లోకేశ్‌ను పక్కనపెడితేనే: లక్ష్మీపార్వతి | lakshmi parvathi comments on TDP over Lokesh Role in Party | Sakshi
Sakshi News home page

టీడీపీ బాగుపడాలంటే లోకేశ్‌ను పక్కనపెట్టాలి..

Published Thu, Jul 4 2019 11:05 AM | Last Updated on Thu, Jul 4 2019 11:09 AM

lakshmi parvathi comments on TDP over Lokesh Role in Party - Sakshi

సాక్షి, తిరుమల : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు, మాజీమంత్రి నారా లోకేశ్‌పై లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం లక్ష్మీపార్వతి మాట్లాడుతూ..‘లోకేశ్‌ ఎంత మాట్లాడితే టీడీపీ అంత భ్రష్టు పడుతుంది. తెలుగుదేశం పార్టీ బాగుపడాలి అంటే లోకేశ్‌ను పక్కన పెట్టాలి. మహిళలను కించపరిచేలా లోకేశ్‌ మరోసారి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ప్రజా పరిపాలన సాగుతోంది. ఇల్లు బాగు చేస్తూంటే ఎలుకలు ఏడ్చిన చందంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోంది’ అని దుయ్యబట్టారు.

శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు
కాగా పలువురు ప్రముఖులు ఇవాళ స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుపరిపాలన అందించాలని కోరుకున్నట్లు చెప్పారు. శ్రీవారి ఆశీస్సులతో రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ప్రార‍్థించినట్లు చెప్పారు. మరోవైపు ఎమ్మెల్యేలు ద్వారకానాథ్‌రెడ్డి, కాకాణి గోవర్థన్‌ రెడ్డి, లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ నిర్మాత రాకేశ్‌ రెడ్డి, రచయిత చిన్నికృష్ణ తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement