మా వాళ్లను టీఆర్‌ఎస్ ప్రలోభపెడుతోంది
టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను, కౌన్సిలర్లను, కార్పొరేటర్లను అధికార టీఆర్‌ఎస్ పార్టీ ప్రలోభాలకు గురి చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. హంగ్ ఏర్పడిన చోట.. కాంగ్రెస్ తరఫున గెలిచిన వారికి రకరకాల ఆశలు చూపుతూ... తమవైపు తిప్పుకుంటున్నారని ఆరోపించారు. పొన్నాల సొంత జిల్లా వరంగల్‌లో పలువురు కాంగ్రెస్ కార్పొరేటర్లు శనివారం టీఆర్‌ఎస్‌లో చేరిన నేపథ్యంలో పొన్నాల తీవ్రంగా స్పందించారు. తల్లిలాంటి కాంగ్రెస్‌కు ప్రజాప్రతినిధులు ద్రోహం చేయవద్దని హితవు పలికారు. ఎవరైనా పార్టీ ఫిరాయిస్తే కఠిన చర్యలు తప్పవని, పదవులు కోల్పోతారని హెచ్చరించారు.