
రఘువీరాపై ఆనం అసంతృప్తి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డిపై ఆ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ఆనం వివేకానందరెడ్డి మంగళవారం హైదరాబాద్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీలో పలు పదవులను పీసీసీ తమను సంప్రదించకుండానే భర్తీ చేసిందని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ కార్యక్రమాలు తాము నిర్వహిస్తుంటే... పదవులు మాత్రం ఇతర జిల్లాలకు చెందిన సీనియర్ల సిఫార్స్ మేరకు పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఈ పద్దతి బాగాలేదని రఘువీరారెడ్డికి చెప్పినట్లు ఆనం వివేకానందరెడ్డి వివరించారు.