
'6వ తేదీ నుంచి కోటి సంతకాల సేకరణ ఉద్యమం'
హైదరాబాద్: విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఏపీపీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు. అందుకోసం పార్లమెంట్ సమావేశాల్లో విభజన చట్టం హామీల అంశాన్ని లేవనెత్తుతామన్నారు. బుధవారం హైదరాబాద్లో రఘువీరారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ఈ నెల 6 వ తేదీన కోటి సంతకాల సేకరణ ఉద్యమం పోలవరంలో చేపడుతున్నామన్నారు. ఈ నెల 13, 14 తేదీల్లో విజయవాడలో రాష్ట్ర కాంగ్రెస్ మేధోమథన సమావేశం జరుగుతుందని రఘువీరా చెప్పారు.