అహంకారి.. పచ్చి అవకాశవాది | Vanity by .. raw opportunist | Sakshi
Sakshi News home page

అహంకారి.. పచ్చి అవకాశవాది

Published Mon, Apr 14 2014 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 5:59 AM

అహంకారి.. పచ్చి అవకాశవాది

అహంకారి.. పచ్చి అవకాశవాది

కేసీఆర్‌పై టీ-పీసీసీ అధ్యక్షుడు ‘పొన్నాల’ ధ్వజం

కరీంనగర్ ,  టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఓ పిల్లకాకి.. అహంకారి, పచ్చి అవకాశవాది..తెలంగాణ ద్రోహి అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. రాజకీయ పార్టీగా మారి 35రోజులు కూడా కాని పిల్లకాకి నుంచి 125 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న మేం మేనిఫెస్టోను కాపీకొట్టడమా? అంటూ మండిపడ్డారు. కరీంనగర్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. కేసీఆర్ తీరుపై నిప్పులు చెరిగారు.

ముఖ్యమంత్రి పదవి దక్కడం లేదనే నిరాశ నిస్పృహలతోనే అహంకారిగా మారాడని ఆరోపిం చారు. సకలజనుల సమ్మె, మిలియన్ మార్చ్ లాంటి మహోద్యమాలు జరిగినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు.. ఫాంహౌస్‌లో పడుకున్నాడా అని ప్రశ్నించారు. ‘ఒక్క టమాటా మొక్కకు 300 కిలోల టమాటాలు కాస్తాయట.. ఎకరా పంటకు రూ.కోటి సంపాదించొచ్చట.. ఈ డబ్బులన్నీ హెలిక్యాప్టర్లకు ఖర్చు పెడుతున్నావా...’ అంటూ ఎద్దేవా చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement