హిందూపురంలో బాలయ్య విజయం | Balakrishna wins in Hindupur | Sakshi
Sakshi News home page

హిందూపురంలో బాలయ్య విజయం

Published Fri, May 16 2014 12:53 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

హిందూపురంలో బాలయ్య విజయం - Sakshi

హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వియ్యంకుడు, సినీ హీరో బాలకృష్ణ  నెగ్గారు. హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బాలయ్యకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ నిశ్చల్ గట్టి పోటీనిచ్చారు. హోరాహోరీ పోరు ఎదుర్కొన్న బాలయ్య .. నవీన్పై విజయం సాధించారు.

పోటీని ముందే గ్రహించిన బాలయ్య నియోజవర్గమంతా కలియతిరిగారు. ఆయన కుటుంబాన్ని కూడా రంగంలోకి దింపారు. బాలకృష్ణ భార్య, కుమార్తెలు విస్తృతంగా ప్రచారం చేశారు. స్థానికేతరుడు అనే విమర్శలు రావడంతో చివరకు హిందూపురంలో అద్దె ఇల్లు తీసుకుని గృహ ప్రవేశం చేశారు. ఇక్కడే ఉంటూ నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటానని బాలయ్య హామీ ఇచ్చారు. మరోవైపు స్థానికుడు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే నవీన్ ప్రచారంలో దూసుకెళ్లారు. బాలయ్య గట్టి పోటీనిచ్చారు.

Related News By Category

Related News By Tags

Advertisement