సాక్షి, హైదరాబాద్: తన అక్రమాలను ప్రశ్నించే వ్యక్తులను, రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడమే లక్ష్యంగా కేసీఆర్ ఏడాది పాలన సాగిందని టీటీడీపీ నేతలు ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజలను ఊహల్లో ఊరేగిస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో శుక్రవారం టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీతక్క, అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. అధికార బలంతో కేసీఆర్ టీడీపీ ఎమ్మెల్యేలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.