ponnala lakshaiah
-
కాంగ్రేస్ పార్టీలో ‘పొన్నాల’ ప్రస్థానం ముగిసినట్టేనా..?
జనగామ: టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. సుమారు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఆయనకు ఏఐసీసీ పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వలేదనే ఆవేదనతో రాజీనామా లేఖాస్త్రం సంధించడంపై ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. జనగామ డీసీసీ అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాపరెడ్డిని నియామకాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న పొన్నాలకు.. పార్టీ టికెట్ కూడా రావడం లేదనే సంకేతాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ కూడా ఉంది. మరోవైపు ఆయన రాజీనామాపై రాజకీయ విశ్లేషకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్న విషయాలు స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీసీ నేతగా అంచెలంచెలుగా ఎదిగి పార్టీ కోసం అంకితభావంతో టీపీసీసీ స్థాయికి ఎదిగిన తనకే విలువ లేకపోతే.. సాధారణ బీసీ నాయకుల పరిస్థితి ఏంటని ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపిన లేఖలో ఆవేదన వ్యక్తం చేయడంపై సానుకూలత ఉంది. అవమానం భరించలేక 45 ఏళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం బాధ కలిగిస్తున్న దని కూడా పేర్కొనడంపైన పాజిటివ్ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం సర్వేలు, ఏఐసీసీ పరిశీలనల ఆధారంగా తీసుకునే నిర్ణయాలకు సీనియర్లు ఎందుకు కట్టుబడి ఉండరన్న చర్చ కూడా ఉంది. ఏమీ కాలేని నేతలు కాంగ్రెస్ పార్టీ నీడలో ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ పదవులను అనుభవించి పార్టీ మేలు కోసం తగ్గితే తప్పేమిటన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాగా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌పై పొన్నాల లక్ష్మయ్య రాజీనామా ప్రభావం చూపి.. మరికొందరు టికెట్ రాదని భావించే నాయకులు పార్టీని వీడకుండా టీపీసీసీ చర్యలు చేపడుతోంది. అసంతృప్తి నేతలతో సంప్రదింపులు జరిపి చక్కదిద్దే పనిలో పడింది. టికెట్ రావడం లేదనే సంకేతం... తెలంగాణకు తొలి టీపీసీసీ అధ్యక్షుడిగా 119 స్థానాలకు టికెట్ల ఖరారులో కీలకంగా వ్యవహరించిన పొన్నాల లక్ష్మయ్యను.. తనకే టికెట్ రావడం లేదన్న సంకేతాలు ఆవేదనకు గురి చేశాయని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 12 సంవత్సరాలు మంత్రిగా, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనుల కేటాయింపు మొదలు పార్టీ కార్యకలాపాల్లో ‘కింగ్‌మేకర్’గా ఉన్న ఆయనకు కొద్ది రోజులు ఏఐసీసీ పెద్దలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. మంత్రిగా, టీపీసీసీ చీఫ్‌గా ఉమ్మడి వరంగల్‌లో 1999 నుంచి 2014 వరకు ఓ వెలుగు వెలిగిన ఆయన గ్రాఫ్ 2016 తర్వాత పార్టీలో పడిపోయింది. ఏఐసీసీతో సైతం గ్యాప్ పెరగడంతోపాటు ఆయన నియోజకవర్గం జనగామకు కొత్త అభ్యర్థులు తెరమీదకు రావడాన్ని కూడా జీర్ణించుకోలేకపోయారు. తాను ఎంత వ్యతిరేకించినా.. కొమ్మూరి ప్రతాపరెడ్డిని డీసీసీ అధ్యక్షుడిని చేయడం మొదలు ఇవన్నీ తనకు టికెట్ రాకుండా చేయడమేనన్న సంకేతాలు ఆయనకున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన తర్వాత చివరి ప్రయత్నంగా ఏఐసీసీ పెద్దలను కలిసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రాజీనామాకు సిద్ధమైన పొన్నాల లక్ష్మ య్య.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, పార్టీ వ్యూహకర్త సునీల్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు రాజీనామా లేఖను పంపడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే పొన్నాల లక్ష్మయ్య.. త్వరలోనే బీఆర్ఎస్ గూటికి చేరతారన్న ప్రచారం జోరందుకుంది. ఈ నెల 16న జనగామలో సీఎం కేసీఆర్ సభ సందర్భంగా ఈ చేరిక ఉంటుందంటున్నారు. లేదంటే అంతకంటే ముందే మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరవచ్చని అంటున్నారు. 12 ఏళ్లు మంత్రిగా.. పొన్నాల లక్ష్మయ్య నాలుగున్నర దశాబ్దాలు, నలుగురు ముఖ్యమంత్రుల హయాంలో సుమారు 12 ఏళ్లపాటు రాష్ట్ర మంత్రిగా వివిధ శాఖలు నిర్వహించారు. ముఖ్య మంత్రులుగా పనిచేసిన నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, డా.వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వివిధ శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలి టీపీసీసీ అధ్యక్షుడిగా 2014 మార్చి 10న పొన్నాల లక్ష్మయ్య పార్టీ కీలక పదవిని చేపట్టారు. ఏడు పర్యాయాలు జనగామ నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన లక్ష్మయ్య నాలుగు సార్లు గెలుపొందారు. 1985లో సీపీఎం అభ్యర్థి అసిరెడ్డి నరసింహారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి చురగొండి రాజిరెడ్డిపై గెలిచిన పొన్నాల.. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో అదే చురగొండి రాజిరెడ్డిపై ఓటమి చెందారు. 1999లో ప్రేమలతారెడ్డి (టీడీపీ), 2004లో ఎ.బస్వారెడ్డి (టీడీపీ), 2009లో కొమ్మూరి ప్రతాపరెడ్డి (టీఆర్ఎస్ (బీఆర్ఎస్)పై పొన్నాల గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేతిలో ఓటమి చెందారు. కాగా, పొన్నాల లక్ష్మయ్య రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో ముగిసినట్లేనా అన్న చర్చ జరుగుతోంది. ఆయన రాజీనామాను ఆమోదిస్తే ముగిసినట్లేనని, పెద్దలు విస్తృత సంప్రదింపులు జరిపితే ఆయన మెత్తబడి తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకా శం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. -
హస్తం పార్టీలో ‘పొన్నాల’ ప్రస్థానం ముగిసినట్టేనా..?
సాక్షిప్రతినిధి, వరంగల్: టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. సుమారు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఆయనకు ఏఐసీసీ పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వలేదనే ఆవేదనతో రాజీనామా లేఖాస్త్రం సంధించడంపై ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. జనగామ డీసీసీ అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిని నియామకాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న పొన్నాలకు.. పార్టీ టికెట్ కూడా రావడం లేదనే సంకేతాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ కూడా ఉంది. మరోవైపు ఆయన రాజీనామాపై రాజకీయ విశ్లేషకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్న విషయాలు స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీసీ నేతగా అంచలంచెలుగా ఎదిగి పార్టీ కోసం అంకితభావంతో టీపీసీసీ స్థాయికి ఎదిగిన తనకే విలువ లేకపోతే.. సాధారణ బీసీ నాయకుల పరిస్థితి ఏంటని ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపిన లేఖలో ఆవేదన వ్యక్తం చేయడంపై సానుకూలత ఉంది. అవమానం భరించలేక 45 ఏళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం బాధ కలిగిస్తుందని కూడా పేర్కొనడంపైన పాజిటివ్ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం సర్వేలు, ఏఐసీసీ పరిశీలనల ఆధారంగా తీసుకునే నిర్ణయాలకు సీనియర్లు ఎందుకు కట్టుబడి ఉండరన్న చర్చ కూడా ఉంది. ఏమీ కాలేని నేతలు కాంగ్రెస్ పార్టీ నీడలో ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ పదవులను అనుభవించి పార్టీ మేలు కోసం తగ్గితే తప్పేమిటన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాగా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌పై పొన్నాల లక్ష్మయ్య రాజీనామా ప్రభావం చూపి.. మరికొందరు టికెట్ రాదని భావించే నాయకులు పార్టీని వీడకుండా టీపీసీసీ చర్యలు చేపడుతోంది. అసంతృప్తి నేతలతో సంప్రదింపులు జరిపి చక్కదిద్దే పనిలో పడింది. 12 ఏళ్లపాటు మంత్రిగా.. నాలుగున్నర దశాబ్దాలు, నలుగురు ముఖ్యమంత్రుల హయాంలో సుమారు 12 ఏళ్లపాటు రాష్ట్ర మంత్రిగా వివిధ శాఖలు నిర్వహించారు. ముఖ్యమంత్రులుగా పనిచేసిన నేదురుమల్లి జనా ర్దన్‌రెడ్డి, డా.వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వివిధ శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలి టీపీసీసీ అధ్యక్షుడిగా 2014 మార్చి 10న పొన్నాల లక్ష్మయ్య పార్టీ కీలక పదవిని చేపట్టారు. ఏడు సార్లు జనగామ నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన లక్ష్మయ్య నాలుగు సార్లు గెలుపొందారు. 1985లో సీపీఎం అభ్యర్థి అసిరెడ్డి నరసింహారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి చురగొండి రాజిరెడ్డిపై గెలిచిన పొన్నాల.. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో అదే చురగొండి రాజిరెడ్డిపై ఓటమి చెందారు. 1999లో ప్రేమలతారెడ్డి (టీడీపీ), 2004లో ఎ.బస్వారెడ్డి (టీడీపీ), 2009లో కొమ్మూరి ప్రతాపరెడ్డి (టీఆర్ఎస్ (బీఆర్ఎస్))పై పొన్నాల గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేతిలో ఓటమి చెందారు. కాగా, పొన్నాల లక్ష్మయ్య రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో ముగిసినట్లేనా అన్న చర్చ జరుగుతోంది. ఆయన రాజీనామాను ఆమోదిస్తే ముగిసినట్లేనని, పెద్దలు విస్తృత సంప్రదింపులు జరిపితే ఆయన మొత్తబడి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. టికెట్ రావడం లేదనే సంకేతం... తెలంగాణకు తొలి టీపీసీసీ అధ్యక్షుడిగా 119 స్థానాలకు టికెట్ల ఖరారులో కీలకంగా వ్యవహరించిన పొన్నాల లక్ష్మయ్యను.. తనకే టికెట్ రావడం లేదన్న సంకేతాలు ఆవేదనకు గురి చేశాయని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 12 సంవత్సరాలు మంత్రిగా, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనుల కేటాయింపు మొదలు పార్టీ కార్యకలాపాల్లో ‘కింగ్‌మేకర్’గా ఉన్న ఆయనకు కొద్ది రోజులు ఏఐసీసీ పెద్దలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. మంత్రిగా, టీపీసీసీ చీఫ్‌గా ఉమ్మడి వరంగల్‌లో 1999 నుంచి 2014 వరకు ఓ వెలుగు వెలిగిన ఆయన గ్రాఫ్ 2016 తర్వాత పార్టీలో పడిపోయింది. ఏఐసీసీతో సైతం గ్యాప్ పెరగడంతోపాటు ఆయన నియోజకవర్గం జనగామకు కొత్త అభ్యర్థులు తెరమీదకు రావడాన్ని కూడా జీర్ణించుకోలేకపోయారు. తాను ఎంత వ్యతిరేకించినా.. కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిని డీసీసీ అధ్యక్షుడిని చేయడం మొదలు ఇవన్నీ తనకు టికెట్ రాకుండా చేయడమేనన్న సంకేతాలున్నట్లు తెలిసింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన తర్వాత చివరి ప్రయత్నంగా ఏఐసీసీ పెద్దలను కలిసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రాజీనామాకు సిద్ధమైన పొన్నాల లక్ష్మయ్య.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, పార్టీ వ్యూహకర్త సునీల్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు రాజీనామా లేఖను పంపడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే పొన్నాల లక్ష్మయ్య.. త్వరలోనే బీఆర్ఎస్ గూటికి చేరతారన్న ప్రచారం జోరందుకుంది. ఈ నెల 16న జనగామలో సీఎం కేసీఆర్ సభ సందర్భంగా ఈ చేరిక ఉంటుందంటున్నారు. లేదంటే అంతకంటే ముందే మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరవచ్చని అంటున్నారు. -
తెలంగాణలో రజాకార్ల పాలన
మద్దూరు(హుస్నాబాద్): పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో తెరాస ప్రభుత్వ పాలన రజాకార్ల పాలనను తలపిస్తోందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని బైరాన్‌పల్లిలో సోమవారం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి అమరవీరుల బురుజు, స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసులను తెలంగాణ ప్రభుత్వ ఇప్పటి వరకు కొట్టివేయకపోవడం ఉద్యమకారులపై నిబద్దతకు నిదర్శనమని అన్నారు. మొదటి దశ ఉద్యమంలో విశాల ఆంధ్ర వద్దు తెలంగాణ ముద్దు అనే నినాదంతో నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాల్గొన్నట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఎమ్మెల్యేలు చేసిన సంతకాలలో తనదే మొదటి సంతకం అని తెలిపారు. మొదటి దశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఏమిటో తెలుసుకోవాలని గుర్తు చేశారు. కేసీఆర్‌కు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యమకారులు ఎందుకు గుర్తుకు రావడం లేదని నిలదీశారు. కొండగట్టు బాధితులను పరామర్శించేందుకు కేసీఆర్‌కు సమయం దొరకదని అన్నారు. కూటిగల్, బెక్కల, తోర్నాల గ్రామాలలో పర్యటించి పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బండి శ్రీనివాస్, టీపీసీసీ కార్యదర్శి గిరికొండల్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యరాలు నాచగోని పద్మవెంకట్ గౌడ్, బొడికే ఎల్లస్వామి,మారేళ్ళ భాస్కర్ రెడ్డి, ఆరే సాయిలు, దాసరి పద్మారెడ్డి పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ఒక్కటే లౌకిక పార్టీ
పార్టీ 130వ వ్యవస్థాపక దినోత్సవంలో టీపీసీసీ చీఫ్ పొన్నాల సాక్షి, హైదరాబాద్: దేశంలో లౌకికవాదాన్ని భుజాన మోయగలిగే శక్తి ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కాంగ్రెస్ 130 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను ఎవరూ, ఏమీ చేయలేరన్నారు. ప్రజాక్షేత్రంలో గెలుపోటములు అత్యంత సహజమని, కాంగ్రెస్చరిత్ర, దేశంకోసం చేసిన త్యాగం ప్రజలకు తెలుసునన్నారు. ‘‘సాధ్యంకాని హామీలు ఇచ్చి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాయి. ఆ రెండు పార్టీలపై భ్రమలు తొలిగిపోతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజాక్షేత్రంలో పోరాడతాం’’ అని పొన్నాల హెచ్చరించారు. నల్లధనాన్ని వంద రోజుల్లోనే వెనక్కి తెస్తామని గొప్పలు చెప్పుకున్న బీజేపీ.. ఇప్పుడు ఆ విషయంపై ఎందుకు మాట్లాడటం లేదని వి.హనుమంతరావు ప్రశ్నించారు. కార్యక్రమంలో సీఎల్పీ నాయకులు కె.జానారెడ్డి, పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, నేతలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, డి.కె.అరుణ, మల్లు రవి, కొనగాల మహేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. పీజేఆర్‌కు నివాళి కాంగ్రెస్ సీనియర్ నేత పి.జనార్దన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఖైరతాబాద్ జంక్షన్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పీజేఆర్ చేసిన కృషి మరిచిపోలేనిదని పేర్కొన్నారు. -
'మా గొంతు ఎవరూ నొక్కలేరు'
కరీంనగర్: తమ గొంతు ఎవరూ నొక్కలేరని, నొక్కే శక్తి ఎవరికీలేదని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న సీనియర్ సిటిజన్స్‌కు ప్రత్యేక అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ సభ్యత్వం నమోదుకు డిసెంబరు నెలాఖరు వరకు గడువు ఉందని చెప్పారు. అయితే ఈ నెల 9 నాటికే పూర్తి చేసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నట్లు పొన్నాల తెలిపారు. ** -
పీసీసీ అధ్యక్షులతో రాహుల్ భేటీ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం. ఆ వెంటనే జరిగిన ఉప ఎన్నికల్లో కొద్దిగా ఉపశమనం. ఆ తర్వాత జరిగిన మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో స్థానాలను కైవసం చేసుకోలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. దీంతో పార్టీ భవిష్యత్తుపై సదరు పార్టీ నేతలలో నీలినీడలు కమ్ముకున్నాయి. భవిషత్తులో పార్టీని పరుగు పెట్టించాలని అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. అందులోభాగంగా ఏఐసీసీ కార్యాలయంలో వివిధ రాష్ట్రాలల పీసీసీ అధ్యక్షులతో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం భేటీ అయ్యారు. భవిష్యత్తులో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై పీసీసీ నేతలతో చర్చిస్తున్నారు. ఈ బేటీకి తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డిలు పాల్గొన్నారు. -
పొన్నాల వల్లే అపోహలు
ఆయన వ్యవహారశైలే ఊహాగానాలకు కారణం: జానా ఏదైనా మీడియాకు సూటిగా చెప్పి ఉండాల్సిందని వ్యాఖ్య న్యూఢిల్లీ: పార్టీలో సమన్వయలోపం వార్తలపై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్య వహారశైలే అపోహలకు, ఊహాగానాలకు కారణమైందని సీఎల్పీ నేత కె.జానారెడ్డి వ్యాఖ్యానిం చారు. సమన్వయలోపంపై విలేకరులు ప్రశ్నిం చినప్పుడు ఆయన సూటిగా సమాధానం చెప్పి ఉంటే పత్రికల్లో అలాంటి కథనాలకు ఆస్కారం ఉండేది కాదని పేర్కొన్నారు. జయశంకర్ జ యంతి సందర్భంగా బుధవారం ఢిల్లీలోని తె లంగాణభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘జయశంకర్ చిరస్మరణీయుడు. క్రమశిక్ష ణ, నిబద్ధతతో కూడిన వ్యక్తిత్వం గల ఆయన త న వృత్తికి న్యాయం చేయడమే కాకుండా సామాజిక స్పృహతో అనేక కార్యక్రమాలు చేపట్టారు. సమగ్ర, సామాజిక అభివృద్ధితో కూడిన తెలంగాణ కావాలన్న ఆయన ఆకాంక్షను నెరవేర్చడమే మనం సమర్పించే నిజమైన నివాళి..’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీ పర్యటనపై చాలా ఊహాగానాలు ఉన్నాయని, పీసీసీ చీఫ్ పదవికి పోటీపడుతున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా... ‘పత్రికలు ఏవో కథనా లు రాస్తే వాటికి ఏం సమాధానం చెప్పగలను.’ అన్నారు. డీఎస్, పొన్నాల మీపై అసహనంతో ఉన్నారన్న విష యాన్ని ప్రస్తావించగా... ‘నేను చేసే పనిని హ ర్షించేవారిలో డీఎస్ ఒకరు... ఇక పొన్నాల లక్ష్మయ్యతో అంతకంటే బాగుంది.’ అన్నారు. ‘మా వద్ద సమన్వయ లోపం ఉందని ఆయన అంటే.. నా సమక్షంలో చెప్పాలని, నీకు జరిగిన ఇబ్బంది ఏంటి? అని అడుగుతా.. పార్టీకి నష్టం జరగకుం డా జాగ్రత్త తీసుకోవాలి. ఎవరో వచ్చి మీ వద్ద సమన్వయం లేనట్టుందని ప్రశ్నించినప్పుడు.. గట్టిగా అలాంటిదేమీ లేదని, పార్టీ బలోపేతానికి అందరం కృషిచేస్తున్నామని పొన్నాల సూటిగా చెప్పి ఉండాల్సింది.’ అన్నారు. -
కాంగ్రెస్ నేతల హస్తినయాత్రలు!
-
కాంగ్రెస్ నేతల హస్తినయాత్రలు!
నేడు జానా, షబ్బీర్, పొన్నం, భట్టి, డీకే అరుణలు ? ఢిల్లీలోనే మకాం వేసిన పొన్నాల, వివేక్ వివేక్, పొన్నం, షబ్బీర్ పేర్లను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ శ్రేణులు హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను తప్పించి మరొకరికి పగ్గాలు అప్పగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతున్నందున ఆ పదవిని ఆశిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు హస్తినకు క్యూ కడుతున్నారు. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు సీఎల్పీ నేత కె.జానారెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ కానున్నారు. టీపీసీసీ చీఫ్ నియామకం విషయంలో జానారెడ్డి అభిప్రాయాలను తెలుసుకునేందుకే ఈ భేటీ ఏర్పాటు చేశారు. దిగ్విజయ్‌తో భేటీ అనంతరం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కూడా జానారెడ్డి కలిసే అవకాశాలున్నాయి. మరోవైపు ఆ పదవిని ఆశిస్తున్న శాసనమండలి ఉపనేత షబ్బీర్‌అలీ బుధవారం జానారెడ్డితోపాటే ఢిల్లీ వెళుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే డీకే అరుణ కూడా బుధవారం హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గాలి బలంగా వీచినప్పటికీ పాలమూరులో మాత్రం ఐదుగురు ఎమ్మెల్యేలను, ఒక ఎంపీని కాంగ్రెస్ తరపున గెలిపించిన జిల్లా పాలమూరేనని ఆమె హైకమాండ్‌కు గుర్తు చేయనున్నారు. పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పాలమూరుకు కీలకమైన మంత్రి పదవి దక్కలేదని, ఈసారైనా పార్టీ ముఖ్యపదవి అప్పగించాలని ఆమె ప్రతిపాదిస్తున్నారు. మరోవైపు మాజీ ఎంపీ వివేక్ ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసి ఈ పదవి కోసం పెద్దఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సైతం బుధవారం లేదా గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క ఇప్పటికే పలుమార్లు ఇదే పనిపై ఢిల్లీ వెళ్లొచ్చారు. తాజాగా ఢిల్లీపెద్దల పిలుపు కోసం ఆయన వేచి చూస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల అయితే రెండ్రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి హైకమాండ్ పెద్దలందరినీ కలుస్తున్నారు. తనకు మరికొంత గడువిస్తే పార్టీ బలోపేతం చేస్తానని ప్రతిపాదిస్తున్నారు. జనం తిరస్కరించిన నేతకు పార్టీ పగ్గాలా? టీపీసీసీ చీఫ్ నియామకం కోసం గత ఎన్నికల్లో ఓడిపోయిన నేతల పేర్లు హైకమాండ్ పరిశీలనలో ఉన్నట్టు వార్తలు రావడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా సీఎల్పీ నేత జానారెడ్డి సైతం షబ్బీర్‌అలీ లేదా వివేక్ పేరును ప్రతిపాదిస్తున్నారని కథనాలు రావడంతో ఆయనపైనా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో జనం తిరస్కరించిన నేతలకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే ప్రజల్లోకి ఏ సంకేతాలు వెళతాయని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో ఓటమితో తీవ్ర నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు మనో ధైర్యం కలిగించాలంటే గెలిచిన ఎమ్మెల్యేల్లో సమర్థులకు పగ్గాలు అప్పగించడమే మేలంటూ పలువురు నేతలు రూపొందించిన వినతి పత్రాలను మంగళవారం కాంగ్రెస్ అధిష్టానానికి ఫ్యాక్స్ చేశారు. కాగా టీపీసీసీ అధ్యక్ష పదవికి తన పేరును ప్రతిపాదించొద్దని సీఎల్పీనేత జానారెడ్డికి సూచించిన మాజీమంత్రి శ్రీధర్‌బాబు సైతం బుధవారం ఢిల్లీ వెళుతున్నట్టు తెలిసింది. -
టీపీసీసీకి కొత్త సారథి?
-
టీపీసీసీకి కొత్త సారథి?
రేసులో భట్టి, శ్రీధర్‌బాబు, డీకే, షబ్బీర్, వివేక్, పొన్నం ఢిల్లీకి రావాలని జానారెడ్డికి అధిష్టానం పిలుపు రేపు హస్తినకు జానా.. ఢిల్లీ చేరిన పొన్నాల పార్టీ బలోపేతంపైనా చర్చించే అవకాశం తనకు మరికొంత గడువు ఇవ్వాలని హైకమాండ్‌కు వినతి హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి నుంచి పొన్నాల లక్ష్మయ్యను తప్పించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన స్థానంలో ఎవరిని నియమించాలనే అంశంపై హైకమాండ్ పెద్దలు కసరత్తు ముమ్మ రం చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డిని ఢిల్లీ రావాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ ఆదేశించినట్లు సమాచారం. సీఎల్పీ, టీపీసీసీ మధ్య సమన్వయం లేకపోవడం, టీపీసీసీ చీఫ్‌ను మార్చాలంటూ పార్టీలో పలువురు నేతలు హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తుండటం, పొన్నాలను తప్పించాలం టూ మరికొందరు నేతలు బాహాటంగానే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పొన్నాలను తప్పించి, అసంతృప్తికి తెరదించాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించారు. తెలంగాణ నేతలందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టేలా ఉత్సాహం నింపాలని యోచిస్తున్నారు. పార్టీ వర్గాల సమాచా రం మేరకు.. దిగ్విజయ్‌సింగ్ ఆదివారం జానారెడ్డికి ఫోన్ చేసి టీపీసీసీ చీఫ్ మార్పు, పార్టీ బ లోపేతం, టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు వంటి అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ రావాలని సూచించారు. వచ్చే వారంలో వస్తానని జానారెడ్డి చెప్పినప్పటికీ.. ఈ వారమే రావాలని దిగ్విజయ్ స్పష్టం చేశారు. దీంతో బుధవారం జానారెడ్డి ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రేసులో ఎందరో.. పొన్నాలను తప్పిస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుం డడంతో టీపీసీసీ పదవిపై పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నారు. కొందరు నేతలు ఏకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతోపాటు హైకమాండ్ పెద్దలను కలసి తమకు అవకా శం ఇవ్వాలని కోరారు. మరికొందరు తమకు అనుకూలంగా ఉన్న పెద్దల ద్వారా లాబీయింగ్ చేసే పనిలో పడ్డారు. శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క పేరు అధిష్టానం పెద్దల ముందు పరిశీలనకు వచ్చినప్పటికీ భట్టి వ్యతిరేకులు ఆయనపై పలు ఫిర్యాదులు చేయడంతో.. తాత్కాలి కంగా ఆ పేరును పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. శాసనమండలిలో ఉపనేత షబ్బీర్‌అలీ పేరు కూడా తెరపైకి వచ్చినా.. శాసనమండలి ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్ పదవీకాలం వచ్చే ఏడాది మార్చిలో ముగుస్తున్నందున ఆ పదవిని షబ్బీర్ ఆశిస్తున్నట్లు తెలిసింది. ఇక మాజీ మంత్రి డీకే అరుణ కొద్దిరోజులుగా టీపీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు. మాజీ ఎంపీలు వివేక్, పొన్నం ప్రభాకర్ కూడా లాబీయింగ్ చేస్తున్నారు. ఇక రాబోయే ఐదేళ్లు పార్టీకి అవసరమైన ఆర్థిక వనరులు సమకూరుస్తానని వివేక్ ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే మాజీ మంత్రి శ్రీధర్‌బాబు పేరును జానారెడ్డి తెరపైకి తెచ్చినట్లు సమాచారం. సీఎల్పీ, పీసీసీ సమన్వయం తో ముందుకు వెళ్లాలంటే శ్రీధర్‌బాబుకు టీపీసీసీ చీఫ్ పగ్గా లు అప్పగించడం మేలని కొందరు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్య హుటాహుటిన హస్తిన బయలుదేరి వెళ్లారు. తనకు మరికొంత గడువిస్తే పార్టీని గాడిలో పెడతానని హైకమాండ్ పెద్దలకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. -
క్షేత్రస్థాయిలో పర్యటనలు
పార్టీ పరిస్థితిని అంచనా వేద్దాం.. టీపీసీసీ నిర్ణయం ఆగస్టు రెండో వారం నుంచి మండలాల్లో పొన్నాల పర్యటనలు హైదరాబాద్: తమ పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో సమీక్షలు కొనసాగిస్తున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)... త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించి మండలాల వారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే నెల రెండో వారం నుంచి జిల్లాల్లో పర్యటించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సిద్ధమయ్యారు. ఈ సమీక్షల ద్వారా గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలను తెలుసుకోవడంతోపాటు క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉందనే విషయాన్ని కూడా అంచనా వేయవచ్చని ఆయన భావిస్తున్నారు. మండలాల వారీగా పార్టీ బలోపేతానికి తగిన చర్యలు చేపట్టాలని యోచిస్తున్నారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్న విషయం తెలిసిందే. వాస్తవ పరిస్థితిని అంచనా వేయాలంటే గాంధీభవన్‌కే పరిమితమైతే ఉపయోగం లేదని, పార్టీకి పూర్వ వైభవం తేవాలంటే క్షేత్రస్థాయిలో పర్యటించడమే మేలని టీపీసీసీ చీఫ్ పొన్నాల నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా ఒక్కో జిల్లాలో నాలుగైదు రోజుల చొప్పున మకాం వేసి మండలాల వారీగా సమీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. పార్టీ బలోపేతానికి ఏయే చర్యలు చేపట్టాలనే విషయంలో కార్యకర్తల అభిప్రాయానికే పెద్దపీట వేయాలన్నదే పొన్నాల అభిమతంగా కన్పిస్తోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావొస్తున్నా... ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత ఏవిధంగా ఉందనే విషయాన్ని కూడా ఈ సమీక్షల ద్వారా అంచనా వేయనున్నారు. దానికి అనుగుణంగా నిరసన కార్యక్రమాలు చేపట్టే దిశగా కార్యకర్తలను సమాయత్తం చేయాలని భావిస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇప్పటివరకూ మండలాల వారీగా పీసీసీ సమీక్షలు నిర్వహించిన దాఖలాల్లేవు. కానీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడంతో.. పార్టీ వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకే ఈ సమావేశాలకు టీపీసీసీ సిద్ధమవుతోంది. -
టీపీసీసీ చీఫ్ మార్పు!
పొన్నాలను తప్పించే యోచనలో కాంగ్రెస్ హైకమాండ్! తెరపైకి మల్లు భట్టి విక్రమార్క పేరు హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను తప్పించాలని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు భావిస్తున్నారు. ఆయన స్థానంలో టీపీసీసీ సారథిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందనే అంశంపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. పొన్నాల నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పలువురు సీనియర్ నేతలు ఆయనను తప్పించాలని కోరుతూ గత కొంత కాలంగా హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినా కాంగ్రెస్ లబ్ధి పొందకపోవడానికి నాయకుల మధ్య ఐక్యత లోపించడమేనని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర నాయకులను సమన్వయపర్చడంలో పొన్నాల వైఫల్యం చెందారనే అంచనాకు వచ్చింది. అయితే గతంలోలా హైకమాండ్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అవకాశాల్లేవని, సీనియర్ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అధ్యక్షుడిని నియమించాలని నిర్ణయించిందని ఏఐసీసీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఆయన వ్యాఖ్యలకు బలం చేకూరే విధంగా పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ గత కొద్దిరోజులుగా రాష్ట్రంలోని పలువురు నేతలకు ఫోన్లు చేసి పొన్నాల పనితీరుతోపాటు కొత్త సారథి ఎవరయితే బాగుంటుందని ఆరా తీస్తుట్టు తెలిసింది. సీఎల్పీ నేత జానారెడ్డి, మండలిలో ప్రతిపక్షనేత డీఎస్, ఉపనేత షబ్బీర్‌అలీ, ఏఐసీసీ కార్యదర్శులు వి.హనుమంతరావు, జి.చిన్నారెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డితోపాటు పలువురు సీనియర్ నేతలకు ఫోన్‌చేసి వారి అభిప్రాయాలను తీసుకున్నట్లు సమాచారం. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనమైనందున ఆ ప్రాంత నాయకుడికి పార్టీ పగ్గాలు అప్పగించాలని కొందరు, సామాజికవర్గాలతో పనిలేకుండా పార్టీ బలోపేతమే లక్ష్యంగా కొత్త అధ్యక్షుడిని నియామకం ఉండాలని మరికొందరు నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది. సామాజిక సమీకరణల్లో భాగంగా ఎస్సీ లేదా బీసీ నేతను టీపీసీసీ చీఫ్‌గా నియమించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే రెడ్డి సామాజికవర్గానికి సీఎల్పీ, బీసీ సామాజిక వర్గానికి మండలి ప్రతిపక్షనేత పదవి ఇచ్చినందున ఇతరవర్గాలకు టీపీసీసీ పగ్గాలు అప్పగించడం ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని అంచనా వేసిన హైకమాండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. మరో పక్క ఏఐసీసీ ప్రక్షాళనలో భాగంగా దిగ్విజయ్‌సింగ్‌ను తప్పిస్తే రాష్ట్ర ఇన్చార్జి పగ్గాలను ముకుల్ వాస్నిక్‌కు అప్పగించే అవకాశాలున్నాయని తెలిసింది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల తొలివారంలో ఏఐసీసీని పునర్వ్యవస్థీకరిస్తారని, ఆ తరువాతే టీపీసీసీ చీఫ్ నియామకం ఉంటుందని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. -
అధికారమే లేనప్పుడు ఆధిపత్య పోరెక్కడిది?: జానా
హైదరాబాద్: వచ్చే నెల 4న పార్టీ ఎమ్మెల్యేలు, ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థులతో ఏర్పాటు చేయనున్న సమావేశం ఆధిపత్య ప్రదర్శన కోసం కాదని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కె.జానారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేనప్పుడు ఆధిపత్య పోరెక్కడిదని ప్రశ్నించారు. తాను సీఎల్పీ నేతగా ఎన్నికైన నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాన్నారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో విభేదాలున్నాయన్నది అపోహ మాత్రమేనని పేర్కొన్నారు. పొన్నాల ప్రమేయం లేకుండా ఈ సమావేశం జరుగనుందని పత్రికల్లో వచ్చిన కథనాలపై బుధవారం జానారెడ్డి స్పందించారు. మాజీ మంత్రులు డీకే అరుణ, టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డిలతో కలిసి ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. సమావేశానికి పొన్నాలే ముఖ్యఅతిథి అని తెలిపారు. -
విప్ ధిక్కరించిన జెడ్పీటీసీలపై వేటు వేయించడమెలా?
టీపీసీసీ క్రమశిక్షణాసంఘంతో పొన్నాల భేటీ హైదరాబాద్: స్థానిక పీఠాల పోరులో కాంగ్రెస్ విప్‌ను ధిక్కరించిన జెడ్పీటీసీలపై అనర్హత వేటు వేయించాలని టీపీసీసీ నిర్ణయించింది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల ల క్ష్మయ్య మంగళవారం గాంధీభవన్‌లో పార్టీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ ఎం.కోదండరెడ్డి, సభ్యుడు డి.వి.సత్యనారాయణలతో ఇదే అంశంపై సమావేశమయ్యారు. ప్రధానంగా వరంగల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో పార్టీ విప్‌ను ధిక్కరించిన వారిపై చర్య తీసుకునే విషయంపైనే ఎక్కువసేపు చర్చ జరిగింది. అనర్హత వేటు విషయంలో న్యాయపరంగా ఇబ్బందుల్లేకుండా అధ్యయనం చేసి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని పొన్నాల సూచించినట్లు తెలిసింది. రాజ్యసభ సభ్యుడు పాల్వాయిపై వచ్చిన ఫిర్యాదుపైనా సమావేశంలో చర్చించారు. -
అధికార పార్టీదే హవా
చైర్మన్ ఎన్నికల్లో ఫలించిన గు‘లాబీ’ జనగామలో పీసీసీ చీఫ్ పొన్నాలకు షాక్ భూపాలపల్లి, పరకాలలో ఇదే పరిస్థితి నర్సంపేటలో పట్టు నిలుపుకున్న ‘దొంతి’ మానుకోటలో ఫలించిన కాంగ్రెస్ వ్యూహం ‘కమలానికి’ కలిసివచ్చిన అదృష్టం బీజేపీకి మూడు వైస్ చైర్మన్ పదవులు సాక్షి, హన్మకొండ: మునిసిపల్ చైర్మన్ ఎన్నికల్లో అధికార పార్టీ జోరు కొనసాగింది. పుర పీఠాలు దక్కించుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ వేసిన ఎత్తుగడలు ఫలించాయి. ఎన్నికల ఫలితాల వెలువడే నాటికి ఐదు పురపాలికల్లో ఒక్కచోట కూడా మెజార్టీ సాధించని గులాబీ.. తదనం తరం చోటుచేసుకున్న పరిణామాలతో వికసించింది. మూడు పురపాలికల్లో చైర్మన్ పీఠాన్ని అధిరోహించి సత్తా చాటుకుంది. పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సొంత ఇలాకాలో కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ ముచ్చెమటలు పట్టించింది. జిల్లాలోని వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ మినహా రెండు మునిసిపాలిటీలు (జనగామ, మహబూబాబాద్)... మూడు నగర పంచాయతీల్లో (పరకాల, భూపాలపల్లి, నర్సంపేట) గురువారం చైర్మన్ ఎన్నికలు నిర్వహించారు. జనగామ మునిసిపాలిటీతోపాటు పరకాల, భూపాలపల్లి నగర పంచాయతీలకు సంబంధించి చైర్మన్ పీఠాన్ని అధిరోహించి టీఆర్ఎస్ ఆధిక్యతను కనబర్చింది. మరోవైపు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించిన బీజేపీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జనగామ మునిసిపాలిటీ, పరకాల, భూపాలపల్లి నగరపంచాయతీల్లో వైస్ చైర్మన్ పదవులు దక్కించుకుంది. వివాదాల నడుమ జరిగిన మహబూబాబాద్ చైర్పర్సన్ ఎన్నికలో కాంగ్రెస్ చైర్మన్ పీఠాన్ని, సీపీఎం వైస్ చైర్మన్ పదవిని దక్కించుకున్నాయి. నర్సంపేట నగర పంచాయతీలో మాత్రం కాంగ్రెస్ సునాయాసంగా చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కించుకుంది. -
చేరితే వాళ్ల గొప్ప.. వీడితే నా తప్పా?
నాయకత్వ లోపముందన్న సీఎల్పీ వ్యాఖ్యలపై పొన్నాల రుసరుస హైదరాబాద్: ఎన్నికల్లో ఓటమికి నాయకత్వ లోపమే కారణమంటూ వస్తున్న ఆరోపణలను టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తప్పుబట్టారు. ‘కొందరు నాయకత్వ లోపంవల్లే నష్టం జరిగిందంటున్నారు. ఆ విషయాన్ని ఆ నాయకుల విజ్ఞతకే వదిలేస్తున్నా. అయినా ఎవరైనా కాంగ్రెస్‌లో చేరితే అది వారి గొప్పతనం.. పార్టీని వీడితే మాత్రం నా లోపమవుతుందా? అయినా టీపీసీసీ అధ్యక్షుడిగా నన్ను ఎంపిక చేయడమన్నది నా చేతుల్లోని విషయం కాదు. అది హైకమాండ్‌కు సంబంధించిన వ్యవహారం కదా!’ అని పొన్నాల శుక్రవారం గాంధీభవన్‌లో మీడియాతో వ్యాఖ్యానించారు. నాయకత్వ లోపం వల్లే రాష్ట్రంలో పార్టీ నష్టపోయిందంటూ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పొన్నాల ఈ విధంగా స్పందించారు. టీపీసీసీ తరఫున త్వరలో ‘బంగారు తెలంగాణ’ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించబోతున్నామని వెల్లడించారు. ఇకపై ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలతోపాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో జరుగుతున్న తప్పిదాలపై తెలంగాణ ప్రజలు ఈ వేదిక ద్వారా అభిప్రాయాలు పంచుకోవచ్చు. -
మా వాళ్లను టీఆర్ఎస్ ప్రలోభపెడుతోంది
టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను, కౌన్సిలర్లను, కార్పొరేటర్లను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రలోభాలకు గురి చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. హంగ్ ఏర్పడిన చోట.. కాంగ్రెస్ తరఫున గెలిచిన వారికి రకరకాల ఆశలు చూపుతూ... తమవైపు తిప్పుకుంటున్నారని ఆరోపించారు. పొన్నాల సొంత జిల్లా వరంగల్‌లో పలువురు కాంగ్రెస్ కార్పొరేటర్లు శనివారం టీఆర్ఎస్లో చేరిన నేపథ్యంలో పొన్నాల తీవ్రంగా స్పందించారు. తల్లిలాంటి కాంగ్రెస్‌కు ప్రజాప్రతినిధులు ద్రోహం చేయవద్దని హితవు పలికారు. ఎవరైనా పార్టీ ఫిరాయిస్తే కఠిన చర్యలు తప్పవని, పదవులు కోల్పోతారని హెచ్చరించారు. -
ఓటమిపై నివేదికలతో హస్తినకు
న్యూఢిల్లీ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గురువారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ ఓటమిపై ఆయన పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్‌లకు సమగ్రంగా నివేదికలు అందచేయనున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి పూర్తి బాధ్యత నాదే.... ఇదే మాటకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నానన్న పొన్నాల మరోవైపు పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామాపై సందిగ్ధంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పొన్నాల ఢిల్లీ పర్యటన తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. పొన్నాల తక్షణమే టీపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ సొంత పార్టీ నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయి. పొన్నాల రాజీనామాపై ఓవైపు సీనియర్ల నుంచి ఒత్తిళ్లు రావడం, మరోవైపు ఆయన తీరుపై అధిష్టానం గుర్రుగా ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో ఓటమిపై నివేదికలు సమర్పించనున్నారు. -
పొద్దు పొడుపును స్వాగతిద్దాం: పొన్నాల
హైదరాబాద్: సుదీర్ఘ పోరాటం తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబోతున్న సందర్భంగా 10 జిల్లాల్లో రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణలో పొద్దుపొడిచే సమయాన్ని ప్రతిఒక్కరూ స్వాగతించాలని బుధవారం ఒక ప్రకటనలో కోరారు. పార్టీ ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీ సాయంత్రం నుంచి అన్ని ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, కాగడా ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. దీపాలంకరణ, బాణసంచా కాల్చడం ద్వారా తెలంగాణకు ఘనస్వాగతం పలకాలని, అపాయింటెడ్ డే 2వ తేదీన పార్టీ తరపున ఉత్సవాలు చేపట్టాలని సూచించారు. -
పొన్నాల మెడపై రాజీనామా కత్తి
-
పొన్నాల మెడపై రాజీనామా కత్తి
టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలంటూ సీనియర్ల ఒత్తిళ్లు నేడు ఢిల్లీకి పొన్నాల పయనం ఎన్నికల్లో ఓటమిపై అధిష్టానానికి నివేదిక హైదరాబాద్: ‘ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి పూర్తి బాధ్యత నాదే. ఇదే మాటకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నా.’- తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మంగళవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలివి. ‘ఓటమికి బాధ్యత వహిస్తానని చెబుతున్న పొన్నాల ఇంకా టీపీసీసీ అధ్యక్ష పదవిలో ఎలా కొనసాగుతారు? వెంటనే రాజీనామా చేయాలి. లేకుంటే రాజకీయాల్లో ‘నైతిక బాధ్యత’ అనే పదానికి అర్ధమే ఉండదు ’ - తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల వ్యాఖ్యలు. పొన్నాల ఢిల్లీ పర్యటన తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. పొన్నాల రాజీనామాపై ఓవైపు సీనియర్ల నుంచి ఒత్తిళ్లు రావడం, వురోవైపు ఆయన తీరుపై అధిష్టానం గుర్రుగా ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో ఓటమిపై నివేదికతో పొన్నాల బుధవారం ఢిల్లీ పయునవువుతున్నారు. పొన్నాల తక్షణమే టీపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ సొంత పార్టీ నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయి. మాజీ మంత్రులు జానారెడ్డి, దానం నాగేం దర్, ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీలు మధుయాష్కీ, రాజయ్య, పొన్నం ప్రభాకర్‌తోపాటు మెజారిటీ నాయకులు, కార్యకర్తలు పొన్నాల తప్పుకుంటేనే మేలనే భావనను వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతూ 30 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలైన పొన్నాల లక్ష్మయ్య ఇంకా ఏ ముఖం పెట్టుకుని ఆ పదవిలో కొనసాగుతారంటూ నేరుగానే ప్రశ్నలు సంధిస్తున్నారు. దేశంలో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ సోనియా, రాహుల్ రాజీనావూకు సిద్ధపడ్డ విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు హైకమాండ్ పెద్దలను కలసి ఆయనను తప్పించాలని ఫిర్యాదు చేశారు. ఓటమిపై పొన్నాల అధిష్టానానికి నివేదిక సమర్పించను న్నారు. సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినా కాంగ్రెస్‌వల్లే తెలంగాణ వచ్చిందనే అంశాన్ని తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మడిగా విఫలమయ్యారని, దీనికితోడు 10 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకత, దేశంలో ఏర్పడిన రాజకీయ కారణాలు ఓటమికి ప్రధాన కారణాలని ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఎన్నికల్లో ఓటమికి ఉమ్మడి బాధ్యత వహిస్తున్నామంటూ ఈనెల 20న గాంధీభవన్‌లో టీపీసీసీ నేతలు చేసిన తీర్మానం ప్రతిని కూడా జతచేయనున్నట్టు సమాచారం. -
పిసిసి అధ్యక్షులు, మాజీ అధ్యక్షుల ఓటమి
హైదరాబాద్: ఈ సార్వత్రిక ఎన్నికలలో దేశవ్యాప్తంగానే కాకుండా, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం చవిచూడవలసి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి అక్కడ లబ్దిపొందుదామని చూసింది. అక్కడ కూడా చావుదెబ్బతింది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే చావు దెబ్బతింది. అటు తెలంగాణలో ఇటు ఏపిలో పిసిసి అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రులు ఓడిపోయారు. పిసిసి మాజీ అధ్యక్షులు డి.శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అందరూ కట్టగట్టుకొని ఓటమిని చవిచూశారు. రఘువీరా రెడ్డిది దయనీయ స్థితి. ఆయన మూడవ స్థానానికి పరిమితమయ్యారు. నిజామాబాద్ రూరల్ శాసనసభ స్థానంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ డి శ్రీనివాస్ తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి బాజీరెడ్డి గోవర్థన్పై 20 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వరంగల్ జిల్లా జనగామ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి విజయం సాధించారు. మరో పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి కిమిడి మృణాళిని చేతిలో ఓడిపోయారు. ఏపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అనంతపురం జిల్లా పెనుకొండలో పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ టిడిపి అభ్యర్థి పార్ధసారధి విజయం సాధించారు. రఘువీరా రెడ్డి మూడవ స్థానానికి వెళ్లారు. -
గిచ్చితే రెచ్చిపోతా
కేసీఆరే రాజకీయ వ్యభిచారి: పొన్నాల హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గిచ్చితే తాను మరింతగా రెచ్చిపోతానని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హెచ్చరిం చారు. రాజకీయాల్లో ఎప్పటికప్పుడు రంగులు మార్చే కేసీఆరే అసలైన వ్యభిచారి అని మండిపడ్డారు. ‘‘ఆకలితో, అవమాన భారంతో, కసితో అమెరికా వెళ్లొచ్చిన నన్ను విమర్శించే అర్హత కేసీఆర్‌కు లేదు. టీఆర్ఎస్ను చీలుస్తానంటూ నేనెన్నడూ మాట్లాడలేదు. అలాంటప్పుడు సంజాయిషీ ఇవ్వాల్సిన ఖర్మ నాకు లేదు. 55 మంది తెలంగాణ ద్రోహులకు కేసీఆర్ టికెట్లిచ్చారు. వారు గెలిస్తే ఎక్కడ టీఆర్ఎస్ను వీడతారోననే భయంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. రాహుల్‌గాంధీకి మద్దతిస్తాననడం కూడా ఆ భయంతోనే తప్ప కేసీఆర్ చిత్తశుద్ధి లేదు. ఆయన నిజంగా మాకు మద్దతిస్తే స్వాగతిస్తాం. కానీ ఆయన మాటలు నమ్మలేం’’ అంటూ తూర్పారబట్టారు. పొన్నాల గాంధీభవన్‌లో శనివారం మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... కేసీఆర్! నన్ను బ్రోకరంటావా? నువ్వు యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో మనుషుల అక్రమ రవాణా, అక్రమ పాస్‌పోర్టుల జారీ వంటి నీ దందాలు బయటపడలేదా? యువజన కాంగ్రెస్ నుంచి నిన్ను బయటకు పంపుతారని తెలుసుకుని ఎన్టీఆర్ పంచన చేరలేదా?తరవాత చంద్రబాబుతో కలిసి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి మంత్రి పదవి పొందలేదా? బాబు నీకు మంత్రి పదవి ఇవ్వలేదని టీఆర్ఎస్ పెట్టలేదా? 2004లో కాంగ్రెస్‌తో, 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకుని, ఫలితాలు రాకముందే ఎన్డీయే వైపు వెళ్లలేదా? మొన్న ఎన్డీఏకు, నిన్న థర్డ్ ఫ్రంట్‌కు మద్దతిస్తానన్లేదా? ఈ రోజు మళ్లీ మాట మార్చి రాహుల్‌కు మద్దతిస్తానని అనడం లేదా? రోజుకో మాట మార్చే నీ నైతిక విలువలేమిటి? దీన్ని రాజకీ య వ్యభిచారం కాక మరేమంటారు? టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను చీల్చాల్సిన అవసరం మాకు లేదు. -
కౌంటింగ్‌లో జర పదిలం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మున్సిపల్, పరిషత్, సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో జాగ్రత్తగా ఉండాలని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య జిల్లా కాంగ్రెస్ నేతలకు సూచించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో డీసీసీ అధ్యక్షుడు, పరిషత్ అభ్యర్థులు, ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. అభ్యర్థులవారీగా విజయావకాశాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈనెల 12, 13, 16వ తేదీల్లో జరిగే కౌంటింగ్‌కు ఏజెంట్ల నియామకంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఓట్ల లెక్కింపు సందర్భంగా వారు చురుకుగా వ్యవహరించేలా చూడాలని పేర్కొన్నారు. ఇందుకోసం ఈనెల 10న జిల్లా స్థాయిలో, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నగర సమావేశం పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, అర్బన్ అభ్యర్థి మహేశ్‌కుమార్‌గౌడ్ ఆధ్యర్యంలో, మున్సిపాలిటీల వారీ సమావేశాలు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో జరుపుకోవాలని సూచించారు. ఇందులో చేసిన తీర్మానాలను టీపీసీసీకి పంపించాలని ఆదేశించారు. విజయం మనదే తెలంగాణలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు సాధించి కాంగ్రెసే తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, లోక్‌సభ, పరిషత్ ఎన్నికలలోనూ తమదే గెలుపని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ప్రజలు సోనియాకు కృతజ్ఞతలు తెలిపేందుకు కాంగ్రెస్‌కే ఓటు వేశారని, పై చేయి తమదే అవుతుందన్నారు. అందుకే కౌంటింగ్‌ను సీరియస్‌గా తీసుకోవాలని, ఏజెంట్లు ఏమరపాటుగా వ్యవహరించకుండా చూసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్, మాజీ మంత్రి పి. సుదర్శన్‌రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్ షబ్బీర్ అలీ, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, మాజీ విప్ ఈరవత్రి అనిల్‌కుమార్, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. -
పొన్నాల ఇంటిని ముట్టడిస్తాం
జనగామ, న్యూస్‌లైన్ : అకాల వర్షానికి పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించేలా టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య చర్యలు తీసుకోవాలి.. లేకుంటే ఆయన ఇంటిని ముట్టడిస్తామని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హెచ్చరించారు. ఆయన పార్టీ నేతలతో కలిసి శనివారం మండలంలో వర్షానికి నష్టపోయిన పంటలను పరిశీలించి బాధితరైతులను పరామర్శించారు. మధ్యాహ్నం జనగామ మార్కెట్ యార్డును సందర్శించి నష్టం వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తొర్రూరుకు చెందిన మహిళా రైతు గోనె సోమలక్ష్మి తాను పండించిన 30 బస్తాల్లో 20 బస్తాల వడ్లు వర్షానికి కొట్టుకుపోయాయని విలపించింది. మరో రైతు మాట్లాడుతూ మార్కెట్లో దళారులు, హమాలీ లు అప్పనంగా ధాన్యం తీసుకుంటున్నారని, వ్యాపారులు కూడా క్వింటాలుకు రూ.1345 చెల్లించాల్సి ఉండగా రూ.1000 నుంచి 1200ల వరకే ధర పెడుతున్నారని వాపోయింది. పొన్నాల లక్ష్మయ్యకు పంటనష్టం వివరాలను తెలిపేందుకు ఎన్ని మార్లు ఫోన్ చేసినా కలువడం లేదని.. ఆయనకు రైతులపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్ కార్యదర్శి గంగుతో ముత్తిరెడ్డి మాట్లాడుతూ మార్కెట్లో అక్రమాలను అరికట్టాలని చెప్పారు. -
మెజార్టీ స్థానాలు కాంగ్రెస్‌కే..
తెలంగాణలో కొత్త ప్రభుత్వం మాదే టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఖిలాషాపురం(రఘునాథపల్లి), న్యూస్‌లైన్ : తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవ సం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధీమా వ్యక్తం చేశారు. ఆయన స్వగ్రామమైన ఖిలాషాపురంలో బుధవారం పొన్నాలతోపాటు ఆయన సతీమణి అరుణాదేవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం పొన్నాల లక్ష్మయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎంత ప్రచారాల జోరు పెంచినా ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలని, విశ్వసించదగిన పార్టీలనే ప్రజలు ఆదరిస్తారని, ఆ విషయూన్ని గత ఎన్నికలు నిరూపించాయన్నారు. తెలంగాణ కోసమే ఆవిర్భవించిన పార్టీ అని చెప్పుకునే వారికి 2004 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో 50 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తే 26 సీట్లు వచ్చాయన్నారు. 2009లో కాంగ్రెస్‌ను ఎలాగైనా గద్దె దింపాలని టీడీపీతో కలిసి మహాకూటమిగా ఏర్పడిన టీఆర్ఎస్.. 52 స్థానాలలో పోటీ చేస్తే కేవలం 10 స్థానాల్లో మాత్రమే విజయం సాధించిందని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో అవమానాలు, ఆరోపణలు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు 53 స్థానాలు సాధించిందన్నారు. నా ఓటు నాకు వేసుకోలే... ఇన్నేళ్ల నా రాజకీయ జీవితంలో నా ఓటు నాకు వేసుకున్నది లేదని పొన్నాల లక్ష్మయ్య అన్నా రు. జనగామ, హైదరాబాద్‌లో ఓటు వేసుకోవచ్చు.. కానీ ఇక్కడే పుట్టి పెరిగాను.. ఇదే పాఠశాలలో చదివాను.. అందుకే సొంత గ్రామంలో నే ఓటు వేస్తున్నా అని అన్నారు. ఈ ప్రాంతా న్ని అభివృద్ధి చేస్తున్నానని, జనగామ ప్రజలకు రుణపడి ఉన్నానని, వారే నా దేవుళ్లని అన్నా రు. తనకు ఎలాంటి పదవులు వచ్చినా జనగా మ ప్రజలకే అంకితమని ఆయన పేర్కొన్నారు. బడిగంట కొట్టి బజారుకొచ్చి నినాదాలు చేశా.. 1955లో 4వ తరగతి చదువుతున్నప్పుడు పాఠశాలలో బడిగంట కొట్టి బజారుకొచ్చి విశాలాంధ్ర వద్దు.. తెలంగాణ ముద్దు అని నినాదాలతో ఊరంతా తిరుగుతూ నినాదాలు చేశానని, అవి ఇప్పటికీ చెవిలో మార్మోగుతున్నాయని పొన్నాల గుర్తు చేశారు. ఆ ఉద్యమం ఏ ఒక్కరితో రాలేదని, 60 ఏళ్లుగా ప్రజల్లో ఉందన్నారు. దేశంలో 26 చోట్ల ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. చిరకాల కోర్కె నెరవేర్చినందుకు తెలంగాణలో కాంగ్రెస్ తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతుందని అన్నారు. ఆయన వెంట డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, పొన్నాల రామకృష్ణ, రాజనాల శ్రీహరి, బట్టి శ్రీనివాస్, సర్పంచ్ దొంగ అంజిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కడారి నాగేశ్వర్, నాయకులు గాదె రమేష్, పెరమాండ్ల రాంబాబు, పొన్నాల రామ్మోహన్, రాణిసంయుక్త, మంగు మనోహర్, హర్యానాయక్, బక్క ఉపేందర్, కట్ల సదానందం, ముప్పిడి శ్రీనివాస్, అన్వర్, సరాబు వీరన్న, నాసగోని మల్లయ్య, బండిమీది కుమార్, జిట్టె వీరస్వామి, చీమల ఈశ్వరయ్య, సరాబు వీరన్న, దన ప్రకాష్, మసి చంద్రమౌళి, రాజ్‌కుమార్ ఉన్నారు. -
అవలీలగా సర్కార్ ఏర్పాటు చేస్తాం
పార్టీ ఓడితే నేనే బాధ్యత వహిస్తా: పొన్నాల హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అవలీలగా తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా వల్లే తెలంగాణ వచ్చిందన్న కృతజ్ఞతాభావంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు జాతరలా తరలొచ్చి కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పట్టారని, ఓటింగ్ శాతం పెరగడానికి అదే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. గాంధీభవన్‌లో బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసారి హోరాహోరీ ప్రచారం జరిగినప్పటికీ తెలంగాణ ప్రజలు మాత్రం కాంగ్రెస్‌కే మద్దతు పలికారన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే క్రెడిట్ అందరికీ దక్కుతుందని, ఓడిపోతే మాత్రం తానొక్కడినే బాధ్యత వహిస్తానన్న మాటకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీఆర్ఎస్ అవసరం రానేరాదని పొన్నాల వ్యాఖ్యానించారు. కేంద్రంలోనూ కేసీఆర్ మద్దతు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల హడావుడిలో తాను నవ్వడమే మర్చిపోయానని, ఇకపై మునుపటి పొన్నాల కనిపిస్తాడని నవ్వుతూ చెప్పారు. -
కేసీఆర్ మాటలను నమ్మరు
హన్మకొండ చౌరస్తా : కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య, పశ్చిమ అభ్యర్థి ఎర్రబెల్లి స్వర్ణను గెలిపించాలని కోరుతూ గురువారం హన్మకొండ 28వ డివిజన్ పరిధిలోని న్యూశ్యాయంపేటలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తనదైన శైలిలో విమర్శల జల్లు కురిపించారు. కేసీఆర్ ఆచరణకు సాధ్యం కాని హామీలను గుప్పిస్తూ... తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ తుపాకి రాముడి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారని, ఈ ఆదరణను చూసి కేసీఆర్‌కు ఏమి చేయాలో పాలుపోవడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న అనేక సమయాల్లో కేసీఆర్ ఫామ్ హౌస్‌లోనే పడుకున్నాడని విమర్శించారు. ప్రొఫెసర్ జయశంకర్ ను అవమానించేలా ప్రవర్తించాడని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే వితంతు, వికలాంగ, వృద్ధాప్య పింఛన్ల మొత్తాన్ని పెంచుతామని, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో విద్యుత్ సంక్షోభాన్ని గట్టెక్కించేందుకు ప్రతి మండల కేంద్రంలో సౌరశక్తితో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తామన్నారు. -
కేసీఆర్‌ది పదవీ కాంక్ష
అందుకే.. తెలంగాణను తాకట్టు పెట్టారు ఉద్యమ ద్రోహులకు టికెట్లు ఇచ్చారు సామాజిక తెలంగాణే కాంగ్రెస్ లక్ష్యం నేటి రాహుల్ సభకు భారీ జనసమీకరణ టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల తన పదవి కోసం టీఆర్ఎస్ అధినేత తెలంగాణను తాకట్టుపెట్టారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. దళితుడిని సీఎం, ముస్లింను డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పి... మాటమార్చిన మోసకారి అని విమర్శించారు. పదవీ కాంక్ష కోసం మరోసారి తెలంగాణ నినాదం ఎత్తుకున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ద్రోహులకు ఈ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంత ప్రజలు కృతజ్ఞత చాటి అధికారంలోకి తీసుకొస్తారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు విశ్వసనీయతకు మారుపేరని కొనియూడారు. హన్మకొండలోని తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొన్నాల మాట్లాడారు. 1956 నుంచి ఇప్పటి వరకు వివిధ దఫాల్లో తొలి నుంచి కాంగ్రెస్‌వాదులే తెలంగాణ ఆకాంక్షను చాటిచెబుతూ వచ్చారని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియాది కీలకమైన పాత్రగా అభివర్ణించారు. బీజేపీ ద్వంద ప్రమాణాలు పాటించి, అడ్డంకులు కల్పించినా సోనియా పట్టుదలతో వ్యవహరించి తెలంగాణ ప్రజల కల సాకారం చేశారని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి 5 సూత్రాలు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని ఐదు సూత్రాలతో అభివృద్ధి చేస్తామని పొన్నాల చెప్పారు. సుస్థిర ప్రభుత్వం, సుపరిపాలన, సామాజిక భాగస్వామ్యం, ఆత్మగౌరవం, బంగారు తెలంగాణే లక్ష్యమ న్నారు. అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగం, ఎక్స్‌గ్రేషియా, ఇంటి వసతి కల్పిస్తామన్నారు. కేసీఆర్ అవమాన పరిచిన జయశంకర్ సార్ పేరుతో ట్రస్టు ఏర్పాటు చేసి ఆదుకుంటామన్నారు. లక్ష ఉద్యోగాల కల్పనతోపాటు వయోపరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచుతామన్నారు. రైతులకు పగలే ఏడు గంటలపాటు ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి గురించి ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. ఈయన పార్లమెంట్‌కు 14 శాతం మాత్రమే హాజరయ్యారని దెప్పిపొడిచారు. గోదావరి జలాల కోసం ఉద్యమిం చిన చరిత్ర, భూపాలపల్లిలో థర్మల్‌పవర్ స్టేషన్ ఏర్పాటుకు చేసిన కృషి గురించి కేసీఆర్‌కు ఏం తెలుసన్నారు. నేటి సభకు భారీగా జనసమీకరణ మడికొండలో శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమయ్యే రాహుల్ సభకు ఏర్పాట్లు పూర్తయ్యూయని పొన్నాల చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని విభాగాల శ్రేణులతోపాటు అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. రేపు ఆసిఫాబాద్‌లో నాయకుల సమావేశం ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌లో 26న తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకుల సమావేశం ఏర్పాటు చేసినట్లు పొన్నాల తెలిపారు. 27న మెదక్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభ ఉందన్నారు. ఈ సభకు సోనియాగాంధీ హాజరుకానున్నట్లు తెలిపారు. 28న జనగామలో జరిగే రోడ్‌షోకు జయప్రద హాజరవుతారని వెల్లడించారు. సమావేశంలో కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, నాయకులు డాక్టర్ బండా ప్రకాష్, సాంబారి సమ్మారావు, రాజనాల శ్రీహరి, ఈవీ.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
కేసీఆర్ మోసకారి
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు రేపటి రాహుల్ సభను విజయవంతం చేయూలి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బచ్చన్నపేట, నర్మెటలో సినీ నటి జయసుధతో కలిసి రోడ్ షో బచ్చన్నపేట, నర్మెట, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన వెంటనే టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తానని మాట ఇచ్చి మోసం చేసిన వాడు మంచోడు కాదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పరోక్షంగా విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన సినీ నటి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి జయసుధతో కలిసి జనగామ నియోజకవర్గ పరిధిలోని బచ్చన్నపేట, నర్మెటలో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పొన్నాల మాట్లాడుతూ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిన వ్యక్తి, అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిన మనిషి... ఆ పార్టీ ప్రకటించిన మెనిఫెస్టోను ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. జనగామ ప్రాంతానికి గోదావరి జలాలను రప్పించించేందుకు నాడు చేసిన పోరాటం ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. కాలువల ద్వారా బచ్చన్నపేట మండలంలోని అన్ని చెరువులకు నీళ్లు మళ్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో రూ.26 కోట్లతో సబ్స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లు మంజూరు చేయించి లోఓల్టేజీ సమస్యను నివారించినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించి... మహిళా సాధికారతను చాటిందన్నారు. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన ఘనత సోనియాగాంధీకే దక్కుతుందన్నారు. ఈ మేరకు కానుకగా కాంగ్రెస్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. దేశంలో, రాష్ట్రంలో సుస్థిర పాలన రావాలంటే చేతి గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ నెల 25వ తేదీన వరంగల్ నగరంలో జరగనున్న భారీ బహిరంగ సభకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హాజరుకానున్నారుని, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయూలని పొన్నాల పిలుపునిచ్చారు. జనగామకు పొన్నాల వరం : జయసుధ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య జనగామ నియోజకవర్గ ప్రజలకు దేవుడిచ్చిన వరమని జయసుధ కొనియాడారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నారు. నా దేశం నా కోసం ఏమి చేసింది అని కాకుండా, నేను నా దేశం కోసం ఏమి చేశాననే ఆలోచనతో ముందుకుసాగే వ్యక్తి పొన్నాల లక్ష్మయ్య అని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ప్రకటన తర్వాత తెలంగాణకు వాచ్‌డాగ్‌లా ఉంటానన్నది నిజం కాదా... టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని బహిరంగ ప్రకటనలు చేయడం వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇచ్చిన మాట తప్పారని... ఆడబిడ్డకు మాట ఇచ్చి తప్పినవాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధిలోకి తీసుకొస్తారని విమర్శించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దొరల పాలన వస్తుందని హెచ్చరించారు. సామాజిక తెలంగాణ, కొత్త రాష్ట్ర అభివృద్ధి జాతీయ పార్టీ అరుున కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. అనంతరం పొన్నాల లక్ష్మయ్య, జయసుధను పొన్నాల వైశాలి పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. సభల్లో ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ మాసపేట రవీందర్‌రెడ్డి, రాజనాల శ్రీహరి, మాజీ ఎమ్యెల్యేలు సీహెచ్.రాజిరెడ్డి, గొర్ల సిద్ధయ్య, టీ పీసీసీ అధికార ప్రతినిధులు మొగుళ్ల రాజిరెడ్డి, బక్క నాగరాజు, తొర్ర సత్యం, పట్టణ అధ్యక్షులు గుర్రపు బాల్‌రాజు, గిరబోయిన అంజయ్య, పుల్ల భాస్కర్, ఓయూ జేఏసీ నాయకురాలు బాల లక్ష్మి, ఈర్ల బుచ్చిరాములు, జల్లి సిద్ధయ్య, అర్జుల సుధాకర్‌రెడ్డి, భూక్య జూంలాల్ నాయక్, పెద్ది రాజిరెడ్డి, జంగిటి అంజయ్య, ప్రజ్ఞపురం యాదగిరి, గొల్లపల్లి కుమారస్వామి, కొంపెల్లి రమేష్, సర్పంచ్‌లు, నేతలు పాల్గొన్నారు. చేర్యాల సీఐ డేవిడ్, బచ్చన్నపేట, మద్దూరు, చేర్యాల ఎస్సైలు షాదుల్లాబాబా, వేణుగోపాల్, నరేందర్ బందోబస్తు నిర్వహించారు. -
అగ్రనేతలొస్తున్నారు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: చేవెళ్లకు సోనియా స్టార్ క్యాంపెయినర్లు లేక డీలాపడిన కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు 27న పార్టీ అధినేత్రి సోనియాగాంధీ చేవెళ్లకు రానున్నారు. ఒక రోజు పర్యటనలో భాగంగా రాష్ట్రానికి వస్తున్న ఆమె మెదక్ జిల్లా అందోల్‌లో జరిగే సభలో పాల్గొంటారు. అంతకుముందుగానీ ఆ తర్వాతగానీ చేవెళ్లలో ఏర్పాటుచేసే బహిరంగసభలో పాల్గొనేలా షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు టీపీసీసీ కసరత్తు చేస్తోంది. టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యతో భేటీ అయిన చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కార్తీక్‌రెడ్డి చేవెళ్లలో మేడమ్ పర్యటన ఉండాలని పట్టుబట్టారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జ దిగ్విజయ్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పొన్నాల చెప్పి నట్లు తెలుస్తోంది. సాధ్యమైనంత వరకు మేడమ్ పర్యటన ఉండేలా చూస్తామని, ఏర్పాట్లు చేసుకోవాలని పొన్నాల సూచించినట్లు కార్తీక్‌రెడ్డి ‘సాక్షి’ తెలిపారు. దీంతో చేవెళ్లలో జరిగే ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యేలా షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ముగింపు వేళ అధినేత్రి చేసే మార్గనిర్దేశం పార్టీ శ్రేణులకు టానిక్‌లా పనిచేస్తుందని అధికార పార్టీ భావిస్తోంది. ఏడు చోట్ల కేసీఆర్ ‘షో’లు ఇదివరకే చేవెళ్ల, మల్కాజిగిరిలో పర్యటించిన టీఆర్ఎస్ సారథి కేసీఆర్ ఈ నెల 27న రెండో విడ త ఎన్నికల ప్రచారానికి జిల్లాకు రానున్నారు. హెలికాప్టర్ ద్వారా వివిధ ప్రాంతాలకు చేరుకునే కేసీఆర్.. ఆ రోజు జిల్లాలో ఏడు చోట్ల జరిగే రోడ్‌షోలలో పాల్గొంటున్నారు. తాండూరు, పరిగి, వికారాబాద్, మేడ్చల్, ఎల్బీ నగర్, ఉప్పల్, కుత్బుల్లాపూర్‌లో నిర్వహించే రోడ్‌షో/బహిరంగసభల లో కేసీఆర్ మాట్లాడనున్నారు. మంచి ఊపు మీదు గులాబీ బాస్ జిల్లాపై గంపెడాశ పెట్టుకున్నారు. తెలంగాణలో తొలి ప్రభుత్వం మాదేనని ఆశలపల్లకీలో ఉన్న కేసీఆర్.. టీడీపీ, కాంగ్రెస్ బలంగా ఉన్న రంగారెడ్డి జిల్లాపై గురి పెట్టారు.ఈ నేపథ్యంలోనే జిల్లాలో ముమ్మరంగా ప్రచారం సాగించేందుకు ప్రణాళిక ఖరారు చేశారు. బాబు ప్రచారం ఇక్కడి నుంచే.. సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని చంద్రబాబు జిల్లా నుంచే శ్రీకారం చుట్టారు. మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఈనెల 13న ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన మరుసటి రోజు చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిధిలో ఎన్నికల భేరీని మోగించారు. ఇప్పటి కే మహేశ్వరం, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, మేడ్చల్ తదితర నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. మరో ఐదు రోజుల్లో ప్రచారపర్వానికి తెరపడనున్న నేపథ్యంలో కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ఈ నెల 27న జిల్లా పర్యటనకు వస్తున్నారు. చేవెళ్ల, కందుకూరు (మహేశ్వరం), శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ సెగ్మెంట్లలో ఆయన ఎన్నికల ప్రచారం చేయనున్నారు. -
మగాడివైతే విచారణ జరిపించాలి
టీ-పీసీసీ అధ్యక్షుడు పొన్నాలకు కేటీఆర్ సవాల్ సిరిసిల్ల తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మగాడైతే తమ పార్టీ అధినేత కె చంద్రశేఖర్‌రావు ఆస్తులపై విచారణ జరిపించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు సవాల్ చేశారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఆస్తులపై విచారణ జరుపుతామని పొన్నాల పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు. తమపై సీబీఐ కేసుల్లేవని, అవినీతి ఆరోపణలు అంతకంటే లేవన్నారు. విచారణ చేసినా చేసేదేమీలేదన్నారు. కాంగ్రెస్ దివాళాకోరు రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. జూన్ 2 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు -
కేసీఆర్‌ది... అధికార దాహం
ఇంటర్వ్యూ: పొన్నాల లక్ష్మయ్య ‘సీసా లేదు, పైసా లేదు’ అని శంకరమ్మను కేసీఆర్ అవహేళన చేశాడు వైఎస్ పథకాలు మరింత మెరుగ్గా తెలంగాణలోనూ కొనసాగుతాయి చంద్రబాబును ఎవరూ నమ్మరు.. బీసీ సీఎం అనడం పెద్ద ఫార్స్ ఎలక్షన్ సెల్ : పొన్నాల లక్ష్మయ్య... తెలంగాణకు తొలి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. ఎన్నికల ప్రచారం జోరు మీదున్న నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పొన్నాల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ పెరుగుతోంది. తెలంగాణ తమ వల్లే సాకారమైందనే ప్రచారంతోనే ఎవరికి వారు ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పలు అంశాలపై ‘సాక్షి’ ప్రతినిధికి పొన్నాల ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే... సోనియా వల్లే రాష్ట్రం సాకారమైందన్న భావన తెలంగాణ ప్రజల హృదయాల్లోకి చొచ్చుకుపోయింది. సోనియా-తెలంగాణ... ఈ రెండూ విడిపోని బంధం. మరో ప్రాంతంలో ఇబ్బందులున్నా తెలంగాణ ఇచ్చారని అందరూ కాంగ్రెస్‌ను హర్షిస్తున్నారు. పార్లమెంటులో బిల్లు ఆమోదానికి సోనియా చూపిన చొరవ, పట్టుదలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్తాం. సుస్థిర పాలన... సుపరిపాలన... సామాజిక భాగస్వామ్యం ప్రధానాంశాలుగా ముందుకెళ్తాం. తెలంగాణలో గెలుపు మాదే. టీఆర్ఎస్కు ప్రజల మద్దతు లేదు తమ వల్లే తెలంగాణ వచ్చిందని టీఆర్ఎస్ చెప్పుకోవడం విడ్డూరం. టీఆర్ఎస్ కంటే ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సాధనకు కృషి చేసింది. అయినా ఇద్దరు ఎంపీలున్న ఆ పార్టీ, పైగా పరస్పరం పొసగని ఇద్దరు ఎంపీలు... 543 మంది ఎంపీలున్న లోక్‌సభను ప్రభావితం చేయగలరని ఎవరనుకుంటారు? కాంగ్రెస్ లేకుంటే వీరివల్ల తెలంగాణ సాకారం అయ్యేదా? బిల్లు ఆమోదంలో టీఆర్ఎస్ పాత్ర ఏమాత్రం లేదని సోనియా కూడా స్పష్టం చేశారు. 2004 ఎన్నికల ప్రణాళికలోనే తెలంగాణ సాధన లక్ష్యాన్ని కాం గ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్‌తోనే తెలంగాణ సాధ్యమనే నాడు టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. 50 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ కేవలం 26 స్థానాల్లోనే గెలిచింది. 2009లో కాంగ్రెస్‌తో తెలంగాణ రాదని భావించిన ఆ పార్టీ మహా కూటమిగా ఏర్పడిన టీడీపీ, సీపీఐ, సీపీఐ పంచన చేరింది. అయినా 52 స్థానాల్లో పోటీ చేసి కేవలం 10 సీట్లే గెలిచింది. ఇది దేనికి ప్రతీక? ప్రజలు వారిని ఆదరించనే లేదు. తెలంగాణ సాకారమయ్యాక ఇటీవల జరిగిన స్థానిక సంస్థల, మునిసిపాలిటీల ఎన్నికల్లో టీఆర్ఎస్కు, ఇతర పార్టీలకు కనీసం అభ్యర్థులు దొరకలేదంటే వారి గ్రాఫ్ పెరిగినట్టా, తగ్గినట్టా? పైగా టీఆర్ఎస్ ఇప్పుడు ఇతర పార్టీల నుంచి వచ్చిన 20 మందికి, తెలంగాణను అడ్డుకున్న వాళ్లకు, తెలంగాణ ద్రోహులకు టికెట్లిచ్చింది. మొదటి నుంచీ పార్టీలో ఉన్న వాళ్లకు మొండిచేయి చూపింది. ముస్లిం నేతలైన ఇబ్రహీం, రెహ్మాన్, దళిత నేతలు విజయరామారావు బయటకు పోయేలా చేసింది. గిరిజన నాయకుడు రవీంద్రనాయక్‌ను గెంటేశారు. బీసీ నాయకుడు దాసోజు శ్రవణ్, యాదగిరి, సురేందర్‌లను అనేక విధాలుగా అవమానపరిచారు. టీఆర్ఎస్ పార్టీ మొత్తం కుటుంబ పెత్తనంగా మారింది. దళిత ముఖ్యమంత్రి అని చెప్పిన కేసీఆర్, ఆ పీఠం తనకే కావాలని కలలు కంటున్నాడు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరనే అంశాన్ని పార్టీ ఇప్పుడే చెప్పడం లేదు. నేను సీఎం రేసులో ఉన్నానా, లేదా అనేది ఇప్పుడు అప్రస్తుతం. ఉన్నత స్థానంలో ఉన్నవారు ఎవరైనా సీఎం సీటు పట్ల ఆశ లేకుండా ఎలా ఉంటారు? టీడీపీ, బీజేపీ పొత్తును ఎవరూ విశ్వసించరు టీడీపీ తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసింది. బీజేపీదేమో తెలంగాణ ఇవ్వలేని పరిస్థితి. పార్లమెంటులో చివరిదాకా తటపటాయించింది. ఆ రెండు పార్టీలు అపవిత్ర పాత్ర పోషించాయి. టీడీపీని ఎవరూ నమ్మరు. వారిద్దరి పొత్తులను ఎవరూ విశ్వసించరు. మోడీ గాలి కేవలం హైప్. ఒకప్పుడు బీజేపీ అంటకాగి, అది తప్పని భావించి లెంపలేసుకున్న చంద్రబాబు మళ్లీ ఇప్పుడు అదే పార్టీతో పొత్తుకు వెళ్లడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అధికారంలోకి రాలేనని తెలిసే చంద్రబాబు తెలంగాణలో బీసీ సీఎం అంటున్నారు. బీసీలపై బాబుకు నిజంగా ప్రేమే ఉంటే సీమాంధ్రలో బీసీని సీఎం చేస్తానని హామీ ఎందుకు ఇవ్వడం లేదు? అక్కడ బీసీల్లేరా? కనీసం బీసీని టీడీపీకి అధ్యక్షుడిగా ఎందుకు చేయలేకపోయారు? పవన్ క ల్యాణ్... ఎవరాయన? పవన్‌కల్యాణ్... ఎవరాయన? ఏ పార్టీ? విధానమేమిటి? అనుభవమేమిటి? బీజేపీ వంటి జాతీయ పార్టీకి పవన్ కల్యాణ్ వంటివారు లేకుంటే నడిచే పరిస్థితి లేకపోవడం ఆ పార్టీ దుస్థితికి నిదర్శనం. బీజేపీ అంత తక్కువ స్థాయిలో ఉందా అన్న అనుమానం వస్తోంది. బీజేపీ పవన్ వెంటబడటమే విచిత్రంగా ఉంది. వైఎస్ పథకాలు కొనసాగుతాయ్... నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన పథకాలు కాంగ్రెస్‌వే. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, పెన్షన్ వంటి పథకాలు తెలంగాణ ప్రభుత్వంలోనూ కొనసాగుతాయి. వాటిని మరింత మెరుగు పరిచి అమలు చేస్తాం. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా పార్టీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమే. అయితే అక్కడి ప్రజలకు ఎవరికి ఓటేయాలో తెలుసు. జయశంకర్ ట్రస్టు పెడతాం 1969లోనూ, ఇప్పుడూ తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను ఆదుకుంటాం. ప్రొఫెసర్ జయశంకర్ స్మారక ట్రస్టు ఏర్పాటు చేసి ఇల్లు, ఉద్యోగం, పరిహారం, పెన్షన్ ఇస్తాం. ట్రస్టుకు రూ.100 కోట్లు కేటాయిస్తాం. హైదరాబాద్‌లో ఐదెకరాల్లో అమరవీరుల స్మృతివనం ఏర్పాటు చేస్తాం. ఓడిపోయే సీటును శంకరమ్మకా? అమరవీరుల కుటుంబీకులెవరూ మమ్మల్ని టికెట్లు అడగలేదు కాబట్టే ఇవ్వలేదు. అయినా వారికి ఏ పార్టీలు టికెట్లిచ్చాయి? శంకరమ్మకు హుజూర్నగర్ టికెటిచ్చి టీఆర్ఎస్ అవమానించింది. బలమైన కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నందున ఎటూ గెలవలేమనే కేసీఆర్ అలా చేశారు. ఆమె సొంత నియోజకవర్గం అడిగితే ‘ఛీ... పో’ అన్నారు. ‘సీసా లేదు... పైసా లేదు’ అంటూ అవహేళన చేశారు. అమరవీరులపై నిజంగా ప్రేమే ఉంటే సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లల్లో ఏదో ఒకటి ఎందుకివ్వలేదు? -
నన్ను తిడితేనే కేసీఆర్‌కు ఓటు
ఓటమిని ఆయన అంగీకరించినట్లే: పొన్నాల {పాణహితకు అనుమతులు సాధించాలి.. తర్వాతే జాతీయ హోదా కరీంనగర్ సభకు కనీవినీ ఎరగని జనమొచ్చారు హైదరాబాద్: పనిలేనోడు ఊళ్లు తిరుగుతూ మాట్లాడినట్లుగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కేసీఆర్ తరుచూ తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం వెనుక కారణముందన్నారు. ‘పొన్నాలను తిడితేనే కేసీఆర్‌కు ఓట్లు పడతాయనుకుంటున్నాడు. అందుకే నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. సన్నాసులకు అధికారం అప్పగిస్తే అంతే సంగతులని కేసీఆర్ చెబుతున్నాడు. అంటే కాంగ్రెస్ గెలుస్తుందని ముందే ఓటమిని అంగీకరించిన ఆ పెద్ద మనిషి.. మమ్మల్ని సన్నాసులనడం అనైతికం’ అని పొన్నాల వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఈ మధ్య పదేపదే కేవీపీ జపం చేస్తూ తనపై అవినీతి ఆరోపణలు చేయడం అలవాటుగా పెట్టుకున్నాడన్నారు. తొమ్మిదేళ్లు టీడీపీ ప్రభుత్వంలో భాగస్వామిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరిని పక్కనపెట్టుకుని తనపై ఆరోపణలు చేస్తే ప్రజలెవరూ నమ్మబోరని చెప్పారు. తనకు అన్ని స్థాయిల్లో క్లీన్చిట్ లభించిందని, జలయజ్ఞం పనులను వేగవంతం చేసేందుకు సంస్కరణలు తెచ్చింది తామేనని పేర్కొన్నారు. ఇక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా హామీనిచ్చిన నేపథ్యంలో దీనిపై పొన్నాల స్పందించారు. ఇప్పటికీ ఎలాంటి అనుమతుల్లేని ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం కష్టమేనని వ్యాఖ్యానించారు. ‘పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నందునే కేంద్రం జాతీయ హోదా కల్పించింది. ప్రాణహిత-చేవెళ్లకు ఎలాంటి అనుమతులు లేవు. కాబట్టి ఇప్పుడు జాతీయ హోదా కల్పించడం సాధ్యం కాదు. ఆ ప్రాజెక్టుకు ముందు అన్ని అనుమతులు రావాలి. ఆ తర్వాత జాతీయ హోదా కల్పించే అంశాన్ని ఆలోచిస్తాం’ అని పేర్కొన్నారు. ఇక కరీంనగర్లో సోనియా సభ ఫెయిలైందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను పొన్నాల తోసిపుచ్చారు. ఆ సభ కనీవినీ ఎరుగని రీతిలో జరిగిందని, గతంలో ఎన్నడూ రానంత పెద్ద సంఖ్యలో జనం వచ్చారని పేర్కొన్నారు. డీసీసీ ఇన్‌చార్జ్‌ల నియామకం ఈసారి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల స్థానంలో కొత్త వారిని ఇన్‌చార్జీలుగా నియమించినట్లు పొన్నాల వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డిని, వరంగల్ జిల్లాకు నాయిని రాజేందర్‌రెడ్డిలను నియమించినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో పార్టీని నడిపేందుకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. -
ఉద్యమకారులెవరో తేల్చుకుందాం?
పొన్నాలా వస్తావా..?: కేటీఆర్ సవాల్ హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులెవరో పొన్నాల సొంత గ్రామంలోనే తేల్చుకుందామని టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే కె.తారక రామారావు సవాల్ చేశారు. బుధవారం పార్టీ నేతలు బొంతు రామ్మోహన్, సామల వెంకటరెడ్డి, పి.ఎల్.శ్రీనివాస్‌తో కలిసి హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు అమెరికాకు పారిపోయిన పొన్నాల లక్ష్మయ్య వంటివారు కేసీఆర్‌పై, టీఆర్ఎస్పై విమర్శలు చేయడమేమిటని మండిపడ్డారు.‘‘ కేసీఆర్‌ను ఉద్యమ ద్రోహి అంటూ విమర్శించిన పొన్నాల లక్ష్మయ్యా నీ సొంత గ్రామం ఖిలాషాపూర్‌లోనే దీనిపై తేల్చుకుందాం.. సిద్ధమేనా?’’ అని పొన్నాలకు కేటీఆర్ సవాల్ చేశారు. ‘‘2004లో తెలంగాణ ఏర్పాటుచేస్తామని హామీనిచ్చిన సోనియాగాంధీ 10 ఏళ్ల పాటు జాప్యం ఎందుకు చేశారో సమాధానం చెప్పాలి. నష్టపోయి, పోరాడి, గోసపడిన తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా.. ఆంధ్రాకు ఇస్తే టీ పీసీసీ నేతలు ఏం చేస్తున్నారు. తెలంగాణలోని ఏడు గిరిజన మండలాలను ముంచుతున్న పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదాను రద్దుచేయించి, ప్రాణహితకు జాతీయ హోదాను తీసుకువచ్చే సత్తా పొన్నాలకు ఉందా? పోలవరం డిజైను మారుస్తానంటూ సోనియాగాంధీతో చెప్పించగలరా?’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని, ఇవ్వాల్సి వచ్చిన రాజకీయ అనివార్యత సోనియాగాంధీకి వచ్చిందని చెప్పారు. తెలంగాణకోసం త్యాగాలు చేసిన కేసీఆర్‌ను, టీఆర్ఎస్ను తిడితే సహించేది లేదని, ఇటుకలతో వస్తే రాళ్లతో సమాధానం చెబుతా (ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేయింగే)మని కేటీఆర్ హెచ్చరించారు. పవన్ కల్యాణ్ తన జనసేన పేరును మోడీ భజనసేనగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. -
అహంకారి.. పచ్చి అవకాశవాది
కేసీఆర్‌పై టీ-పీసీసీ అధ్యక్షుడు ‘పొన్నాల’ ధ్వజం కరీంనగర్ , టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఓ పిల్లకాకి.. అహంకారి, పచ్చి అవకాశవాది..తెలంగాణ ద్రోహి అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. రాజకీయ పార్టీగా మారి 35రోజులు కూడా కాని పిల్లకాకి నుంచి 125 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న మేం మేనిఫెస్టోను కాపీకొట్టడమా? అంటూ మండిపడ్డారు. కరీంనగర్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. కేసీఆర్ తీరుపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి పదవి దక్కడం లేదనే నిరాశ నిస్పృహలతోనే అహంకారిగా మారాడని ఆరోపిం చారు. సకలజనుల సమ్మె, మిలియన్ మార్చ్ లాంటి మహోద్యమాలు జరిగినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు.. ఫాంహౌస్‌లో పడుకున్నాడా అని ప్రశ్నించారు. ‘ఒక్క టమాటా మొక్కకు 300 కిలోల టమాటాలు కాస్తాయట.. ఎకరా పంటకు రూ.కోటి సంపాదించొచ్చట.. ఈ డబ్బులన్నీ హెలిక్యాప్టర్లకు ఖర్చు పెడుతున్నావా...’ అంటూ ఎద్దేవా చేశారు. -
రేణుకా చౌదరి, బలరాం నాయక్ వర్గీయుల ఘర్షణ
హైదరాబాద్: కాంగ్రెస్ సీట్ల కేటాయింపు విషయమై రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, కేంద్ర మంత్రి బలరాం నాయక్ వర్గీయుల మధ్య గొడవ జరిగింది. రేణుకా చౌదరి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. అదే సమయంలో టికెట్ వస్తుందని ఆశించి, రాని వారు కూడా పొన్నాల నివాసం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలిత, మరికొందరు మహిళా నేతలు కూడా వచ్చారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలైన తనకే టికెట్ ఇవ్వలేదని లలిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్ర వెనుక రాష్ట్ర నేతలు ఉన్నారని ఆమె ఆరోపించారు. పొన్నాల వెంటనే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఆ తరువాత బాన్సువాడ నుంచి పోటీ చేయమని ఆయన లలితను కోరారు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. తాను నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. ఆ టికెట్‌ను తనకు కాకుండా మరో నేతకు కేటాయించడం బాధాకరం అన్నారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరి, బలరాం నాయక్ వర్గీయుల గొడవపడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు గల్లంతు కావడానికి బలరాం నాయక్ కారణమంటూ రేణుక వర్గీయుల ఘర్షణకు దిగారు. -
13న రాహుల్ పర్యటన ఖరారు
తెలంగాణలో భారీ సభ, రోడ్‌షోలు! హైదరాబాద్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. ఈ నెల 13న ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో పొన్నాల టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రులు కె.జానారెడ్డి, శ్రీధర్‌బాబు, షబ్బీర్అలీలతో సమావేశమై రాహుల్ షెడ్యూల్‌ను ఖరారు చేసే పనిలో పడ్డారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈనెల 16న సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్ మైదానంలో నిర్వహించబోయే బహిరంగ సభలో పాల్గొననున్న నేపథ్యంలో రాహుల్‌గాంధీ అధ్యక్షతన ఏయే జిల్లాల్లో సభలు, రోడ్‌షోలు నిర్వహిస్తే బాగుంటుందనే అంశంపై చర్చిస్తున్నారు. ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండింటిని ఎంపిక చేసి భారీ బహిరంగ సభలు నిర్వహించే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. అదే విధంగా రాహుల్‌గాంధీతో రోడ్‌షో నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. -
దొరల తెలంగాణను అడ్డుకుంటాం
చంద్రబాబు, పొన్నాల వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం.. ఎంఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బీసీ నేతనే చేస్తామన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, సామాజిక తెలంగాణ కోసం పాటుపడతామన్న టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్పీ) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. హన్మకొండ న్యూశాయంపేటలోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడితే మొదటి ముఖ్యమంత్రిగా దళితుడినే చేస్తానన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తుతం ఆ అంశంపై ఎందుకు మాట్లాడడం లేదో అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్ సీఎం కుర్చీలో కూర్చునేందుకు ఇప్పుడు ఈ అంశంపై మాట్లాడడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఇక తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యమంటున్న టీఆర్ఎస్ నేత వ్యాఖ్యలు సరికావని మంద కృష్ణ అన్నారు. అలాగే, కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మళ్లీ గడీల తెలంగాణ వస్తుందన్న మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యల్లో వాస్తవం ఉందన్నారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఎవరిని సీఎంగా చేసినా తన మద్దతు ఉంటుందని తెలిపారు. అలాకాకుండా అగ్రవర్ణాలను సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని చూస్తే నిరసనలు తీవ్రంగా ఉంటాయని, దొరల తెలంగాణను అడ్డుకోవడానికి ఏ వ్యక్తితోనైనా, ఏ శక్తితోనైనా చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నామని మంద కృష్ణ స్పష్టం చేశారు. ‘సింహగర్జన’కు ముందే స్పష్టం చేయాలి ఈనెల 25వ తేదీన హన్మకొండలో ఎంఎస్పీ ఆధ్వర్యం లో నిర్వహించనున్న సింహగర్జన సభకు ముందే టీఆర్ ఎస్ అధిష్టానం సీఎం అభ్యర్థిత్వంపై స్పష్టత ఇవ్వాలని మంద కృష్ణ సూచించారు. లేనిపక్షంలో తాము చేపట్టే నిరసనల రూపాన్ని సభా వేదికపై ప్రకటిస్తామని తెలి పారు. దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు దానిపై మాట్లాడకపోవడాన్ని ఆ పార్టీలోని ఎస్సీ నాయకులు గుర్తించాలని సూచించారు. సమావేశంలో ఎంఎస్పీ జాతీయ అధికార ప్రతినిధి మహ్మద్ రి యాజ్‌తో పాటు నాయకులు తీగల ప్రదీప్, సూరి, రాం బాబు, లక్కిరెడ్డి సత్యం, మంద కుమార్ పాల్గొన్నారు. మంద కృష్ణను పరామర్శించిన కృష్ణయ్య హన్మకొండ చౌర స్తా : ఎంఎస్పీ వ్య వస్థాపక అధ్యక్షు డు మంద కృష్ణ మాదిగను బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య సోమవారం పరామర్శించారు. మంద కృష్ణ తల్లి ఇటీవల మృతి చెందిన విష యం విదితమే. ఈ మేరకు హన్మకొండ న్యూశాయంపేటలోని ఆయన స్వగృహంలో కృష్ణయ్య పరామర్శించారు. -
పశ్చిమాన...పరేషాన్!
పొన్నాలకు పరీక్షగా మారిన సెగ్మెంట్ ఆశావహులు ఆరుగురూ సన్నిహితులే... క్యూలో జంగా రాఘవరెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ, నాయిని రాజేందర్ రెడ్డి, కొండపల్లి దయాసాగర్, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఘంటా నరేందర్‌రెడ్డి 1999 నుంచి ఇక్కడ మొండి‘చేయి’ సాక్షి ప్రతినిధి, వరంగల్ : సాధారణ ఎన్నికల వేళ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం... టీపీసీసీ చీఫ్ పొన్నాలకు పరీక్షగా మారింది. కాంగ్రెస్‌తో పొత్తు లేదని టీఆర్ఎస్ తేల్చిచెప్పడంతో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ‘హస్తం’ అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తుతున్నారుు. టికెట్ కోసం చేతులు చాపుతున్న వారి సంఖ్య అమాంతంగా పెరిగింది. దశాబ్దకాలంగా జిల్లాలో కీలక నేతగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ పీసీసీ పీఠాన్ని అధిరోహించడంతో... ఆయనకు సన్నిహితంగా ఉన్న నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. పొన్నాల సన్నిహితులు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నప్పటికీ... సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో టికెట్ల విషయంలో ఆయనపై పెద్దగా ఒత్తిళ్లు లేవు. కానీ... వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న ప్రతి ఒక్కరూ ఆయనతో సాన్నిహిత్యంగా ఉండేవారే. ఇదే పొన్నాలకు తల నొప్పి తెచ్చిపెట్టింది. కాంగ్రెస్‌లో క్రియాశీల కంగా ఉన్న ముఖ్య నేతలు జంగా రాఘవరెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ, నాయిని రాజేందర్‌రెడ్డి, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఘంటా నరేందర్‌రెడ్డి, కొండపల్లి దయాసాగర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. ‘తెలంగాణ ప్రజల సుదీర్ఘ ఆకాంక్ష నెరవేర్చాం. మా దగ్గరి నేత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. వరంగల్ పశ్చిమ టికెట్ కచ్చితంగా నాకే. మా పార్టీకి ఉన్న సానుకూలతతో విజయం సాధిస్తాం’... ఎవరికి వారు ఇలాగే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ కోసం పోటీలో ఉన్న ఆరుగురిలో ఎన్నికలో బరిలో ఉండేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది. డీసీసీ జాబితానా.. పీసీసీ జాబితానా... సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నాయకుల పేర్లతో జాబితా ఇవ్వాలనే పీసీసీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి ఇటీవల జాబితా అందజేశారు. వరంగల్ పశ్చిమ సెగ్మెంట్‌కు సంబంధించి గ్రంథాలయ కమిటీ జిల్లా చైర్మన్ నాయిని రాజేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేర్లు జాబితాలో ఉన్నాయి. అధిష్టానం వీటినే పరిశీలనలోకి తీసుకుంటుందా... పీసీసీ ఇచ్చే ప్రతిపాదనలు పరిశీలిస్తుందా... అనేది టికెట్ ఖరారుతో తేలనుంది. 1999 నుంచి మొండి‘చేయే’ వరంగల్ పశ్చిమ(హన్మకొండ) నియోజకవర్గానికి గతంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు ప్రాతిని థ్యం వహించారు. 1999 నుంచి కాంగ్రెస్‌కు ఇక్కడ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 1999 లో బీజేపీ, 2004లో కాంగ్రెస్ పొత్తుతో టీఆర్ఎస్ దక్కించుకుంది. 2009లో కాంగ్రెస్ పోటీ చేసినా... విజయం దక్కలేదు. టీఆర్ఎస్ అభ్యర్థి వినయ్‌భాస్కర్ గెలిచారు. 2010 ఉప ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి. 2009లో అనూహ్యంగా ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని పోటీ చేసిన కొండపల్లి దయాసాగర్... మళ్లీ పోటీ చేసే ఉద్దేశంతోనే ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే దయాసాగర్‌కు టికెట్ కేటాయిస్తే పార్టీకి నష్టమేనని, ఇది అంతిమంగా పొన్నాలకు ఇబ్బందులు కలిగిస్తుందని పలువురు నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2009, 2010 ఎన్నికల్లో వరుసగా ఓడిపోవడం ఆయనకు ప్రతికూలతలుగా వీరు చెబుతున్నారు. జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ గంటా నరేందర్‌రెడ్డి, డీసీసీ జిల్లా అధికార ప్రతినిధి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ‘పశ్చిమ’ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నా రు. గంటా నరేందర్‌రెడ్డి సైతం పొన్నాలనే నమ్ముకున్నారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ) చైర్మన్ జంగా రాఘవరెడ్డి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎన్నికల్లో తనకు టికెట్ కావాలని పొన్నాలతోపాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌ను కలిశారు. డీసీసీబీ ఎన్నికలతో జంగా రాఘవరెడ్డి... పొన్నాలకు దగ్గరయ్యారు. ప్రస్తుతం జిల్లా స్థాయిలో కీలకమైన పదవిలో ఉన్న జంగా రాఘవరెడ్డికి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందా.. అని టికెట్ ఆశించే మిగిలిన నాయకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ... వరంగల్ పశ్చిమ నుంచి పోటీ చేసేందుకు ఏర్పా ట్లు చేసుకుంటున్నారు. టికెట్‌కు సంబంధించి పూర్తిగా పొన్నాలనే నమ్ముకున్నారు. స్వర్ణ భర్త ఎర్రబెల్లి వరద రాజేశ్వరరావు సుదీర్ఘకాలంగా పొన్నాలకు సన్నిహితుడు. వ్యక్తిగతంగాను వీరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. మిగిలిన నేతలు కొన్ని సందర్భాల్లో పొన్నాల లక్ష్మయ్యకు దూరంగా ఉండడం, కొత్తగా దగ్గరవడం జరిగింది కానీ... వరద రాజేశ్వరరావు పదవులతో నిమిత్తం లేకుండా పొన్నాలకు దగ్గరగా ఉన్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. గ్రంథాయల సంస్థ జిల్లా చైర్మన్ నాయిని రాజేందర్‌రెడ్డి టికెట్ విషయంలో ధీమాగా ఉన్నారు. పొన్నాలకు సన్నిహితుడిగా ఉండడం, యువకుల కోటాలో తనకు సీటు వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. ఐదేళ్లుగా నియోజకవర్గంపై దృష్టి పెట్టి కార్యక్రమాలు చేస్తున్నానని... పార్టీ అన్నీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని, పొన్నాల తనకు మద్దతు ఇస్తారని భావిస్తున్నారు. -
పొన్నాలకు తెలంగాణ పీసీసీ పదవి!
న్యూఢిల్లీ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) తొలి అధ్యక్షుడిగా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ పీసీసీ (టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్‌గా దామోదర రాజ నర్సింహ, ప్రచార కమిటీ కో ఛైర్మన్‌గా షబ్బీర్ అలీ, మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా శ్రీధర్‌బాబు, మ్యానిఫెస్టో కమిటీ కో ఛైర్మన్‌గా భట్టి విక్రమార్కలను కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం సుమారు డజను మంది పేర్లను పరిశీలించింది. డీఎస్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర మాజీ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. దళితుడైన దామోదర రాజనర్సింహ పేరు కూడా పరిశీలనకు వచ్చింది. చివరికి సీనియారిటీ, సామాజిక నేపథ్యం, సమన్వయం చేయగల సామర్ధ్యం నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్య పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
పొన్నాల...పువ్వులు
మాటల మంత్రి లక్ష్మయ్య వెక్కిరిస్తున్న సమ్మక్క వెబ్సైట్ ఆవిష్కరించినా ఓపెన్ కాని పోర్టల్ అదే తీరుగా మడికొండ ఐటీ పార్కు చెప్పుడెక్కువ... చేసుడు తక్కువ... నానుడి రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు చక్కగా సరిపోతుంది. ఏదో చేసినట్లుగా ప్రకటించుకోవడం... తీరా అది తుస్సుమనడం ఆయన విషయంలో తరచుగా జరగడమే ఇందుకు నిదర్శనం. మేడారం మహా జాతరపై మంత్రి పొన్నాల ఆవిష్కరించిన వెబ్సైట్ ఒక్కరోజు కూడా పనిచేయకపోవడం.. ఆయన శైలిని మరోసారి తేటతెల్లం చేసింది. సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా పేరొందిన మేడారం జాతరకు ముందు రోజున (ఫిబ్రవరి 11) రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హైదరాబాద్‌లో సమ్మక్క-సారలమ్మ వెబ్‌సైట్‌ను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. www.sammakkasarakka.co.in పేరు తో రూపొందించిన ఈ వెబ్సైట్ (పోర్టల్) ను అధికారికంగా ప్రారంభించినట్లు ప్రకటిం చారు. సమ్మక్క-సారలమ్మ తల్లుల విశిష్టతను తెలిపే అంశాలు, ప్రభుత్వపరంగా జాతర నిర్వహణ ఏర్పాట్లు, వనదేవతలను దర్శనార్థం వచ్చే వారికి అవసరమైన సమాచారం, గూగుల్ రూట్ మ్యాప్‌లు, అత్యవసర ఫోన్ నంబర్లను ఈ పోర్టల్‌లో పొందుపరిచినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ, విదేశాల నుంచి జాతరకు వచ్చే భక్తులకు అవసరమైన సమస్త సమాచారాం ఇందులో ఉందని ఢంకా భజాయించారు. కానీ... అది అందుబాటులోకి రాకుండానే తుస్సుమంది. అవాక్కైన భక్తులు మేడారం జాతర విశేషాలు, జాతర విధుల్లో ఉన్న అధికారులు, రూట్‌మ్యాప్ తదితర అంశాలతో ప్రభుత్వ వెబ్సైట్ అందుబాటులోకి తెచ్చిందనే వార్త విని భక్తులు సంతోషించారు. ఫిబ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు జరిగిన మేడారం జాతరకు కోటి మంది భక్తులు వచ్చారని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఇంత మంది వచ్చిన జాతరపై ఏర్పాటు చేసిన వెబ్సైట్ కావడంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండడం, స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడంతో లక్షలాది మంది దీన్ని ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. మేడారం జాతరపై కొత్త అంశాలు ఉండవచ్చని ఆశించారు. కానీ.. వారి ఆశలు అడియూసలయ్యూరుు. మంత్రి పొన్నాల వెబ్సైట్ తుస్సుమంది. అసలు విషయం ఏమీ కనిపించలేదు. ఒకరోజు కాకపోతే మరుసటి రోజైనా పోర్టల్ అందుబాటులోకి రాకపోతుందా అని వేచి చూశారు. జాతర జరిగిన నాలుగు రోజులతోపాటు ఇప్పటివరకూ వెబ్సైట్ ఓపెన్ కాలేదు. పైగా పొన్నాల ఇచ్చిన అడ్రస్‌తో ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఈ సైట్ అసలు ప్రారంభం కాలేదని, పైగా ఇది అమ్మకానికి ఉందని అందులో పేర్కొన్నారు. మంత్రి ఆవిష్కరించిన వెబ్సైట్ కావడంతో మేడారం జాతర సమాచారం తెలుస్తుందనుకుంటే... అసలు ఓపెన్ కూడా కాకపోవడం చాలా మందిని నిరుత్సాహ పరిచింది ఎవరో రూపొందించిన వెబ్‌సైట్‌ను మంత్రి ఆవిష్కరించడం... అది బాగుంటందని చెప్పుకోవడం... తీరా అందులో విషయం లేకపోవడంతో ఐటీ మంత్రిగా పొన్నాల లక్ష్మయ్యకు ఏమీ చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది. ఆది నుంచి అంతే... తెలంగాణలో రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్‌లో ఐటీ రంగం పురోగతికి పొన్నాల లక్ష్మయ్య ఏమీ చేయలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మడికొండలో 33 ఎకరాల్లో ఆయన ఆర్భాటంగా ఐటీ పార్కును ప్రారంభించారు. మార్కెట్ పరంగా సామర్థ్యం ఉన్నా...ఈ ప్రాజెక్ట్ వైపు కంపెనీలు కనీసం కన్నెత్తి కూడా చూడ లేదు. ఐటీ కంపెనీలను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉండే ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు ఇంకా మూలుగుతూనే ఉంది.