తీవ్ర అనారోగ్యంతో మృతి చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి భౌతికకాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. అమరావతి నుంచి నెల్లూరు చేరుకున్న చంద్రబాబు ఏసీ సెంటర్‌లోని ఆనం వివేకానందరెడ్డి నివాసానికి చేరుకుని ఆయనకు పుష్ఫాంజలి ఘటించారు. అనంరం వివేకా సోదరుడు ఆనం రామనారాయణరెడ్డిని, కుటుంబసభ్యులను పరామర్శించిన సీఎం వారికి ధైర్యం చెప్పారు.