చెప్పు పార్టీకి ఉపాధ్యక్షుడి షాక్? | sailajanath to quit kiran kumar reddy party soon | Sakshi
Sakshi News home page

చెప్పు పార్టీకి ఉపాధ్యక్షుడి షాక్?

Published Wed, Mar 19 2014 3:42 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

చెప్పు పార్టీకి ఉపాధ్యక్షుడి షాక్? - Sakshi

చెప్పు పార్టీకి ఉపాధ్యక్షుడి షాక్?

చెప్పులతో తమను కొట్టాలని పెట్టుకున్నారో ఏమో గానీ.. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షుడిగా స్థాపించిన 'జై సమైక్యాంధ్ర పార్టీ'కి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. చెప్పులను తమ గుర్తుగా పెట్టుకున్న ఈ పార్టీకి ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న మాజీమంత్రి సాకే శైలజానాథ్ ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.

అప్పట్లో సమైక్యాంధ్ర కోసం పోరాడినవాళ్లలో శైలజానాథ్ ముందు వరుసలో ఉండటం అందరికీ తెలిసిందే. సొంత పార్టీకి వ్యతిరేకంగా కూడా ఆయన చాలాసార్లు మాట్లాడారు. కానీ ప్రయోజనం మాత్రం కనిపించలేదు. కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన కొత్త పార్టీలో ఆయనకు ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టినా, అది వద్దనుకుని ఇప్పుడు సైకిల్ ఎక్కాలని చూస్తున్నారట. ఈ ప్రయత్నాలు ఎంతవరకు సాగుతాయో చూడాలి!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement