
నెల్లూరులో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆనం కుటుంబం..
సాక్షి, గుంటూరు: నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఊహించిన దెబ్బ తగిలింది. టీడీపీ నేత ఆనం జయకుమార్‌రెడ్డి సోమవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరడం గమనార్హం.
సోమవారం క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన ఆనం జయకుమార్‌రెడ్డి, సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డి, వైయస్సార్సీపీ నేత కోటిరెడ్డి కూడా వెంటే ఉన్నారు.
రాజకీయ చరిత్ర ఉన్న తమ కుటుంబాన్ని చాలాకాలంగా టార్గెట్ చేశారంటూ, పైగా చంద్రబాబు సైతం మోసం చేస్తూ వస్తున్నారని, తనను నమ్ముకున్న వర్గీయులకు సైతం ఏం చేయలేకపోతున్నానని ఆనం జయకుమార్‌రెడ్డి అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: జేసీవి శవరాజకీయాలు.. భగ్గుమన్న పెద్దారెడ్డి