
ఏ అర్హత ఉందని 'అభీష్ట'ను నియమించారు ?
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయంలో రాజ్యాంగేతర శక్తులు పని చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ఆరోపించారు. గురువారం హైదరాబాద్లో రఘువీరారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... చంద్రబాబు ఓఎస్డీ ఎస్.అభీష్ట నియామకమే ఇందుకు నిదర్శనమని ఆయన గుర్తు చేశారు.
కింది స్థాయి నుంచి సీఎంవో వరకు అరాచక పాలన సాగుతోందని ఆయన విమర్శించారు. ముఖ్యమైన ఫైళ్లు అన్నీ లోకేష్ సన్నిహితుడు అభీష్ట ద్వారానే కదులుతున్నాయన్నారు. ఏ అర్హత ఉందని అభీష్టను ఓఎస్డీగా నియమించారో చెప్పాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.