గొల్లపల్లి (పెనుకొండ రూరల్) : మండలంలోని గొల్లపల్లి రిజర్వాయర్‌ను ఏపీపీసీసీ అధ్యక్షడు రఘువీరారెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హంద్రీనీవా పాజెక్టును 80శాతం పూర్తి చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రాజెక్టులకు పునాదులు వేశామన్నారు. రూ.1200 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు రూ.4వేల కోట్లు ఖర్చు చేసి అధికార పార్టీ నాయకులు దోచుకున్నారని విమర్శించారు.
ప్రాజెక్టు పనులు కూడా నాసి రకంగా ఉన్నాయన్నారు. భూములు కోల్పోయిన రైతులకు పరిహారంగా భూములు ఇవ్వాలన్నారు. అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నియోజక వర్గ ఇన్‌చార్జ్ కేటీ శ్రీధర్, డీసీసీ అధ్యక్షుడు చినవెంకటరాముడు, మహేశ్, గోపాల్‌రెడ్డి, మండల కన్వీనర్ చంద్రకాంతమ్మ తదితర నాయకులు పాల్గొన్నారు.
గొల్లపల్లి రిజర్వాయర్‌ను సందర్శించిన రఘువీరా
Published Tue, Jan 3 2017 11:32 PM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM
Advertisement
Advertisement