ఎన్నికల బరి నుంచి తప్పుకున్నకిరణ్ కుమార్ రెడ్డి | kiran kumar reddy not to contest elections | Sakshi
Sakshi News home page

ఎన్నికల బరి నుంచి తప్పుకున్నకిరణ్ కుమార్ రెడ్డి

Published Sat, Apr 19 2014 12:15 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

ఎన్నికల బరి నుంచి తప్పుకున్నకిరణ్ కుమార్ రెడ్డి - Sakshi

ఎన్నికల బరి నుంచి తప్పుకున్నకిరణ్ కుమార్ రెడ్డి

పీలేరు : మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నారు.  చిత్తూరు జిల్లా   పీలేరు నుంచి ఆయన తన సోదరుడిని పోటీకి దించారు. కిరణ్ సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. కాగా తాను పోటీలో ఉంటే పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించడం కష్టమవుతోందని  కిరణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మరోవైపు జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడిగా కిరణ్‌  ప్రజలను ఆకర్షించలేకపోతున్నారని ఆ పార్టీ నేతలు వాదులాడుకుంటున్నారు. అదేవిధంగా ఆశించినంతగా నేతలు పార్టీలో చేరకపోవడం కూడా ప్రజలు కిరణ్‌ పార్టీని ఆదరించడం లేదని తెలుస్తోంది. నిన్నటిదాకా కిరణ్‌ గురించి గొప్పగా చెప్పిన ఎంపీలు హర్షకుమార్‌, సబ్బంహరి, ఉండవల్లి అరుణ్‌కుమార్‌లు కూడా ఆయన పేరు ఎత్తడానికి సాహసం చేయలేదు. పార్టీ అధ్యక్షుడే పోటీకి దూరంగా ఉంటే ఇక ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రావటం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement