75 వేల మెజార్టీతో వైఎస్ జగన్ ఘనవిజయం | Y.S jagan mohan reddy win by 75,000 mejority | Sakshi

75 వేల మెజార్టీతో వైఎస్ జగన్ ఘనవిజయం

May 16 2014 4:00 PM | Updated on Aug 17 2018 8:19 PM

75 వేల మెజార్టీతో వైఎస్ జగన్ ఘనవిజయం - Sakshi

75 వేల మెజార్టీతో వైఎస్ జగన్ ఘనవిజయం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో జయభేరి మోగించారు.

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జయభేరి మోగించారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజవర్గం నుంచి బరిలో దిగిన వైఎస్ జగన్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వైఎస్ జగన్ 75 వేల ఓట్ల భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎస్ వి సతీష్ రెడ్డిపై ఘనవిజయం సాధించారు. వైఎస్ కుటుంబాన్ని దశాబ్దాలుగా ఆదరిస్తున్న పులివెందుల నియోజకవర్గం ప్రజలు మరోసారి అదే ఆదరణ చూపారు. వైఎస్ జగన్ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. గతంలో కడప లోక్సభ నియోజవర్గం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించిన వైఎస్ జగన్.. అసెంబ్లీకి తొలిసారి పోటీ చేశారు. తొలి ప్రయత్నంలోనే బంపర్ మెజార్టీతో గెలుపొందారు.

మూడు దశాబ్దాలకుపైగా పులివెందుల నియోజకవర్గం నుంచి వైఎస్ కుటుంబీకులే తిరుగులేని మెజార్టీతో విజయం సాధిస్తున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలిసారిగా 1978లో పులివెందుల నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత వైఎస్ కుటుంబానికి ఇక్కడ తిరుగేలేదు. నిత్యం ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ అమితమైన అభిమానం సంపాదించారు. వైఎస్ఆర్ వరుసగా మూడు సార్లు ఎన్నికయ్యాక కడప లోక్సభకు పోటీ చేసి గెలుపొందారు. వైఎస్ఆర్ తర్వాత సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి, చిన్నాన్న వైఎస్ పరుషోత్తం రెడ్డి విజయ బావుటా ఎగురవేశారు. 1999లో వైఎస్ఆర్ పులివెందుల నుంచి గెలిచి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. చరిత్రాత్మక పాదయాత్ర చేసి 2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకువచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. 2009 ఎన్నికల్లో ఘనవిజయం సాధించి రెండో సారి ముఖ్యమంత్రిగా కొనసాగారు. కాగా వైఎస్ఆర్ అకాల మరణంతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ సతీమణి  వైఎస్ విజయమ్మ గెలుపొందారు. వైఎస్ కుటుంబం నుంచి పులివెందుల నియోజకవర్గం నుంచి గెలిచిన ఐదో వ్యక్తి వైఎస్ జగన్ కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement