
'దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది రఘువీరా'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిపై ఆ రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు నిప్పులు చెరిగారు. బుధవారం విజయవాడలో రావెల మాట్లాడుతూ.. దళితుల సంక్షేమంపై రఘువీరా మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. దళితుల సంక్షేమాన్ని నీరుగార్చింది కాంగ్రెస్ పార్టీనే అని ఆయన ఆరోపించారు. దళితుల సంక్షేమంపై బహిరంగ చర్చకు తాము సిద్ధమంటూ రఘువీరాకు రావెల సవాల్ విసిరారు.