హైదరాబాద్: జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించిన మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్కుమార్ రెడ్డి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. రాష్ట్రంలో ఆ పార్టీ తరపున ఒక్కరూ గెలిచే పరిస్థితి లేకపోగా.. సొంత నియోజకవర్గంలోనూ నల్లారికి షాక్ తగిలింది. కిరణ్ స్వయానా సోదరుడినే గెలిపించుకోలేకపోయారు. కిరణ్కుమార్ రెడ్డి ఓటమి భయంతో ఈసారి ఎన్నికల నుంచి తప్పుకుని సోదరుడు కిషన్ కుమార్ రెడ్డిని బరిలో దింపారు. అయితే ప్రజలు ఈసారి నల్లారి కుటుంబంపై దయ చూపలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతల రామచంద్రా రెడ్డి .. కిషన్ కుమార్ రెడ్డిపై విజయం సాధించారు.