరి ప్రయత్నంగా శుక్రవారం ఆయన ఢిల్లీకి రాహుల్‌గాంధీని కలిసినా విషయం తేలకపోవడంతో కౌశిక్‌రెడ్డి తిరుగు పయనమయ్యారు. కాగా.. శనివారం కాంగ్రెస్ తుది జాబితా ప్రకటన నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇటు కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు, అటు టీడీపీ నాయకులు మరోమారు సమావేశం అవుతున్నట్లు ప్రకటించారు. చివరి నిమిషంలో ఏ పరిణామాలు జరుగుతాయి? కాంగ్రెస్, టీడీపీలు హుజూరాబాద్ నుంచి ఎవరిని బరిలోకి దింపుతాయి? హుజూరాబాద్ అభ్యర్థి కౌశిక్రెడ్డా? పెద్దిరెడ్డా? అన్న సస్పెన్స్‌కు నేడు తెరపడనుంది. -
తెలుగుదేశంలో గందరగోళం
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ తెలుగుదేశం పార్టీలో రోజురోజుకూ గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. పూర్వ కరీంనగర్ జిల్లాలో ఒకప్పుడు ఘనమైన చరిత్ర గల పచ్చపార్టీకి తెలుగు తమ్ముళ్లు ఇటీవల గట్టి షాకే ఇచ్చారు. రేవంత్‌రెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరగా.. ఇంకొందరు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం టీటీడీపీ నేతలతో నిర్వహించిన సమీక్షలో చేసిన ప్రకటనలు మరింత గందరగోళంలో పడేశాయి. పొత్తులపై ఆయన చేసిన అస్పష్టమైన ప్రకటన పార్టీ కేడర్‌లో తర్జనభర్జనలకు తెరతీసింది. తెలంగాణలో పార్టీని వదిలేది లేదని.. విలీనం ఊసే లేదని.. పొత్తులు ఖచ్చితంగా ఉంటాయంటూనే.. ఎన్నికల ముందే ప్రకటిస్తామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం లేపుతున్నాయి. సాక్షిప్రతినిధి, కరీంనగర్: 2014లో పొత్తులు పెట్టుకుని, ఇన్నాళ్లు బీజేపీతో అంటగాగిన చంద్రబాబు బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదనడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆ పార్టీ నేతలే అంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఇప్పటికే ఒంటిరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు లేకపోతే ఇక మిగిలింది అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీనే. గతంలో టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేయాలంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో చంద్రబాబు చేసిన పొత్తు ఉంటాయని ప్రకటన చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్తోనే పొత్తు ఉంటుందని పరోక్షంగా సంకేతాలిచ్చినట్లేనని జిల్లా నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే టీడీపీని వీడిన సీనియర్లు..మిగిలింది ఇద్దరే.. తెలంగాణ టీడీపీలో రెండేళ్లుగా స్థబ్దత నెలకొనడంతో గత ఎన్నికల్లో పార్టీ టికెట్లపై పోటీ చేసిన వారు, కష్టాల్లోనూ పార్టీని పట్టుకొని ఉన్నవారు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 2014 ఎన్నికల్లో పోటీ చేసిన కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు, చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జి మేడిపల్లి సత్యం, హుజూరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు ముద్దసాని కశ్యప్‌రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు అన్నమనేని నర్సింగారావు, హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు పేర్యాల రవీందర్రావు, మంథని నియోజకవర్గ అధ్యక్షుడు కర్రు నాగయ్య గులాబీ కండువా కప్పుకున్నారు. వీరితోపాటు ఉమ్మడి జిల్లాలోని వీరి అనుచరులు, సీనియర్ నేతలు టీడీపీని వదిలి తమ భవిష్యత్‌ను చక్కదిద్దుకునేందుకు ఇతర పార్టీల్లో చేరారు. దీంతో మూడు జిల్లాల పార్టీ అధ్యక్షులు, 9 నియోజకవర్గాలకు ఇన్చార్జీలు లేకుండా పోయారు. కాగా.. టీడీపీకి ఒకప్పుడు కంచుకోటగా ఉన్న కరీంనగర్ జిల్లాలో మంత్రుల స్థాయిలో పనిచేసి ముఖ్యనేతలుగా ఉన్న తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, జాతీయ అధికార ప్రతినిధి ఇనుగాల పెద్దిరెడ్డి మాత్రమే పార్టీకి పెద్దదిక్కుగా మిగిలారు. అయినా.. కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలకు అధ్యక్షులే లేకుండా పోయారు. అదేవిధంగా కరీంనగర్, రామగుండం, వేములవాడ నియోజవర్గాలకు 2014 ఎన్నికల నాటి నుంచే నియోజకవర్గ అధ్యక్షులు లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం జగిత్యాలకు రమణ, కోరుట్లకు సాంబారి ప్రభాకర్, ధర్మపురికి జాడిబాల్‌రెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. కరీంనగర్ నియోజకవర్గానికి ఇన్చార్జి లేకపోయినా సీనియర్ నాయకుడు, పార్టీ నగర అధ్యక్షుడు కళ్యాడపు ఆగయ్య పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా కృషిచేస్తున్నారు. చందా గాంధీ, కందుల ఆదిరెడ్డిలాంటి సీనియర్లు పార్టీ కోసం పని చేస్తున్నారు. పొత్తులతో ఎవరికి లాభం.. పార్టీలో మిగిలేది ఎవరు.. టీడీపీ వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం ఖాయమని పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే.. ఏ పార్టీతో పొత్తు అనే విషయాన్ని తేల్చకపోయినప్పటికీ టీఆర్ఎస్తో పొత్తు ఉంటుందనే అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే పార్టీని వీడిన నేతల్లో అంతర్మథనం మొదలైంది. అధికార టీఆర్ఎస్తో పొత్తు కుదిరితే తమ పరిస్థితి ఏంటని టీఆర్ఎస్లో చేరిన నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా జరిగితే జగిత్యాల నియోజకవర్గానికి టీడీపీ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణకు మాత్రమే లాభం చేకూరే అవకాశం ఉంది. జగిత్యాలలో టీఆర్ఎస్ టికెట్ కోసం చాలా మందే పోటీ పడుతున్నా.. బలమైన నాయకుడు లేకపోవడంతో రమణకు లాభం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక మిగిలిన మరో సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డికి మాత్రం బెర్త్ ఖరారు అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. పొత్తులో పెద్దిరెడ్డికి హుజూరాబాద్, హుస్నాబాద్ స్థానాలు దక్కే అవకాశం లేదు. హుజూ రాబాద్‌కు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, హుస్నాబాద్‌కు కెప్టెన్ లక్ష్మీకాంతరావు తనయుడు వొడితెల సతీష్‌బాబు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిని కాద ని పొత్తులో టీడీపీకి ఈ రెండు స్థానాల్లో ఇవ్వడం సాధ్యపడే అవకాశాలు తక్కువే. టీఆర్ఎస్తో పొత్తు కుదిరితే పెద్దిరెడ్డికి ఇబ్బందికరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన ఎన్నికలకు ముందే తన భవితవ్యం తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏ ర్పడింది. ఇదిలా వుండగా ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వలసలతో తెలుగుదేశం పార్టీ ఆవసాన దశకు చేరగా, ఆ పార్టీ నేత చంద్రబాబు ప్రకటన టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పొత్తులు వల్ల ప్రతికూల పరిస్థితులు ఉండే మరికొందరు సీనియర్లు సైతం టీడీపీకి గుడ్‌బై చెప్పే అవకాశం ఉండగా, పార్టీలో చివరకు ఎవరు మిగులుతారనే చర్చ జోరందుకుంది. -
‘అసెంబ్లీ’ బహిష్కరణ యోచనలో వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: వచ్చే నెలలో జరగనున్న శాసనసభ శీతాకాల సమావేశాలను బహిష్కరించాలని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ యోచిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక వైఖరి వల్ల రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, ఇతర అన్ని వర్గాలు ఇక్కట్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో తాను చేపట్టనున్న పాదయాత్రపై చర్చించేందుకు సోమవారం అందుబాటులో ఉన్న సీనియర్ నాయకులతో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. పార్టీ ముఖ్యనేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పిల్లి సుభాష్‌చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, వి.విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి, శెట్టిపల్లి రఘురామిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆదిమూలపు సురేష్, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పీడిక రాజన్న దొర, షేక్ అంజాద్ బాషా, దాడిశెట్టి రాజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ప్రలోభపెట్టి ఫిరాయింపులు: జగన్ పాదయాత్రతో పాటు అసెంబ్లీ సమావేశాలు ఇతర పలు అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ సమావేశాలపై చర్చ సందర్భంగా వీటికి హాజరుకాకుండా బహిష్కరించాలన్న అభిప్రాయం నేతల నుంచి వ్యక్తమైనట్లు తెలిసింది. ఈచర్చలో సభ్యులు పలు అంశాలు ప్రస్తావించారు. వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచిన 20 మంది ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు ప్రలోభాలకు గురిచేసి రాజ్యాంగ విలువలను కాలరాస్తూ టీడీపీలోకి చేర్చుకున్నారని నేతలు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలపై నమ్మకం ఉంటే ఫిరాయింపుదారులతో రాజీనామాలు చేయించాలని వైఎస్సార్ సీపీ పలుమార్లు సవాల్ విసిరినా అధికార టీడీపీ కిమ్మనలేదని గుర్తు చేశారు. ఒకపార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన వీరిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా అధికార పార్టీవైపు కూర్చునేలా వారికి ఏర్పాట్లు చేయించారన్నారు. 26న చర్చించాక తుది నిర్ణయం: పెద్దిరెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావటానికి సంబంధించి ఈనెల 26న పార్టీ శాసన సభాపక్ష సమావేశంలో చర్చించాక నిర్ణయం తీసుకోనున్నట్లు వైఎస్సార్ సీపీ శాసన సభాపక్ష డిప్యూటీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో ఇతర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పార్టీ నేతలు, కార్యకర్తలంతా అన్ని వర్గాలకు అండగా సమాంతరంగా పలు కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో వైఎస్ జగన్ సూచించినట్లు తెలిపారు. -
రేవంత్‌రెడ్డి వార్నింగ్
సిరిసిల్ల: ప్రాణంలేని లారీకి ఉన్న విలువ మనుషుల ప్రాణాలకు లేదా అని టీడీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. హీరోయిన్లను పరామర్శించే మంత్రి కేటీఆర్‌కు నేరెళ్ల బాధితుల వద్దకు వచ్చే సమయం లేదా అని నిలదీశారు. శుక్రవారం ఆయన నేరెళ్ల బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్పీకి చితక్కొట్టే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఈనెల 15లోగా బాధితులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన కుటుంబానికి రూ. 10 లక్షలు, గాయపడివారికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇసుకతో రూ.వెయ్యి కోట్లు వస్తే బాధిత కుటుంబాలకు ఎందుకు సాయం చేయడం లేదని నిలదీశారు. వందల కోట్లు కొల్లగొట్టేందుకు కేసీఆర్ తన బంధువులకే ఇసుక కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆరోపించారు. తాను చేసిన ఆరోపణలు అబద్ధమైతే తనపై కేసులు పెట్టాలన్నారు. 15లోగా నెరెళ్ల బాధితులకు న్యాయం చేయకుంటే అన్ని రాజకీయ పక్షాలను కలుపుకుని కేసీఆర్ సంగతి చూస్తామని హెచ్చరించారు. నేరెళ్ల ఘటనలో పోలీసులు ఎందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సి వచ్చిందని మరో టీడీపీ నేత ఇ. పెద్దిరెడ్డి ప్రశ్నించారు. పోలీసులు రజాకార్ల కంటే ఘోరంగా వ్యవహరించారని మండిపడ్డారు. నేరెళ్ల ఘటనపై సీఎం కేసీఆర్ సంజాయిషీ చెప్పుకోవాల్సింది పోయి మీడియా సమావేశంలో అహంభావంతో మాట్లాడారని దుయ్యబట్టారు. -
కరువు, చంద్రబాబు కవలలు
