APPCC Chief
-
‘2017 బాబు వైఫల్యనామ సంవత్సరం..’
సాక్షి, విజయవాడ: ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మండిపడ్డారు. రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బాబు వస్తే జాబు అని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన కొడుకు చిన్నబాబుకు మాత్రమే మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు. 2017లో బాబు పాలన వైఫల్యనామ సంవత్సరంగా ముగిసిందని రఘువీరా ఎద్దేవా చేశారు. అంతేకాక బాబు జాబితాలో అన్నీ అపజయాలే అని ఆయన అన్నారు. రైతు రుణమాఫీ విషయంలో బాబు సర్కారు రైతులను మోసం చేసిందన్నారు. ఇంటికి ఒక్క ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ యువతకు ఇచ్చిన హామీని సైతం అటకెక్కిందన్నారు. ఈ మూడున్నర సంవత్సారాల బాబు పాలనలో ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకో దగ్గ ఐటీ కంపెనీ ఏపీవైపు చూడలేదని ఆయన అన్నారు. తొలుత గూగుల్ వంటి కంపెనీలు వస్తాయని చేసిన ప్రచారం బోగస్‌గా తెలిపోయిందని రఘువీరా పేర్కొన్నారు. ‘స్వీస్ చాలెంజ్’ విషయంలోనూ చంద్రబాబు సర్కారుకు చుక్కెదురు అయిందని గుర్తు చేశారు. అంతేకాక ప్రత్యేక ప్యాకేజీ, నోట్ల రద్దు విషయంలో చంద్రబాబు వేసిన పిల్లిమొగ్గలు సొంత పార్టీ నాయకులనే విస్మయానికి గురి చేశాయన్నారు. కాంగ్రెస్ హయంలో చిత్తూరు జిల్లాకు వచ్చిన మన్నవరం ప్రాజెక్టును కూడా చంద్రబాబు కాపాడుకోలేకపోవడం మరో అతిపెద్ద ఫెయిల్యూర్ అని రఘువీరా అన్నారు. -
'విద్యార్థుల తరఫున ప్రభుత్వంపై పోరాడతాం'
హైదరాబాద్ : విద్యార్థుల తరఫున ప్రభుత్వంపై పోరాడతామని వారికి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి భరోసా ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో రఘువీరారెడ్డిని ఏపీలో మెడికల్ అడ్మిషన్లు పొందని విద్యార్థులు కలిశారు. ఈ సందర్బంగా రఘువీరారెడ్డితో వారు మాట్లాడుతూ... ఏపీ మెడికల్ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. బీసీ,ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 250 మెడికల్ సీట్లు దక్కకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మెడికల్ సీట్లు 900 పెరిగినా.. తమ న్యాయం జరగలేదన్నారు. మంత్రులకు మెడికల్ కాలేజీలు ఉండటం వల్లే... ఈ పరిస్థితి నెలకొందని వారు... రఘువీరాకు వివరించారు. ఈ నేపథ్యంలో రఘువీరారెడ్డి పైవిధంగా స్పందించారు. అంతకుముందు ఇందిరాభవన్‌లో మహాత్మా గాంధీ 147వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రఘువీరారెడ్డి, రాజ్యసభ ఎంపీ కేవీపీతోపాటు పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రాహుల్‌ను ప్రధానిని చేద్దాం
పార్లమెంటు స్థానాలన్నీ గెలుచుకోవాలి తమిళ కాంగ్రెస్ నేతలకు రఘువీరారెడ్డి పిలుపు టీఎన్‌సీసీ అధ్యక్షులు తిరునావుక్కరసర్‌కు శుభాకాంక్షలు చెన్నై: రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు స్థానాలు గెలుచుకోవడం ద్వారా అఖిల భారత కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీని ప్రధాని చేద్దామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) కేంద్ర కార్యాలయమైన చెన్నైలోని సత్యమూర్తి భవన్లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మంగళవారం ప్రసంగించారు. 2019 నాటి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయమే లక్ష్యంగా కార్యకర్తలు నేటి నుంచే కార్యోన్ముఖులు కావాలని ఆయన కోరారు. దేశంలోని యువత అంతా రాహుల్‌గాంధీ నాయకత్వం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నదని అన్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లలో జరుగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. లౌకికవాదంతో ఏకంగా ఉన్న భారతదేశాన్ని కుల, మతాలు, మతతత్వవాదాలతో బీజేపీ ప్రభుత్వం విడగొడుతున్నదని ఆయన ఆరోపించారు. దేశ సమైక్యత కోసం కాంగ్రెస్ గెలుపు అనివార్యమని ఆయన చెప్పారు. సమర్థ నేత తిరునావుక్కరసర్: టీఎన్‌సీసీ అధ్యక్షులుగా నియమితులైన తిరునావుక్కరసర్ సమర్థుడైన నేత అని రఘువీరారెడ్డి కొనియాడారు. రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల అనుభవమున్న నేతను టీఎన్‌సీసీ అధ్యక్షులుగా నియమించడం సోనియా, రాహుల్‌గాంధీ తీసుకున్న సముచితమైన నిర్ణయమని అన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా, కేంద్రమంత్రిగా గతంలో పలు బాధ్యతలు నిర్వర్తించిన తిరునావుక్కరసర్ హయాంలో తమిళనాడు కాంగ్రెస్ ఘన విజయాలను అందుకుంటుందన్న విశ్వాసం తనకు ఉందని చెప్పారు. ఏపీ ఇన్చార్జ్గా, ఏఐసీసీ కార్యదర్శిగా తనకు సుపరిచితుడని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో సరైన సలహాలు ఇచ్చి చేదోడువాదోడుగా నిలిచిన సంగతిని తాను మరువలేదని అన్నారు. అందుకే ఆయన్ను స్వయంగా కలసి అభినందించాలని చెన్నైకి వచ్చానని వివరించారు. నిర్బంధ తమిళం కూడదు: తమిళనాడులోని నిర్బంధ తమిళ చట్టంపై రఘువీరా రెడ్డి స్పందిస్తూ, భారతదేశ పౌరులను పలానా భాష నేర్చుకోవాలని నిర్బంధించడం ఎంతమాత్రం కూడదని అన్నారు. తమకు ఇష్టమైన భాషను నేర్చుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కని చెప్పారు. తమిళ కాంగ్రెస్ పార్టీలో 20 శాతం తెలుగువారేనని, రాష్ట్రేతర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగువారి హక్కులను కాపాడేందుకు కేంద్రం, ఏపీ ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. సమావేశంలో ఏఐసీసీ సభ్యులు చిరంజీవి పాల్గొన్నారు. -
లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా ?
విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ నేతలు బోగస్ ప్రచారం చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి మండిపడ్డారు. హోదా బదులు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని కాంగ్రెస్ నేతలు సైతం మెచ్చుకుంటున్నారన్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యలను ఖండించారు. మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేశ్ ప్యాకేజీ మంచిదదని తనతో చెప్పినట్లు సుజనా చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్ధమని రఘువీరా అన్నారు. 'సుజనా.. కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మీరు చేసిన వ్యాఖ్యలు నిజమో కాదో తేల్చేందుకు లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమేనా?' అని రఘువీరా సవాల్ విసిరారు. ఈమేరకు ఆదివారం విజయవాడలోని పీసీసీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో సుజనాచౌదరికి రఘువీరా రాసిన లేఖను విడుదల చేశారు. సుజనా చౌదరి చేస్తున్న ప్రచారంపై ఇప్పటికే తాను జైరాం రమేష్‌తో మాట్లాడానని, కేంద్ర ప్యాకేజీ ప్రకటనను జైరాం కంటితుడుపు చర్యగా అభివర్ణించారని రఘువీరా పేర్కొన్నారు. చిత్తశుద్ధి ఉంటే టీడీపీ నేతలు ఇకనైనా హోదా కోసం పోరాడాలని అన్నారు. విభజన చట్టంలోని హామీలన్ని నెరవేర్చాలని రఘువీరా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
మోదీ మోసంలో భాగస్వామి అవుతున్న బాబు
హైదరాబాద్ : ప్రత్యేక హోదా తీసుకురావడంలో చంద్రబాబు అనుసరిస్తున్న మెతక వైఖరిపై ఏపీ పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి శనివారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. మీ లొంగుబాటు వైఖరితో రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టమని చంద్రబాబుకు రఘువీరా సూచించారు. పోరాడితే పోయేదేమీలేదు... ప్రత్యేక హోదా అమలుచేయించుకోవడం తప్ప అంటూ చంద్రబాబుకు రఘవీరా చురకలంటించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో మోదీ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయవద్దని... రాజీదోరణి అనుసరించాలంటూ టీడీపీ యంత్రాంగానికి బాబు ఆదేశించడాన్ని రఘవీరా తప్పుపట్టారు. ఇలా చేయడం వల్ల తమ స్వార్థప్రయోజనాల కోసం 5 కోట్ల ఆంధ్రుల రాష్ట్ర ప్రయోజనాలను బలిపెట్టడమేనని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక హోదా తమ హక్కు అని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని... గత 20 నెలలుగా ఈ అంశాన్ని సాగదీస్తున్నందను వారంతా కేంద్రంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు వైఖరిని వ్యతిరేకించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే టీడీపీ రాజకీయ దివాళాకోరు విధానాన్ని తిప్పికొట్టాలని ప్రజలకు రఘవీరా సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి కొత్తగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని.. గత యూపీఏ ప్రభుత్వం కేబినెట్ నిర్ణయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మాత్రం ఎన్డీయేదే అని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మోదీకి బాబు మోకరిల్లాల్సిన అవసరం లేదన్నారు. కానీ చంద్రబాబు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా అమలు చేస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్ధానం చేసిందని.. అలాగే 10 ఏళ్లు కాదు.... 15 ఏళ్లు కావాలని చంద్రబాబు డిమాండ్ చేశారని రఘువీరా ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ అధికారంలోని రాగానే నరేంద్రమోదీ రాష్ట్రాన్ని మోసం చేస్తూ వస్తున్నారన్నారు. నరేంద్రమోదీ మోసంలో చంద్రబాబు భాగస్వామి అవున్నారన్నారు. చంద్రబాబు సీఎం కావడం రాష్ట్ర ప్రజల దురదృష్టం అని అభివర్ణించారు. పునర్వవస్థీకరణ చట్టంలో చట్టబద్దం చేసిన అంశాలను కూడా మోదీ ప్రభుత్వం సరిగ్గా అమలు చేయడం లేదు... పైగా రాష్ట్రానికి చాలా సహాయం చేశామని లెక్కలు చెబుతున్నారని రఘువీరా తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం ఏ మేరకు సాయం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని రఘువీరా డిమాండ్ చేశారు. ఈ మేరకు రఘువీరా శనివారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. -
అంతులేని అరాచకాలవి..
రాజధాని రైతుల ఆక్రందన పీసీసీ అధ్యక్షుడురఘువీరారెడ్డి వద్ద ఆవేదన ‘ట్రాక్టర్ ఉందని పింఛన్ ఇవ్వట్లేదు. ఉచిత విద్య, వైద్యం అన్నీ ఒట్టిమాటలే. ఉపాధి అవకాశాలు లేక యువత అవస్థలు పడుతోంది. ఓల్టా చట్టానికి తూట్లు పొడిచి నదీగర్భంలో లారీలతో పనులు చేయిస్తున్నారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అబ్బో.. రాజధాని పేరుతో టీడీపీ చేస్తున్న అరాచకం పరకాష్టకు చేరింది..’ అంటూ రాజధాని ప్రాంత రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. విజయవాడలోని ఆంధరత్న భవన్లో శుక్రవారం ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ తీరుపై రైతన్నలు నిప్పులు చెరిగారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. ఏకపక్ష నిర్ణయాలే.. రాజధాని ప్రాంతంలో రైతు సమస్యలు పట్టించుకోవట్లేదు. రైతు ప్రతినిధులుగా పేర్కొంటూ పచ్చచొక్కాలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఓ చానల్ తీరు చూస్తే.. దానిని ఆంధ్రప్రదేశ్‌లో కూడా నిషేధిస్తే బాగుండనిపిస్తుంది. వాస్తవాలను వక్రీకరిస్తోంది. బయటి ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే విధంగా కథనాలు రాస్తోంది. ప్రసారం చేస్తోంది. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? భూములిచ్చిన రైతులకు రాజధాని ప్రాంతంలో వెయ్యి గజాల భూములు ఇస్తామని చెప్పి ఇప్పుడు అందులో 52 గజాలు కోత పెడుతున్నారు. విద్య, వైద్యానికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ అందడం లేదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం యువత ఎదురుచూస్తోంది. అన్ని పార్టీల వారూ భూములు ఇచ్చారు. అధికార పార్టీ వారు మాత్రం పెత్తనం చెలాయిస్తున్నారు. టీడీపీ ఏకపక్ష వైఖరిపై పోరాటం చేయాలని నిర్ణయానికి వచ్చాం. అన్ని పార్టీల రైతులతో రైతు సమాఖ్య ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. వారంలో ఇది కార్యరూపం దాల్చుతుంది. మీరు మద్దతు తెలపాలి. - నెలికుదిటి వెంకటయ్య, రైతు, దొండపాడు గ్రామాభివృద్ధికి అడ్డుపడుతున్నారు గ్రామాభివృద్ధిని అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నారు. కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం తమ ఎంపీ నిధుల నుంచి గ్రామాభివృద్ధికి రూ.30 లక్షలు కేటాయించారు. పనులు చేపట్టేందుకు అనుమతులు మంజూరు కాకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. గ్రామకంఠం సమస్యలు పరిష్కారం కావడం లేదు. జన్మభూమి కమిటీల పేరుతో తెలుగు తమ్ముళ్లు గ్రామంలో అరాచకాలు సృష్టిస్తున్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. - కొమ్మినేని శివయ్య, సర్పంచి, దొండపాడు ప్రశ్నించామని.. ట్రాక్టర్లు సీజ్ చేశారు.. రాజధాని పనులు ట్రాక్టర్లతో చేయించాల్సి ఉంది. ఇందుకు విరుద్ధంగా నదీగర్భంలో టెన్‌టైర్ లారీలతో పనులు చేయిస్తున్నారు. ఇది అన్యాయమని పత్రికా ప్రకటన ఇచ్చా. వెంటనే నా ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. ఓల్టా చట్టం ప్రకారం నదీగర్భంలో లారీలను అనుమతించకూడదు. ట్రాక్టర్లు ఉన్నాయని పింఛన్లు ఇవ్వట్లేదు. ఆ ట్రాక్టర్లకు పనుల్లేక రైతాంగం పస్తులుంటోంది. మా సమస్యలు చెప్పినా స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదు. రాజధానిలో రైతుల భూములు ఎకరం రూ.5కోట్లు అని అసెంబ్లీలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. ఇప్పుడు అక్కడ రూ.కోటి 30 లక్షలకే భూమి ధర పడిపోయింది. - ఎల్లంకి నర్సయ్య, ట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, తుళ్లూరు -
'ఆనాడు ఇలానే జరిగితే వైఎస్ఆర్ పోరాడారు'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని రఘువీరారెడ్డి ఆరోపించారు. విభజన చట్టంలోని హామీలను కూడా బడ్జెట్లో ప్రస్తావించలేదన్నారు. కేంద్రంపై ఒత్తిడి చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. గతంలో రాష్ట్రానికి ఇలానే అన్యాయం జరిగితే మాజీ కేంద్రమంత్రి లాలూలో దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పోరాడారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ తర్వాత కేంద్రం రాష్ట్రానికి న్యాయం చేసిందన్నారు. తక్షణం ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చంద్రబాబుకు రఘువీరారెడ్డి సూచించారు. -
మా విష్ణుపై కేసు పెడతారా....
-
మా విష్ణుపై కేసు పెడతారా....: రఘువీరా మండిపాటు
సాక్షి, హైదరాబాద్: కల్తీ మద్యం సంఘటనపై రాజకీయం చేయొద్దు. సంఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. మా పార్టీ నాయకుడు మల్లాది విష్ణు అధికార టీడీపీ అవినీతి అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తున్నందునే ఆయనపై కక్ష సాధించడానికి కల్తీ మద్యం ఘటనలో ఇరికించారు... అని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. మంగళవారం ఇందిర భవన్లో పీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. కల్తీ మద్యం ఘటనలో మరణించిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయవాడ మద్యం కేసుపై సమగ్రంగా అన్ని కోణాల నుంచి విచారణ జరగాలని, బార్ నుంచి సేకరించిన నమూనాలను రెండు మూడు ల్యాబ్‌లకు పంపాలని, మచిలీపట్నంలో కూడా సంభవించిన మరణంపై కూడా విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సంఘటన తర్వాత ప్రభుత్వం ఏడు బ్రాండ్లకు చెందిన మద్యం విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం వెనుక ఉన్న నిజాలు బయటకు రావాలన్నారు. విజయవాడ కాంగ్రెస్ నాయకుడు మల్లాది విష్ణు ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతున్న అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి విచారణ జరగకుండానే, అసలు విచారణ ప్రారంభం కాకమునుపే ఆయన బాధ్యుడంటూ ప్రకటనలు ఇవ్వడం అనుమానాస్పదంగా ఉందన్నారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతూ అసలు విషయాలను మరుగున పడేస్తున్నారని విమర్శించారు. కేవలం ఆ బార్ నిర్వహిస్తున్న భవనం యజమాని అయినందుకే ఆయన పేరును కేసులో ఇరికించడం మంచిదికాదన్నారు. బార్లో పని చేస్తున్న సిబ్బందిని పోలీసులతో బెదిరించి, విష్ణుకి వ్యతిరేకంగా వాంగ్మూలం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విజయవాడలో జరిగిన కేసుతో పాటు సంబంధిత మంత్రి సొంత ప్రాంతమైన మచిలీపట్నంలో సంభవించిన మరణంపై కూడా విచారణ జరిపించాలని, నిజాలు వెల్లడయ్యేంత వరకు బురదచల్లే కార్యక్రమాన్ని నిలిపివేయాలన్నారు. తప్పులను కప్పిపుచ్చుకోవడానికే పదేళ్ల కాంగ్రెస్ పాలనలోని అంశాలపై సమగ్రమైన విచారణ జరిపిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనపై స్పందిస్తూ ప్రస్తుత ప్రభుత్వ హయాంలోని అంశాలపై కూడా విచారణ జరిపించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ఏడాది క్రితమే ఎలాంటి విచారనైనా జరిపించుకోవాలని రాతపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ లేఖ ఇచ్చిన విషయం చంద్రబాబుకు గుర్తుందా అంటూ ప్రశ్నించారు. -
హోదా కోసం మట్టి సత్యాగ్రహం
తిరుమల : ఏపీకి ప్రత్యేక హోదా కోసం మట్టి సత్యాగ్రహం చేపడతామని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం తిరమలలో శ్రీవెంకటేశ్వరస్వామిని రఘువీరా దర్శించుకున్నారు. అనంతరం దేవాలయం వెలుపల విలేకర్లతో రఘువీరా మాట్లాడుతూ... ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని ఆయన స్పష్టం చేశారు. ప్రతి గ్రామం నుంచి మట్టి సేకరించి ప్రధాని మోదీకి పంపుతామని చెప్పారు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని మంత్రి నారాయణ, వైఎస్ఆర్ సీపీ ఎంపీ పి.మిథున్‌రెడ్డి దర్శించుకున్నారు. -
ఏ అర్హత ఉందని 'అభీష్ట'ను నియమించారు ?
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయంలో రాజ్యాంగేతర శక్తులు పని చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లో రఘువీరారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... చంద్రబాబు ఓఎస్డీ ఎస్.అభీష్ట నియామకమే ఇందుకు నిదర్శనమని ఆయన గుర్తు చేశారు. కింది స్థాయి నుంచి సీఎంవో వరకు అరాచక పాలన సాగుతోందని ఆయన విమర్శించారు. ముఖ్యమైన ఫైళ్లు అన్నీ లోకేష్ సన్నిహితుడు అభీష్ట ద్వారానే కదులుతున్నాయన్నారు. ఏ అర్హత ఉందని అభీష్టను ఓఎస్డీగా నియమించారో చెప్పాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. -
ఏ అర్హత ఉందని 'అభీష్ట'ను నియమించారు ?
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రఘువీరా అరెస్ట్
సికింద్రాబాద్ : నరేంద్ర మోదీ సర్కార్‌ను నమ్మవద్దంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి బీహార్ ప్రజలకు హితవు పలికారు. ఆదివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా రఘువీరాతోపాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రచారం నిర్వహించారు. బీహార్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని ఓడించాలంటూ వారికి సూచించారు. ఎన్నికల నేపథ్యంలో తమ రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా, విభజన హామీలను మోదీ ప్రభుత్వం అమలు చేయడం లేదని వారు పాట్నా ఎక్స్‌ప్రెస్‌లోని బీహారీ వాసులకు వివరించారు. ఎన్నికల నేపథ్యంలో బీహార్‌కు ప్రకటించిన ప్యాకేజీని కూడా మోదీ సర్కార్ మోసం చేస్తుందని రఘువీరారెడ్డితోపాటు కాంగ్రెస్ నేతలు వారికి విశదీకరించారు. ఇంతలో పోలీసులు రంగ ప్రవేశం చేసి... ప్రచారానికి అనుమతి లేదంటూ రఘువీరాతోపాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో రైల్వే స్టేషన్లో ఉద్రిక్తం పరిస్థితి ఏర్పడింది. అనంతరం బెయిల్‌పై రఘువీరాతోపాటు కాంగ్రెస్ నాయకులను విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు రఘువీరా, సీఆర్, జేడీ శీలం, పళ్లంరాజు, కేవీపీలు బీహార్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు. -
జగన్ త్వరగా కోలుకోవాలి : రఘువీరా
-
జగన్ త్వరగా కోలుకోవాలి : రఘువీరా
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం హైదరాబాద్‌లో రఘువీరారెడ్డి మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఆరోపించారు. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ కేంద్రమే చేపట్టాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ ప్రాజెక్టులో నీళ్లు కాదు డబ్బు పారిందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిపై ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు పోతుందని రఘువీరారెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గత బుధవారం గుంటూరు నగర శివారులోని నల్లపాడు రోడ్డు వద్ద నిరవధిక నిరాహారదీక్ష చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారటంతో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున బలవంతంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దీక్షను భగ్నం చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ త్వరగా కోలుకోవాలంటూ రఘువీరారెడ్డిపై విధంగా స్పందించారు. -
మోదీ, వెంకయ్య, బాబుపై పీఎస్‌లో కేసులు పెడతాం
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి బుధవారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. ప్రత్యేక ప్యాకేజీ పేరుతో చంద్రబాబు ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారని ఆరోపించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను చూసి నేర్చుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 7,8,9 తేదీలలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి వెంకయ్య, ముఖ్యమంత్రి చంద్రబాబుపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు పెడతామని స్పష్టం చేశారు. -
రఘువీరాపై ఆనం అసంతృప్తి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డిపై ఆ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ఆనం వివేకానందరెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీలో పలు పదవులను పీసీసీ తమను సంప్రదించకుండానే భర్తీ చేసిందని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ కార్యక్రమాలు తాము నిర్వహిస్తుంటే... పదవులు మాత్రం ఇతర జిల్లాలకు చెందిన సీనియర్ల సిఫార్స్ మేరకు పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఈ పద్దతి బాగాలేదని రఘువీరారెడ్డికి చెప్పినట్లు ఆనం వివేకానందరెడ్డి వివరించారు. -
పీవీ గొప్ప శక్తిమంతుడు
హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహరావు జయంతి ఇరు రాష్ట్రాల కాంగ్రెస్‌లను కలిపిందని ఏపీపీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో పీవీ నరసింహరావు 94వ జయంతి వేడుకలు నెక్లెస్ రోడ్డులోని ఆయన సమాధి జ్ఞానభూమి వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీకి రఘువీరారెడ్డి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారత ప్రధానిగా పీవీ సేవలను రఘువీరారెడ్డి కొనియాడారు. భారత్ అగ్రగామి దేశంగా ఉందంటే అది పీవీ ఘనతే అని ఆయన తెలిపారు. విభిన్న ఆలోచనలున్న వారిని ఐక్యంగా ఉంచే గొప్ప శక్తిమంతుడు పీవీ అని రఘువీరా అభివర్ణించారు. భారత ప్రధానిగా పీవీ కాంగ్రెస్‌యేతర పక్షాలను ఒప్పించి కేంద్రంలో విజయవంతంగా ప్రభుత్వాన్ని నడపగలిగారని గుర్తు చేశారు. బీజేపీలో చెప్పుకోవడానికి గొప్ప నేతలు లేరని ... అందుకే ఆ పార్టీ పీవీ పేరు వాడుకుంటుందని విమర్శించారు. కావాలంటే గాంధీని హత్య చేసిన గాడ్సే పేరు వాడుకోవాలంటూ బీజేపీ నేతలకు రఘువీరారెడ్డి సూచించారు. భవిష్యత్తులో కూడా అనేక అంశాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కాంగ్రెస్‌లు కలసి పని చేస్తాయని రఘువీరా స్పష్టం చేశారు. -
కాంగ్రెస్ నేతలతో రఘువీరా సమావేశం
అనంతపురం: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ చీఫ్ రఘువీరా శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నేతలతో అనంతపురం జిల్లా మడకశిరలో సమావేశమయ్యారు. రాహుల్ పాదయాత్రపై వారు ఈ సందర్భంగా చర్చిస్తున్నారు. రాహుల్ గాంధీ జూన్ నెలాఖరులో అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. సదరు నియోజకవర్గంలో 15 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర చేయనున్నారు. అలాగే అప్పులు బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శిస్తారు. విభజనకు కారణం కాంగ్రెస్ పార్టీనే కారణం అన్న బలమైన వాదన సీమాంధ్ర ప్రజల్లో గూడు కట్టుకుని ఉంది. దాంతో గత ఎన్నికల్లో ఓ ఎమ్మెల్యే కానీ... ఓ ఎంపీ కానీ ఎన్నిక కాలేదు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో పునర్జీవింప చేయాలని సీమాంధ్రలోని ఆ పార్టీ నేతలు కంకణం కట్టుకున్నారు. అందులోభాగంగా సీమాంధ్ర నేతలు రాహుల్ పర్యటన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ దిశగా పావులు కదిపారు. రాహుల్ పాదయాత్ర చేసేందుకు అంగీకరించారు. అదికాక తన సొంత జిల్లాలో రాహుల్ పాదయాత్రను నిర్వహిస్తున్నారు... ఆ పాదాయత్రను ఎలాగైనా విజయవంతం చేయాలని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఇప్పటికే రాహుల్ పరామర్శించిన సంగతి తెలిసిందే. రాహుల్ పాదయాత్రను విజయవంతం చేయడానికి ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ నేతలు సమాయత్తమైయ్యారు. -
టీడీపీ ఎన్నికల గుర్తింపు రద్దు చేయాలి'
-
'టీడీపీ ఎన్నికల గుర్తింపు రద్దు చేయాలి'
హైదరాబాద్: ఎన్నికల హామీలు అమలు చేయడంలో టీడీపీ ఘోర వైఫల్యం చెందిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎన్నికల గుర్తింపును రద్దు చేయాలని వారు మంగళవారం హైదరాబాద్‌లో ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఏపీ సచివాలయంలో రఘువీరా రెడ్డి మాట్లాడారు. ఎన్నికల సమయంలో టీడీపీ దాదాపు 600 హామీలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. వాటిలో కొన్నింటిని మాత్రమే అమలు చేసిందని చెప్పారు. మరికొన్ని హామీలపైన అయితే టీడీపీ తాకనైనా తాకలేదని రఘువీరా విమర్శించారు. టీడీపీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు పరిచేందుకు ఆ పార్టీపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. అలాగే వాటి కోసం నిత్యం పోరాటం చేస్తున్నామని రఘువీరా స్పష్టం చేశారు. -
మొదట్నుంచి రైతులకు బాబు శత్రువే
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుపై పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో మండిపడ్డారు. మొదటి నుంచి రైతులకు చంద్రబాబు శత్రువే అంటూ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదాతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీలు ద్రోహం చేస్తున్నాయని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు 5 ఏళ్లు ప్రత్యేక హోదా అని కాంగ్రెస్ పేర్కొంటే... కాదు కాదు 10 ఏళ్లు ఇవ్వాలని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు ఎం వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగింది. కేంద్రంలో ఎన్టీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాడిన సంగతి తెలిసిందే. విభజన జరిగి ఏడాది కావస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీలు నాన్చుడు ధోరణి అవలంబించడంపై రఘువీరా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
’ఎన్కౌంటర్ మానవహక్కుల ఉల్ల౦ఘనే ’
-
'ఎన్కౌంటర్ మానవ హక్కుల ఉల్లంఘనే'
హైదరాబాద్: శేషాచలం అడవుల్లో మంగళవారం జరిగిన కూలీల ఎన్కౌంటర్ ముమ్మాటికి మానవ హక్కుల ఉల్లంఘనే అని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో ఆరోపించారు. అసలైన ఎర్రచందనం స్మగ్లర్లను ఎన్కౌంటర్ చేసి ఉంటే ఎవరూ బాధపడేవారుకాదని ఆయన పేర్కొన్నారు. కానీ మృతులంతా తమిళనాడు రాష్ట్రానికి చెందిన నిమ్న వర్గాలకు చెందిన వారని తెలిపారు. అమాయకులైన కూలీలను హతమార్చడంపై సమగ్ర విచారణ జరిపించాలని టీడీపీ ప్రభుత్వాన్ని రఘువీరా డిమాండ్ చేశారు. ఈ ఎన్కౌంటర్ ఘటనపై జాతీయ మానవహక్కుల సంఘానికి లేఖ రాశానని తెలిపారు. ఎర్రచందనం స్మగ్లర్లు ఎవరో తెలిసినా టీడీపీ ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేదని రఘువీరా... టీడీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. -
'ప్రత్యేక హోదా ఇచ్చే వరకు పోరాడుతూనే ఉంటాం'
హైదరాబాద్: కరువు మండలాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో ఆరోపించారు. రాష్ట్రంలో 500 మండలాల్లో కరువు ఉందని జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదికను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. కరువు పరిస్థితులపై ప్రభుత్వ శాఖలు కాకుండా జన్మభూమి కమిటీ సర్వే చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామాలకు వాటర్ సప్లై చేసే లెక్కల్లో కూడా అవకతవకలు జరుగుతున్నాయని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేంతవరకు కేంద్రంపై పోరాడుతూనే ఉంటామని రఘువీరా స్పష్టం చేశారు. కరువు మండలాల ప్రకటన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతామని రఘువీరా అన్నారు. -
'ఆ రెండు పార్టీల దొంగాట'
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిపై ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి శుక్రవాంర చిత్తూరులో నిప్పులు చెరిగారు. ప్రత్యేక ఆంధ్రకు ఇవ్వాల్సిన ప్యాకేజీపై టీడీపీ, బీజేపీలు దొంగాట ఆడుతున్నాయని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి మేలు చేస్తుంది.. అలాంటి ప్రాజెక్టును వదిలి పెట్టి...పట్టిసీమ అంటూ టీడీపీ ఎందుకు పాకులాడుతుందో అర్థం కావడం లేదని రఘువీరా అశ్చర్యం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయింది. ఎన్నికల హామీలు, వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వాన్నికి ఉన్న చిత్తశుద్ధి ఎంత వరకు ఉందో బడ్జెట్లో కేటాయించిన నిధులను చూస్తే తెలుస్తుందని ఎద్దేవా చేశారు. -
'పట్టిసీమ' బెంగతోనే కర్రి శంకరయ్య మృతి
ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి... పోలవరం ప్రాజెక్టుకి నిధులు వెంటనే విడుదల చేయాలని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ ఎన్. రఘువీరారెడ్డి... కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఏలూరులో రఘువీరారెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రత్యేక హోదాపై ప్రజల దృష్టి మరల్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తీసుకు వచ్చిందని రఘువీరారెడ్డి ఆరోపించారు. ఎత్తిపోతల పథకంలో రాయలసీమకు ప్రయోజనం శూన్యమన్నారు. పట్టిసీమ వద్దు, పోలవరాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆయన చంద్రబాబు ప్రభుత్వానికి సూచించారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారని రఘువీరారెడ్డి ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించడంలో బీజేపీ కుంటి సాకులు చెబుతోందని ఆయన విమర్శించారు. పట్టిసీమ పథకంతో భూమి కోల్పోనున్నమన్న బెంగతో మృతి చెందిన రైతు కర్రి శంకరయ్యది సర్కార్ హత్యే అని రఘువీరా ఆరోపించారు. శంకరయ్య కుటుంబాన్ని ఆదుకుని... రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని రఘువీరా డిమాండ్ చేశారు. -
'6వ తేదీ నుంచి కోటి సంతకాల సేకరణ ఉద్యమం'
