సాక్షి, అనంతపురం : సైనికుల ప్రాణాలను పణంగా పెట్టిన నరేంద్ర మోదీకి ఒక్క క్షణం కూడా ప్రధానిగా కొనసాగే అర్హత లేదని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నీలకంఠపురంలో విలేకరులతో మాట్లాడిన రఘువీరా.. ‘హెచ్‌ఏఎల్‌ను కాదని రిలయన్స్ వారికి రాఫెల్ యుద్ధ విమానాల కాంట్రాక్ట్ ఇవ్వమని భారత ప్రధాని చెప్పారని.. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే చాలా స్పష్టంగా చెప్పారు. దేశ రక్షణను పణంగా పెట్టి 41 వేల కోట్ల రూపాయలు రిలయన్స్‌కు దోచి పెట్టిన నరేంద్ర మోదీ నిజ స్వరూపం బయటపడిందని’ వ్యాఖ్యానించారు. ఈ కుంభకోణంపై వెంటనే జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసి, వెనువెంటనే ప్రధాని రాజీనామా చేయాలని రఘువీరా డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment