లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా ? | raghuveera reddy takes on sujana chowdary | Sakshi
Sakshi News home page

లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా ?

Published Sun, Sep 11 2016 10:33 PM | Last Updated on Sun, Sep 2 2018 5:11 PM

లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా ? - Sakshi

లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా ?

విజయవాడ : ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ నేతలు బోగస్ ప్రచారం చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి మండిపడ్డారు. హోదా బదులు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని కాంగ్రెస్ నేతలు సైతం మెచ్చుకుంటున్నారన్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యలను ఖండించారు. మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేశ్ ప్యాకేజీ మంచిదదని తనతో చెప్పినట్లు సుజనా చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్ధమని రఘువీరా అన్నారు.

'సుజనా.. కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మీరు చేసిన వ్యాఖ్యలు నిజమో కాదో తేల్చేందుకు లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమేనా?' అని రఘువీరా సవాల్ విసిరారు. ఈమేరకు ఆదివారం విజయవాడలోని పీసీసీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో సుజనాచౌదరికి రఘువీరా రాసిన లేఖను విడుదల చేశారు. సుజనా చౌదరి చేస్తున్న ప్రచారంపై ఇప్పటికే తాను జైరాం రమేష్తో మాట్లాడానని, కేంద్ర ప్యాకేజీ ప్రకటనను జైరాం కంటితుడుపు చర్యగా  అభివర్ణించారని రఘువీరా పేర్కొన్నారు. చిత్తశుద్ధి ఉంటే టీడీపీ నేతలు ఇకనైనా హోదా కోసం పోరాడాలని అన్నారు. విభజన చట్టంలోని హామీలన్ని నెరవేర్చాలని రఘువీరా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement