సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి సి.కృష్ణయాదవ్ బీజేపీలో చేరికకు బ్రేక్ పడింది. బుధవారం బీజేపీ కా ర్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పార్టీ లో చేరాల్సి ఉండగా, ఆ కార్యక్రమం వాయిదా పడింది. ఆయనపై ఉన్న స్టాంప్‌ల కుంభకో ణం కేసు, ఇతరత్రా కారణాలతో కొందరు నగర పార్టీ నేత లు కృష్ణయాదవ్ బీజేపీలోకి రావడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం.
గతంలో టీడీపీ, బీఆర్‌ఎస్‌లో ఉన్న కృష్ణ్ణయాదవ్‌ను చేర్చుకునే విషయంలో కోర్ కమిటీ ఇంకా తుది నిర్ణయం తీసుకోకముందే ఆయన చేరిక ముహూర్తం ఖరారు చేసుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మొత్తం మీద చేరిక కార్యక్రమం వాయిదా పడటంతో ఆయన అనుచరులు నిరాశకు గురయ్యారు.
కృష్ణయాదవ్, తుల ఉమ వ్యవహారంలో ఈటల కినుక!
కృష్ణయాదవ్‌ను పార్టీలో చేర్పించే విషయంలో కొంతకాలంగా సంప్రదింపులు జరిపి, పార్టీ నేతలతోనూ మాట్లాడిన రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కూడా ఈ పరిణామంతో అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది.
మరోవైపు అధికార బీఆర్‌ఎస్‌ను వదిలి తనతో పాటు బీజేపీలోకి వచ్చిన మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ ఆశిస్తున్న వేములవాడ అసెంబ్లీ స్థానం విషయంలో హామీ లభించక పోవడంపైనా ఈటల కినుక వహించినట్టు చెబుతున్నారు. మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు కుమారుడు డాక్టర్ వికాస్‌రావును పార్టీలో చేర్చుకోవడంపై కూడా ఆయన అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది.
త్వరలోనే బీజేపీలో చేరుతా: కృష్ణయాదవ్
నాంపల్లి (హైదరాబాద్): ‘బీఆర్‌ఎస్ పార్టీ కోసం ఏడేళ్లు పనిచేశాను. కానీ బీఆర్‌ఎస్ నన్ను గుర్తించలేదు. నా సేవలను వినియోగించుకోలేదు. మరో రెండు, మూడ్రోజుల్లో బీజేపీలో చేరి బడుగు బలహీన వర్గాలకు సేవ చేస్తా’అని మాజీ మంత్రి కృష్ణయాదవ్ అన్నారు.
ఈ మేరకు బుధవారం నాంపల్లిలోని రెడ్‌రోజ్ ఫంక్షన్ హాలులో పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కృష్ణయాదవ్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ టికెట్ ఇస్తానని చెప్పి రెండు పర్యాయాలు మోసం చేసిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment