చంద్రబాబువి మాయమాటలు
గుంటూరు: జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఒక్కో ప్రాంతంలో ఒక్కో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము లేఖ ఇవ్వడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతోందని ఆ ప్రాంత ప్రజలకు, సీమాంధ్రను మరో సింగపూర్ చేస్తానంటూ సీమాంధ్ర ప్రజలను మాయ మాటలతో చంద్రబాబు మభ్యబెడుతున్నారని కిరణ్ మండిపడ్డారు.
తెనాలిలో శుక్రవారం జరిగిన రోడ్డు షోలో కిరణ్ పాల్గొన్నారు. మాయమాటలు చెప్పే చంద్రబాబుకు ఓటు అడిగే నైతిక హక్కు ఉందా అని కిరణ్ ప్రశ్నించారు.