జిల్లాకు శనివారం వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును రైతాంగ సమస్యలు, రైతు ఆత్మహత్యలపై నిలదీస్తామని ఏపీ రైతు సంఘం (సీపీఎం) రాష్ట్ర అధ్యక్షుడు పెద్దిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అనంతపురం అర్బన్ : జిల్లాకు శనివారం వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును రైతాంగ సమస్యలు, రైతు ఆత్మహత్యలపై నిలదీస్తామని ఏపీ రైతు సంఘం (సీపీఎం) రాష్ట్ర అధ్యక్షుడు పెద్దిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో రైతులు ఆత్మహత్య చేసుకున్నా షరుతుల పేరుతో పరిహారం ఇవ్వడం లేదని పేర్కొన్నారు.
ఏపీ డైరీ పరిధిలోని రైతులకు రూ.కోట్ల పాల బిల్లుల బకాయిలు చెల్లించకుండా పాడి రైతుల్ని అప్పుల పాలు చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో బలవంతపు భూసేకరణ నిలిపివేయాలని, ఎన్‌పీ కుంటలో సోలార్ హబ్‌కి సేకరించిన భూములకు సంబంధించి పరిహారాన్ని సాగుదారులు, రైతులకు ఇవ్వాలనే డిమాండ్లతో ముఖ్యమంత్రిని నిలదీస్తామని తెలిపారు.