అవినీతి కోసం బాబు ఆరాటం
అలివిగాని అబద్ధాలతో గద్దెనెక్కారు
వైఎస్సార్ సువర్ణ పాలన రావాలంటే జగన్ సీఎం కావాలి
సత్యవేడులో గడపగడపకూ వైఎస్సార్ ముగింపు సభలో పెద్దిరెడ్డి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సుపరిపాలన కోసం పరితపిస్తే చంద్రబాబు అవినీతి కోసం ఆరాటపడుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రైతు రుణాలు, మహిళల బంగారు రుణాలు, డ్వాక్రా రుణాలు, నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి వంటి అలివిగాని హామీలిచ్చి గద్దె నెక్కిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలను నిట్టనిలువునా ముంచారన్నారు. సత్యవేడు నియోజకవర్గంలో గడప గడపకు వైఎస్‌ఆర్ కార్యక్రమం ముగింపు సందర్భంగా వరదయ్యపాళెంలో ఆదివారం భారీ ర్యాలీ, అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణ స్వామి, ఎంపీ వర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు.
వరదయ్యపాళెం: దివంగత ముఖ్యమం త్రి వైఎస్.రాజశేఖరరెడ్డి సుపరిపాలన కోసం పరితపిస్తే చంద్రబాబు అవినీతి కోసం ఆరాటపడుతున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూ రు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సత్యవేడు నియోజకవర్గంలో గడపగడపకూ వైఎస్సార్ ముగింపు సం దర్భంగా వరదయ్యపాళెంలో ఆదివారం భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిం చారు. ముఖ్య అతిథిగా హాజరైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను, భృతి పేరుతో నిరుద్యోగులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసం చేశారని విమర్శించారు. మోసపూరిత పాలకులకు బుద్ధి చెబుతూ సత్యవేడు నియోజకవర్గ విజయంతో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాలన్నారు. గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కంటే ముందుగా పూర్తి కావడం ప్రశంసనీయమని కొనియాడారు. పార్టీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త కోనేటి ఆదిమూలంను, తిరుపతి పార్లమెంటు సభ్యుడు వరప్రసాదరావును 2019 ఎన్నికల్లో ఆదరించాలని కోరారు.
జగన్ సీఎం అయితే సత్యవేడు అభివృద్ధి
వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సత్యవేడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అన్ని రంగాల్లో అభివృ ద్ధి చేశారని, అదే స్ఫూర్తితో ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే సత్యవేడును సస్యశ్యామలం చేస్తారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కే.నారాయణస్వామి పేర్కొన్నారు. వైఎస్ కులమతాలకతీతంగా అభివృద్ధి చేపడితే నేడు తెలుగుదేశం ప్రభుత్వం ఒక వర్గానికే పరిమితమైందని విమర్శించారు. పెద్దిరెడ్డి సారథ్యంలో రానున్న ఎన్నికలలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పోకల అశోక్‌కుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి విద్యానాథరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏవీఎం బాలాజీ రెడ్డి, జిల్లా కార్యదర్శులు రాధాకృష్ణారెడ్డి, వెంకటకృష్ణయ్య, మునిశేఖర్‌రెడ్డి, పలువురు మండల నాయకులు పాల్గొన్నారు.