హైదరాబాద్: విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఏపీపీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు. అందుకోసం పార్లమెంట్ సమావేశాల్లో విభజన చట్టం హామీల అంశాన్ని లేవనెత్తుతామన్నారు. బుధవారం హైదరాబాద్‌లో రఘువీరారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ఈ నెల 6 వ తేదీన కోటి సంతకాల సేకరణ ఉద్యమం పోలవరంలో చేపడుతున్నామన్నారు. ఈ నెల 13, 14 తేదీల్లో విజయవాడలో రాష్ట్ర కాంగ్రెస్ మేధోమథన సమావేశం జరుగుతుందని రఘువీరా చెప్పారు. -
'డీజిల్ రూ. 21, పెట్రోల్ రూ. 29కి విక్రయించాలిగా'
హైదరాబాద్ : అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గిన ఆ దిశగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం లేదని ఏపీపీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి బుధవారం హైదరాబాద్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా తగ్గిన ముడి చమురు ధరల ప్రకారం అయితే లీటరు డీజిల్ ధర రూ. 21, పెట్రోల్ రూ.29 కి వినియోగదారులకు అందించాలని అన్నారు. కానీ అలా జరగడం లేదని రఘువీరా ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ముడి చుమురు ధరలు తగ్గితే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని మాజీ ప్రధాని వాజ్‌పాయి విధానానికి ప్రస్తుత మోదీ సర్కార్ తూట్లు పోడుస్తుందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా మోదీ సర్కార్ దొంగచాటుగా మూడు సార్లు పన్నుల పెంచి ప్రజలను దోపిడి చేస్తోందని విమర్శించారు. ఈ దుర్మార్గాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రశ్నించకుండా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతామనడం అన్యాయమన్నారు. -
'దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది రఘువీరా'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిపై ఆ రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు నిప్పులు చెరిగారు. బుధవారం విజయవాడలో రావెల మాట్లాడుతూ.. దళితుల సంక్షేమంపై రఘువీరా మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. దళితుల సంక్షేమాన్ని నీరుగార్చింది కాంగ్రెస్ పార్టీనే అని ఆయన ఆరోపించారు. దళితుల సంక్షేమంపై బహిరంగ చర్చకు తాము సిద్ధమంటూ రఘువీరాకు రావెల సవాల్ విసిరారు. -
పీసీసీ అధ్యక్షులతో రాహుల్ భేటీ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం. ఆ వెంటనే జరిగిన ఉప ఎన్నికల్లో కొద్దిగా ఉపశమనం. ఆ తర్వాత జరిగిన మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో స్థానాలను కైవసం చేసుకోలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. దీంతో పార్టీ భవిష్యత్తుపై సదరు పార్టీ నేతలలో నీలినీడలు కమ్ముకున్నాయి. భవిషత్తులో పార్టీని పరుగు పెట్టించాలని అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. అందులోభాగంగా ఏఐసీసీ కార్యాలయంలో వివిధ రాష్ట్రాలల పీసీసీ అధ్యక్షులతో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం భేటీ అయ్యారు. భవిష్యత్తులో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై పీసీసీ నేతలతో చర్చిస్తున్నారు. ఈ బేటీకి తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డిలు పాల్గొన్నారు. -
'నందిగామ ఉప ఎన్నిక ... టీడీపీకి ఓ హెచ్చరిక'
విజయవాడ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం విజయవాడలో కృష్ణాజిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో రఘువీరా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ... ప్రజా సమస్యలపై టీడీపీ ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేస్తామన్ని చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. రైతుల రుణమాఫీపై ప్రభుత్వం రోజుకో షరతు విధిస్తుందని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజూకు విశ్వాసం సన్నగిల్లుతుందని చెప్పారు. నందిగామ ఉప ఎన్నకల్లో కాంగ్రెస్ పార్టీకి 2 వేల నుంచి 24 వేల ఓట్లు పెరిగాయని అన్నారు. ఇది టీడీపీకి ఓ హెచ్చరిక లాంటిదని అన్నారు. టీడీపీ ప్రభుత్వం మళ్లీ ప్రారంభించనున్న జన్మభూమి కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. పథకాలన్నింటికీ ప్రభుతం ఆధార్‌తో లింకు చేస్తోందని.... ఈ నేపథ్యంలో ప్రభుత్వ పథకాలను లబ్దిదారులకు తగ్గిస్తే ఊరుకోమని చంద్రబాబు ప్రభుత్వాన్ని రఘువీరారెడ్డి హెచ్చరించారు. ఈ సమీక్ష సమావేశంలో మాజీ మంత్రులు కాసు కృష్ణారెడ్డి, సి.రామచంద్రయ్యలతోపాటు పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.