ఎవరు పార్టీని వీడినా నష్టమేమి లేదు : రఘువీరా | pcc chief raghuveera comments on anam brothers party changes | Sakshi
Sakshi News home page

ఎవరు పార్టీని వీడినా నష్టమేమి లేదు : రఘువీరా

Published Mon, Nov 30 2015 6:23 PM | Last Updated on Fri, Mar 22 2019 6:16 PM

ఎవరు పార్టీని వీడినా నష్టమేమి లేదు : రఘువీరా - Sakshi

ఎవరు పార్టీని వీడినా నష్టమేమి లేదు : రఘువీరా

ఒంగోలు: ఆంధ్రప్రదేశ్  పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సోమవారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన భైరవకోనలో మట్టి సత్యాగ్రహం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కనువిప్పు కలిగేలా లక్ష ప్రదేశాల నుంచి మట్టి సేకరించి పంపుతామని తెలిపారు.

ఇక ఆనం రాంనారాయణ రెడ్డి సోదరులు పార్టీని వీడటంపై రఘువీరారెడ్డి పరోక్షంగా స్పందించారు. ఎవరు పార్టీని వీడినా కాంగ్రెస్ కు వచ్చే నష్టమేమి లేదని ఆయన వ్యాఖ్యానించారు. (త్వరలో ఆనం సోదరులు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న విషయం తెలిసిందే) ఈ కార్యక్రమంలో ప్రకాశం డీసీసీ అధ్యక్షుడు ఉగ్రనరసింహారెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.     

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement