
పోలీస్ బాస్‌లు మారారు..
సాక్షి ప్రతినిధి, వరంగల్ : పోలీస్ శాఖలో భారీ మార్పులు జరిగాయి. వరంగల్ అర్బన్, రూరల్ ఎస్పీలు, వరంగల్ రేంజ్ ఐజీ, డీఐజీలు బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వరరావు హైదరాబాద్‌లో వెస్ట్ జోన్ డీసీపీగా బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. తాత్కాలికంగా కూడా ఎవరికీ బాధ్యతలు అప్పగించలేదు. వరంగల్ రూరల్ ఎస్పీగా అంబర్ కిశోర్‌ఝా నియమితులయ్యారు.
ఈయన ప్రస్తుతం మన జిల్లాలోనే ఓఎస్‌డీగా పనిచేస్తున్నారు. రూరల్ ఎస్పీగా ఉన్న ఎల్‌కేవీ.రంగారావు హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. వరంగల్ రేంజ్ డీఐజీగా బి.మల్లారెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్‌గా ఉన్నారు. వరంగల్ రేంజ్ డీఐజీగా ఉన్న ఎం.కాంతారావు డీజీపీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. వరంగల్ రేంజ్ ఐజీగా వి.నవీన్‌చంద్ నియమితులయ్యారు.
ఇప్పటివరకు ఈ పోస్టులో ఉన్న రవి గుప్తాను హోంగార్డ్స్ ఐజీగా బదిలీ చేశారు. పోలీస్ ఉన్నతాధికారుల మార్పుల నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో డీఎస్సీలు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ల బదిలీలు జరగనున్నాయని తెలిసింది. అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా ఈ పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.