anam jayakumar reddy
-
CM Jagan: ఆనం జయకుమార్‌రెడ్డికి పార్టీ కండువా కప్పిన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఊహించిన దెబ్బ తగిలింది. టీడీపీ నేత ఆనం జయకుమార్‌రెడ్డి సోమవారం వైఎస్సార్సీపీలో చేరారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరడం గమనార్హం. సోమవారం క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన ఆనం జయకుమార్‌రెడ్డి, సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డి, వైయస్సార్సీపీ నేత కోటిరెడ్డి కూడా వెంటే ఉన్నారు. రాజకీయ చరిత్ర ఉన్న తమ కుటుంబాన్ని చాలాకాలంగా టార్గెట్ చేశారంటూ, పైగా చంద్రబాబు సైతం మోసం చేస్తూ వస్తున్నారని, తనను నమ్ముకున్న వర్గీయులకు సైతం ఏం చేయలేకపోతున్నానని ఆనం జయకుమార్‌రెడ్డి అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: జేసీవి శవరాజకీయాలు.. భగ్గుమన్న పెద్దారెడ్డి -
'సమైక్యాంధ్ర ' ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆనం
ఆనం సోదరులపై జై సమైక్యాంధ్ర పార్టీ నేత ఆనం జయకుమార్ రెడ్డి ఆదివారం నెల్లూరులో నిప్పులు చెరిగారు. గతంలో తమ తాతలు... తండ్రులు ప్రజా బలం కోసం తాపత్రయ పడ్డారని... ప్రస్తుతం వివేకానంద, రాంనారాయణ రెడ్డిలు ధనబలం పెంచుకునే క్రమంలో దిగజారిపోయారని ఆరోపించారు. రావణాసురిడి గుణం వివేకానంద రెడ్డిలో ఉందని జయకుమార్ రెడ్డి విమర్శించారు. వివేకాంద, రాం నారాయణలు ఇద్దరు ఇద్దరే అని వ్యాఖ్యానించారు. సమైక్యాంధ్ర పార్టీ తరఫున నెల్లూరు సీటి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు జయకుమార్ రెడ్డి వెల్లడించారు. -
'సీఎం పదవిపై మంత్రి ఆనం కన్ను'
నెల్లూరు: ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ ఏకపక్షంగా, నియంతలా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ నోట్‌ను కేంద్ర కేబినెట్ హడావుడిగా ఆమోదించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్ర ఎంపీలు రాజీనామాలు చేసుంటే రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో వెనక్కి తగ్గేదని ఆయన అన్నారు. సీఎం పదవిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కన్నేశారని ఆనం జయకుమార్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవి కోసం గడ్డి తింటున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీని, ఆనం సోదరులను ప్రజలు క్షమించరని అన్నారు. -
రాష్ట్రం తగలబడుతున్నా బాబు పట్టించుకోవటం లేదు
నెల్లూరు : రాష్ట్రం తగలబడిపోతున్నా పట్టించుకోకుండా... జగన్మోహన్ రెడ్డి బెయిల్‌ను అడ్డుకునేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆనం జయకుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో ఉద్యోగులు నిరసన దీక్షలు చేపట్టారు. ఉద్యోగుల దీక్షకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. మరోవూపు గూడూరు గర్జనకు భారీ స్పందన వచ్చింది. తిరుపతిలోనూ సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రేణిగుంట సీఆర్ఎస్ ఎదుట ఎన్జీవోల నిరసనకు దిగారు. రైల్వే ఉద్యోగులు విధులకు వెళ్లనివ్వకుండా ఆందోళనకారులు అడ్డుకోవటంతో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు అనంతపురం జిల్లాలో సమైక్యాంధ్ర ఆందోళనలు 51వ రోజుకు చేరాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను ఉద్యోగ జేఏసీ మూసివేయించింది. సమైక్యంధ్రకు మద్దతుగా ఉరవకొండలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇక గుంటూరు జిల్లా పొన్నూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా జర్నలిస్టుల ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ జరిగింది. పొన్నూరు ఐలాండ్ సెంటర్లలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.