సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రఘువీరా అరెస్ట్ | Raghuveera reddy arrested in secunderabad railway station | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రఘువీరా అరెస్ట్

Published Sun, Oct 25 2015 10:50 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 AM

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రఘువీరా అరెస్ట్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రఘువీరా అరెస్ట్

సికింద్రాబాద్ : నరేంద్ర మోదీ సర్కార్ను నమ్మవద్దంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి బీహార్ ప్రజలకు హితవు పలికారు. ఆదివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పాట్నా ఎక్స్ప్రెస్లో నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా రఘువీరాతోపాటు  కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రచారం నిర్వహించారు. బీహార్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని ఓడించాలంటూ వారికి సూచించారు.

ఎన్నికల నేపథ్యంలో తమ రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా, విభజన హామీలను మోదీ ప్రభుత్వం అమలు చేయడం లేదని వారు పాట్నా ఎక్స్ప్రెస్లోని బీహారీ వాసులకు వివరించారు. ఎన్నికల నేపథ్యంలో బీహార్కు ప్రకటించిన ప్యాకేజీని కూడా మోదీ సర్కార్ మోసం చేస్తుందని రఘువీరారెడ్డితోపాటు కాంగ్రెస్ నేతలు వారికి విశదీకరించారు.

ఇంతలో పోలీసులు రంగ ప్రవేశం చేసి... ప్రచారానికి అనుమతి లేదంటూ రఘువీరాతోపాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో రైల్వే స్టేషన్లో ఉద్రిక్తం పరిస్థితి ఏర్పడింది. అనంతరం బెయిల్పై రఘువీరాతోపాటు కాంగ్రెస్ నాయకులను విడుదల చేశారు.  ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు రఘువీరా, సీఆర్, జేడీ శీలం, పళ్లంరాజు, కేవీపీలు బీహార్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement