
గుంటూరు, సాక్షి: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులుగా మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి నియమించింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాలతో విష్ణువర్దన్‌కు బాధ్యతలు అప్పజెప్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
టీడీపీని వీడి.. వైఎస్సార్‌సీపీ మేమంతా సిద్ధం యాత్ర సమయంలో ఏప్రిల్ 4వ తేదీన తిరుపతి ఎద్దల చెరువు వద్ద సీఎం జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తన అనుచరగణంతో సహా వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు.

కాగా, 2019లో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేశారు విష్ణువర్ధన్ రెడ్డి. అయితే టీడీపీ స్థితి నానాటికీ దిగజారిపోతుండడం, ప్రజల్లో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత పెరిపోతూ వస్తున్న కారణంగా ఆయన టీడీపీని వీడారు.
Comments
Please login to add a commentAdd a comment