నేడు పలాసలో కిరణ్ రోడ్డు షో
నేడు పలాసలో కిరణ్ రోడ్డు షో
Published Mon, Mar 17 2014 2:44 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
పలాస,న్యూస్‌లైన్: మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి సోమవారం పలాసలో రోడ్డు షో నిర్వహించనున్నట్టు మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాథం తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కిరణ్ పర్యటన షెడ్యూల్ వి వరించారు. మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీకాకుళం జిల్లా సరిహద్దు గ్రామమైన పైడి భీమవరం వద్దకు కిరణ్ చేరుకుంటారు. అక్కడ నుంచి శ్రీకాకుళం, నరసన్నపేటలో కొద్ది నిమిషాలు ఉండి నేరుగా పలాస మండలం లక్ష్మీపు రం టోల్‌గేటు వద్దకు సాయంత్రం నాలుగు గంటలకు చేరుకుంటారు.
అక్కడ నుంచి మోటారు వాహనాల ర్యాలీతో పలాస కోసంగిపురం కూడలి వద్దకు 4.30 గంటలకు కాశీబుగ్గ బస్టాండు వద్ద గల మహాత్మగాంధీ విగ్రహం వద్దకు చేరుకొని ప్రచార రథంపై నుంచి ప్రసంగిస్తారు. అనంతరం శ్రీకాకుళం వైఎస్‌ఆర్ రోడ్ల కూడలి వద్దకు రాత్రి 7.30 గంట లకు చేరుకొని అక్కడ రోడ్డు షోలో పాల్గొని ప్రజలనుద్దేశించి కిరణ్ ప్రసంగిస్తారు. రాత్రికి అక్కడే బస చేసి మంగళవారం ఉదయం అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకుంటారు. ఉదయం పది గంటలకు ఆమదాలవలస రోడ్డు షోలో పాల్గొంటారు. ఆ తర్వాత మాజీ మంత్రి సిగిలిపల్లి శ్యామలరావు కుటుం బాన్ని పరామర్శిస్తారన్నారు. సమావేశంలో సీనియర్ న్యాయవాది పైల రాజరత్నంనాయుడు, డాక్టరు దువ్వాడ జీవితేశ్వరరావు, పాలవలస వైకుంఠరావ పాల్గొన్నారు.
Advertisement
Advertisement