పీసీసీ అధ్యక్షులతో రాహుల్ భేటీ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం. ఆ వెంటనే జరిగిన ఉప ఎన్నికల్లో కొద్దిగా ఉపశమనం. ఆ తర్వాత జరిగిన మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో స్థానాలను కైవసం చేసుకోలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. దీంతో పార్టీ భవిష్యత్తుపై సదరు పార్టీ నేతలలో నీలినీడలు కమ్ముకున్నాయి. భవిషత్తులో పార్టీని పరుగు పెట్టించాలని అధిష్టానం కసరత్తు ప్రారంభించింది.
అందులోభాగంగా ఏఐసీసీ కార్యాలయంలో వివిధ రాష్ట్రాలల పీసీసీ అధ్యక్షులతో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం భేటీ అయ్యారు. భవిష్యత్తులో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై పీసీసీ నేతలతో చర్చిస్తున్నారు. ఈ బేటీకి తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డిలు పాల్గొన్నారు.