పుట్టపర్తి టౌన్/అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రోడ్‌షోలకు జన స్పందన కరువైంది. బుధవారం ఉదయం బెంగళూరు నుంచి పుట్టపర్తికి చేరుకున్న కిరణ్‌కుమార్‌రెడ్డి.. 11 గంటలకు ఎనుములపల్లి గణేష్ సర్కిల్ మీదుగా సాయి ఆరామం టూరిజం హోటల్‌కు చేరుకున్నారు. ఎనుములపల్లి గణేష్ సర్కిల్ వద్ద కిరణ్‌కు స్వాగతం పలికేందుకు ఆ పార్టీ పుట్టపర్తి, హిందూపురం, రాప్తాడు, గుంతకల్లు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో పాటు ఐదారుగురు చోటామోటా నాయకులు వచ్చారు.
సాయి ఆరామంలో కిరణ్‌ను కలవడానికి వచ్చిన నాయకులకంటే సెక్యూరిటీ, మీడియా ప్రతిని ధులే ఎక్కువగా ఉండడం విశేషం. ఈ విషయాన్ని గ్రహించిన కిరణ్.. ‘ఏమ య్యా మీడియా సిబ్బందే ఎక్కువగా ఉన్నారే’ అంటూ పుట్టపర్తి నాయకులను అడిగారు. అంతలోనే అమడగూరు, ఓడిసీ మండలాల నుంచి నాలుగు వాహనాల్లో అక్కడికి చేరుకున్న 50 మందిని స్థానిక నాయకులు కిరణ్‌కు పరిచయం చేశారు. అనంతరం ఆయన వారికి పార్టీ కండువాలు కప్పారు. మధ్యాహ్నం 12 గంటలకు సాయి ఆరామం నుంచి రోడ్‌షో కొనసాగింది. పట్టణంలోని ప్రధాన వీధుల నుంచి వెళ్తున్నా జనం మాత్రం ఇళ్ల నుంచి బయటకు రాలేదు. చివరకు హనుమాన్ సర్కిల్‌లో వాహనాన్ని ఆపి కిరణ్ ప్రసంగించారు. ఈ స మయంలో కూడా జనం పలుచగా కన్పించారు.
ప్రజల్ని ఆకట్టుకునేందుకు కిరణ్ ఆవేశంగా మాట్లాడే ప్రయత్నం చేసినా అంతంత మాత్రంగా స్పం దించారు. ఆ తర్వాత అనంతపురం బయలుదేరారు. మార్గంమధ్యలో చెన్నేకొత్తపల్లి వద్ద ఐదు నిమిషాలు ఆపి అభివాదం చేసుకుంటూ వెళ్లారు. సాయంత్రం ఆరు గంటలకు అనంతపురం చేరుకున్న కిరణ్.. ప్రధాన రహదారుల్లో రోడ్ షో కొనసాగించారు. జన స్పందన అంతంత మాత్రంగానే కన్పించింది. చివరకు సప్తగిరి సర్కిల్ వద్ద సభ నిర్వహించి కాసేపు మట్లాడారు. ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చిందో వివరించి ప్రసంగం ముగించి ముందు కెళ్లారు. అంతలో మళ్లీ మైక్ తీసుకుని అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయర్త చిరంజీవిరెడ్డిని నగరవాసులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీని గెలిపిస్తే విభజనను అడ్డుకుంటామన్నారు. రాత్రికి సీఆర్‌ఐటీ కళాశాల విశ్రాంతి గహంలో కిరణ్ బస చేస్తారని ఆ కళాశాల డెరైక్టర్ అరుణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
పోలింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత : ఎస్పీ
అనంతపురం క్రై ం, న్యూస్‌లైన్ : తుది విడత ప్రాదేశిక ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ సెంథిల్‌కుమార్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నాయకులు మంచి ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ఓటర్లను ఇబ్బందులు పెట్టేవారు.. నేర చరిత్ర ఉన్నవారిని బూత్‌లలో ఉంచొద్దన్నారు. తాడిపత్రి, రాప్తాడు, పెనుకొండ ప్రాంతాల్లో గతంలో జరిగిన గొడవలను దష్టిలో పెట్టుకుని భద్రత ఏర్పాటు చేశామన్నారు. ప్రలోభాలకు గురి చేసినా.. భయపెట్టినా ఓటర్లు టోల్ ఫ్రీ నంబర్ 1009553707070కు కాల్ చేయాలన్నారు.
కిరణ్ షో
Published Thu, Apr 10 2014 3:34 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement