'డిక్కీ డక్కా రాజాల వల్లే పార్టీ నాశనం'
విజయవాడ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనం వివేకానందరెడ్డి పార్టీ అధిష్టానం పెద్దలపై నోరు పారేసుకున్నారు. డిక్కీ డక్కా రాజాలు వచ్చే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని నాశనం చేశారని ఆయన విమర్శించారు. అసలు నాయకుడికి పెళ్లేలేదు...ముసలి నేతలకు రెండేసి పెళ్లిళ్లా అంటూ ఆనం వ్యాఖ్యలు చేశారు. డిగ్గీ, థరూర్ వంటి బఫూన్లను పక్కన పెట్టాలని ఆయన సూచించారు.
కాంగ్రెస్లో కొందరు మంత్రులుగా పదవులు అనుభవించి...కోట్లు సంపాదించి కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వీడారని ఆనం విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మేధోమథనంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఇటీవలి కాలంలో చంద్రబాబును ఆనం సోదరులిద్దరూ పొగడ్తలతో ముంచెత్తుతున్న నేపథ్యంలో ఇరువురూ టీడీపీలో చేరతారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.