జేఎస్పీలో లోక్‌సభ కోఆర్డినేటర్ల నియామకం
హైదరాబాద్: పార్లమెంటరీ స్థానాల్లో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు జై సమైక్యాంధ్ర పార్టీ సమన్వకర్తలను నియమిస్తోంది. సీమాంధ్రలోని 20 సెగ్మెంట్లలో పనిచేసేందుకు 20 మంది నాయకుల్ని ఎంపిక చేసింది. ఆయా జాబితాను గురువారం సాయంత్రం పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి విడుదల చేశారు.
కేవీ సత్యనారాయణ రెడ్డి (అమలాపురం), కొత్తన్న రాము (అనకాపల్లి), కాపారపు శివున్నాయుడు (అరకు), పీ రామతిరుపతిరెడ్డి (ఏలూరు), కొత్తపల్లి శివశంకర్ (గుంటూరు), బీ రామమూర్తి (కాకినాడ), షేక్ ముక్తియార్ (మచిలీపట్నం), భూపతిరాజు రవివర్మ (నర్సాపురం), సుమంత్‌రెడ్డి (నెల్లూరు), బాల నాగేంద్రయాదవ్ (ఒంగోలు), చెరుకూరి రామారావు (రాజమండ్రి), ఎస్. జగన్ (శ్రీకాకుళం), ఉమ్మడి ధన్‌రాజ్ (విజయవాడ), జేకే రాజు (విజయనగరం), కె. చిరంజీవిరెడ్డి (అనంతపురం), రెడ్డప్పరెడ్డి (చిత్తూరు), ఎంఎల్‌ఎన్ మూర్తి (హిందూపూర్), కె. నిరంజన్‌రెడ్డి (తిరుపతి), ఎన్‌హెచ్ భాస్కరరెడ్డి (నంద్యాల), నరాల సత్యనారాయణ (ఖమ్మం)లను సమన్వయకర్తలుగా ఎంపిక చేశారు.
కృష్ణాలో పర్యటన ...
శుక్ర, శనివారాల్లో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కృష్ణా జిల్లాలో రోడ్‌షో నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు జగ్గయ్యపేట చేరుకునే ఆయన చిల్లకల్లు, వత్సవాయి, పెనుగంచిప్రోలు గ్రామాల్లో జరిగే రోడ్‌షోల్లో పాల్గొంటారు. సాయంత్రం 7.30 గంటల నుంచి 9 గంటల వరకూ విజయవాడలో విద్యార్థి జేఏసీ, న్యాయవాదులు, డాక్టర్లు నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. 22న పామర్రు, పెడన, బంటుమిల్లి, ముదినేపల్లి, కైకలూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రోడ్‌షోల్లో పాల్గొంటారు.