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శ - మునగాలలో ఇంటింటి ప్రచారం నంద్యాలరూరల్: కరువు, చంద్రబాబు కవల పిల్లల్లాంటి వారని పుంగనూరు శాసన సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కవల పిల్లల మధ్య విడదీయరాని సంబంధం ఉంటుందని, ఇదే తరహాలో చంద్రబాబు ఎక్కడుంటే అక్కడ కరువు ఉంటుందని తెలిపారు. మండల పరిధిలోని మునగాల గ్రామంలో శనివారం సర్పంచ్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇటు వర్షం రాక, అటు కాల్వకు నీరు రాక పంటలు ఎండిపోతున్నాయని, ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామ రైతులు ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తెచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ చంద్రబాబు గత తొమ్మిదేళ్ల పాలనలో రైతులు కరువు కాటకాలతో అల్లాడి పోయారన్నారు. ప్రస్తుతం కూడా అదే పరిస్థితి నెలకొందన్నారు. అరకొరగా పండిన పంటలకు సైతం గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. చంద్రబాబు హయాంలో రైతులకు మంచి రోజులు రావన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు గత ఎన్నికల్లో హామీ ఇచ్చారని, చంద్రబాబు మాత్రం రూ. 5వేల కోట్లు ఇస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఆ ఊసెత్తలేదన్నారు. వైఎస్సార్ పాలనలో రైతులు కరువును చూడలేదని, మళ్లీ రాజన్న రాజ్యం వచ్చేలా రైతులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తండ్రి బాటలో నడుస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి రైతుల అండదండలు ఎంతో అవసరమన్నారు. అధికారంలోకి వస్తే చిన్న, సన్న కారు రైతులకు నాలుగేళ్లపాటు ఏటా రూ.12,500 చొప్పున ఇచ్చేందుకు ప్లీనరీలో హామీ ఇచ్చారని చెప్పారు. చెప్పిన మాట అమలు చేయడం జగన్‌కే సాధ్యమన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో సౌమ్యుడు, పరిపాలన అనుభవం ఉన్న శిల్పామోహన్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి రాష్ట్ర రాజకీయాల్లో మార్పునకు పునాది వేయాలని కోరారు. ప్రచారంలో పీలేరు, సత్యవేడు, పూతలపట్టు ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, సునిల్‌కుమార్, వేపంజరి వైఎస్సార్సీపీ ఇన్చార్జి ఆదిమూలం, నాయకులు ఖలీల్ అహమ్మద్, మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్లు విజయశేఖర్‌రెడ్డి, పురుషోత్తమరెడ్డి, పోలూరు మహేశ్వరరెడ్డి, మునగాల మాజీ సర్పంచ్ నాగపుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
బోరు సీజ్ చేస్తున్నారని రైతు ఆత్మహత్యాయత్నం
పుట్లూరు(శింగనమల): పుట్లూరు చెరువులో పెద్దిరెడ్డి అనే రైతు బుధవారం ఆత్మహత్యాయత్నం చేశారు. ఎటువంటి అనుమతి లేకుండా, బోరు వేయడంతో తహసీల్దార్ రామచంద్రారెడ్డి తమ సిబ్బందితో వెళ్లి సీజ్ చేసేందుకు ప్రయత్నించడంతో మనస్తాపానికి గురైన సదరు రైతు ఈ చర్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు, తోటి రైతుల కథనం మేరకు.. పుట్లూరు చెరువులో రైతులు అక్రమంగా బోరుబావులను తవ్వడంతో భూగర్భ జలాలు అడుగంటి తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పలు గ్రామాల ప్రజలు తహసీల్దార్‌కు మార్చి 6న ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన అదే నెల 24న బోరుబావులను సీజ్ చేశారు. దీనిపై పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించి యధాస్థితిని కొనసాగించాలంటూ ఉత్తర్వులు తెచ్చుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి బోరుబావిని సీజ్ చేసేందుకు రెవెన్యూ అధికారులు బుధవారం వెళ్లారు. విద్యుత్ మోటర్‌ను తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో అవమానంగా భావించిన రైతు.. దానిమ్మ తోటలో దాచి ఉంచిన పురుగుల తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై తహసీల్దార్ రామచంద్రారెడ్డిని వివరణ కోరగా.. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు పుట్లూరు చెరువులో 30 బోరుబావులను సీజ్ చేశామన్నారు. అందులో పెద్దిరెడ్డి అనే రైతు బోరు కూడా ఉండగా, ఆయన కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నట్లు వివరించారు. సీజ్ చేసిన బోరుబావులను బ్రేక్ చేసి విద్యుత్ మోటర్లను దింపారని తెలిపారు. -
వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం తథ్యం
ఎల్బీపురం(తవణంపల్లె): తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని, రానున్న ఎన్నికల్లో వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోస్యం చెప్పారు. సోమవారం తవణంపల్లె మండలంలోని ఓ కల్యాణ మండపం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షుడు ఎల్.సురేష్‌బాబురెడ్డి స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమేగాక వారికి మంత్రి పదవులు అప్పగించి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం దారుణ మన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టిన ఘనత చంద్రబాబుకు దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గాంధీబాబు, పార్టీ తవణంపల్లె, ఐరాల మండలాధ్యక్షులు సురేష్‌బాబురెడ్డి, బుజ్జిరెడ్డి పాల్గొన్నారు. -
భర్తను కడతేర్చిన భార్య
యల్లనూరు : యల్లనూరు మండలం పెద్దమల్లేపల్లిలో పెద్దిరెడ్డి(45)ను అతని భార్య అర్ధరాత్రి రోకలిబండతో కొట్టి చంపింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి వివాహం వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం కడపనాగయ్యపల్లికి చెందిన నాగేశ్వరమ్మతో పాతికేళ్ల కిందట అయింది. వారికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. కొన్నేళ్లుగా వ్యసనాలకు బానిసైన భర్త పెద్దిరెడ్డి పూటుగా మద్యం తాగొచ్చి డబ్బుల కోసం భార్యతో గొడవపెట్టుకునేవాడు. అంతటితో ఆగక కొన్ని సందర్భాల్లో ఆమెపై భౌతికంగా కూడా దాడి చేసేవాడు. మరికొన్ని సందర్భాల్లో తనకు తాగేందుకు డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లోని వస్తువులను పెద్దిరెడ్డి అమ్మేసేవాడు. ఆత్మరక్షణ కోసం... గురువారం అర్ధరాత్రి దాటాక మద్యం మత్తులో ఉన్న పెద్దిరెడ్డి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అతని బారి నుంచి తనను తాను కాపాడుకునేందుకు రోకలితో తలపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన పెద్దిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. గొడవ జరుగుతున్న సమయంలో అరుపులు, కేకలు విన్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి పోలీసులు శుక్రవారం ఉదయానికల్లా ఈ సమాచారం అందరికీ తెలిసిపోయింది. సీఐ సురేంద్రనాథరెడ్డి, ఎస్ఐ హరినాథరెడ్డి తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై ఆరా తీశారు. అనంతరం కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
అవినీతి కోసం బాబు ఆరాటం
అలివిగాని అబద్ధాలతో గద్దెనెక్కారు వైఎస్సార్ సువర్ణ పాలన రావాలంటే జగన్ సీఎం కావాలి సత్యవేడులో గడపగడపకూ వైఎస్సార్ ముగింపు సభలో పెద్దిరెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సుపరిపాలన కోసం పరితపిస్తే చంద్రబాబు అవినీతి కోసం ఆరాటపడుతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రైతు రుణాలు, మహిళల బంగారు రుణాలు, డ్వాక్రా రుణాలు, నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి వంటి అలివిగాని హామీలిచ్చి గద్దె నెక్కిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలను నిట్టనిలువునా ముంచారన్నారు. సత్యవేడు నియోజకవర్గంలో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం ముగింపు సందర్భంగా వరదయ్యపాళెంలో ఆదివారం భారీ ర్యాలీ, అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణ స్వామి, ఎంపీ వర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. వరదయ్యపాళెం: దివంగత ముఖ్యమం త్రి వైఎస్.రాజశేఖరరెడ్డి సుపరిపాలన కోసం పరితపిస్తే చంద్రబాబు అవినీతి కోసం ఆరాటపడుతున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూ రు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సత్యవేడు నియోజకవర్గంలో గడపగడపకూ వైఎస్సార్ ముగింపు సం దర్భంగా వరదయ్యపాళెంలో ఆదివారం భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిం చారు. ముఖ్య అతిథిగా హాజరైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను, భృతి పేరుతో నిరుద్యోగులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసం చేశారని విమర్శించారు. మోసపూరిత పాలకులకు బుద్ధి చెబుతూ సత్యవేడు నియోజకవర్గ విజయంతో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాలన్నారు. గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కంటే ముందుగా పూర్తి కావడం ప్రశంసనీయమని కొనియాడారు. పార్టీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త కోనేటి ఆదిమూలంను, తిరుపతి పార్లమెంటు సభ్యుడు వరప్రసాదరావును 2019 ఎన్నికల్లో ఆదరించాలని కోరారు. జగన్ సీఎం అయితే సత్యవేడు అభివృద్ధి వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సత్యవేడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అన్ని రంగాల్లో అభివృ ద్ధి చేశారని, అదే స్ఫూర్తితో ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి సీఎం అయితే సత్యవేడును సస్యశ్యామలం చేస్తారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కే.నారాయణస్వామి పేర్కొన్నారు. వైఎస్ కులమతాలకతీతంగా అభివృద్ధి చేపడితే నేడు తెలుగుదేశం ప్రభుత్వం ఒక వర్గానికే పరిమితమైందని విమర్శించారు. పెద్దిరెడ్డి సారథ్యంలో రానున్న ఎన్నికలలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పోకల అశోక్‌కుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి విద్యానాథరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏవీఎం బాలాజీ రెడ్డి, జిల్లా కార్యదర్శులు రాధాకృష్ణారెడ్డి, వెంకటకృష్ణయ్య, మునిశేఖర్‌రెడ్డి, పలువురు మండల నాయకులు పాల్గొన్నారు. -
వేరుశనగ రైతులను ఆదుకోవాలి
రాప్తాడు: ఖరీఫ్‌లో వేరుశనగ పంట సాగు చేసి నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. రైతు సంఘం నాయకులతో కలిసి గురువారం ఆయ న రాప్తాడుకు చెందిన కౌలు రైతు కాటమయ్య ఏడు ఎకరాల్లో సాగు చేసిన వేరుశనగ పంటను పరిశీలించారు. ఇప్పటి వరకు పంట పెట్టుబడి కోసం రూ.1.50 లక్షలు అప్పు చేసి ఖర్చు పెట్టినట్లు ఈ సందర్భంగా రైతు వారి దృష్టికి తీసుకువచ్చారు. వర్షాలు రాకపోవడంతో పంట పూర్తిగా ఎండిపోయిందని, అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదం టూ వాపోయాడు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో 15 లక్షల ఎకరాల్లో వేరుశనగను రైతులు సాగు చేస్తున్నారని తెలిపారు. వర్షం రాకపోవడంతో పంట పూర్తిగా ఎండిపోయిందన్నారు. గతంలో పంట నష్టపోతే బీమా పరిహారం ద్వారా లబ్ధి చేకూరేదని, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ హయాంలో పంటల బీమా కూడా అందడం లేదని తెలిపారు. వేలాది మంది రైతులు పంట నష్టపోతే వంద ల సంఖ్యలో మాత్రమే ఇన్పుట్ సబ్సి డీ మంజూరు చేస్తున్నారని మండిపడ్డారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకూ రూ. పది వేలు పరిహారం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాప్తాడు డివిజన్ రైతు సంఘం నాయకులు కదిరప్ప, రామాంజినేయులు, చంద్రశేఖరరెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి, పుల్లలరేవు గోపాల్, నాగేంద్ర, నారాయణ, హనుమంతరెడ్డి, పుల్లప్ప, బీరప్ప, మాధవరెడ్డి, యర్రపరెడ్డి పాల్గొన్నారు. -
‘సమస్యలపై సీఎంను నిలదీస్తాం’
అనంతపురం అర్బన్ : జిల్లాకు శనివారం వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును రైతాంగ సమస్యలు, రైతు ఆత్మహత్యలపై నిలదీస్తామని ఏపీ రైతు సంఘం (సీపీఎం) రాష్ట్ర అధ్యక్షుడు పెద్దిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో రైతులు ఆత్మహత్య చేసుకున్నా షరుతుల పేరుతో పరిహారం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఏపీ డైరీ పరిధిలోని రైతులకు రూ.కోట్ల పాల బిల్లుల బకాయిలు చెల్లించకుండా పాడి రైతుల్ని అప్పుల పాలు చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో బలవంతపు భూసేకరణ నిలిపివేయాలని, ఎన్పీ కుంటలో సోలార్ హబ్‌కి సేకరించిన భూములకు సంబంధించి పరిహారాన్ని సాగుదారులు, రైతులకు ఇవ్వాలనే డిమాండ్లతో ముఖ్యమంత్రిని నిలదీస్తామని తెలిపారు. -
రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పెద్దిరెడ్డి
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా పూల పెద్దిరెడ్డి, బి.నారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఇందుక సంబంధించిన వివరాలను వారు వెల్లడించారు. గుంటూరులోని కొరటాల భవన్లో బుధవారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు చెప్పారు. పట్టాదారు పాసుపుస్తకాలు రద్దు చేస్తూ జారీ చేసిన జీఓ 271 రద్దుచేయాలని, వెనుకబడిన రాయలసీమలో హంద్రీనీవా, గాలేరి–నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులకు రూ. 6వేల కోట్లు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూ. 5వేల కోట్లు మంజూరు చేయాలని తీర్మానించినట్లు చెప్పారు. -
2న వంచన దినం
ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజలను వంచించిన చంద్రబాబు అన్ని నియోజకవర్గాల్లోని పోలీస్ స్టేషన్ల ఎదుట ఆందోళన వైఎస్సార్ సీపీ జిల్లా వ్యవహారాల ఇన్చార్జి పెద్దిరెడ్డి విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ప్రజలను మోసం చేసినందుకు జూన్ రెండో తేదీని వంచన దినంగా నిర్వహిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వ్యవహారాల ఇన్చార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆ రోజు అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో గెలుపు కోసం అనేక హామీలు ఇచ్చిందని, అయితే నేటికీ వాటిని నెరవేర్చకుండా రైతులు, డ్వాక్రా మహిళలు, ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తిరుపతిలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్నికల హామీలన్నీ నెరవేర్చామని, హామీ ఇవ్వని అనేక కార్యక్రమాలను కూడా అమలు చేశామని చెప్పడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. ఎన్నికల హామీలు నెరవేర్చని ప్రభుత్వంపై పోరు సాగించేందుకే వంచన దినం పాటిస్తున్నామని పేర్కొన్నారు. అవాక్కవుతున్న టీడీపీ నేతలు రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా రుణాల పేరిట మహిళలను, ఉద్యోగాలు, భృతి పేరిట నిరుద్యోగులను చంద్రబాబు వంచనకు గురిచేశారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఒక్క హామీ నెరవేర్చకుండా, అన్నీ పూర్తిచేశామని చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పడంతో తెలుగుదేశం పార్టీ నేతలే అవాక్కయ్యారని ఎద్దేవాచేశారు. చంద్రబాబు చేస్తున్న వంచనకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జూన్ 2న వంచన దినంగా పాటిస్తోందని చెప్పారు. 2వ తేదీన జిల్లాలోని అన్ని నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో ఉన్న పోలీస్ స్టేషన్ల ఎదుట ధర్నాచేసి, హామీలు నెరవేర్చని సీఎం చంద్రబాబుపై ఆయా స్టేషన్ల సీఐలకు రాతపూర్వకంగా ఫిర్యాదులు అందించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా, నగర అధ్యక్షులు కొలసు పార్థసారథి, వంగవీటి రాధా, పార్టీ నగర వ్యవహారాల ఇన్చార్జి లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కాజా రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.