చేరితే వాళ్ల గొప్ప.. వీడితే నా తప్పా? | ponnala fire her party leaders | Sakshi
Sakshi News home page

చేరితే వాళ్ల గొప్ప.. వీడితే నా తప్పా?

Published Sat, Jun 28 2014 1:34 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

చేరితే వాళ్ల గొప్ప.. వీడితే నా తప్పా? - Sakshi

చేరితే వాళ్ల గొప్ప.. వీడితే నా తప్పా?

నాయకత్వ లోపముందన్న సీఎల్పీ వ్యాఖ్యలపై పొన్నాల రుసరుస

హైదరాబాద్: ఎన్నికల్లో ఓటమికి నాయకత్వ లోపమే కారణమంటూ వస్తున్న ఆరోపణలను టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తప్పుబట్టారు. ‘కొందరు నాయకత్వ లోపంవల్లే నష్టం జరిగిందంటున్నారు. ఆ విషయాన్ని ఆ నాయకుల విజ్ఞతకే వదిలేస్తున్నా. అయినా ఎవరైనా కాంగ్రెస్‌లో చేరితే  అది వారి గొప్పతనం.. పార్టీని వీడితే మాత్రం నా లోపమవుతుందా? అయినా టీపీసీసీ అధ్యక్షుడిగా నన్ను ఎంపిక చేయడమన్నది నా చేతుల్లోని విషయం కాదు. అది హైకమాండ్‌కు సంబంధించిన వ్యవహారం కదా!’ అని పొన్నాల శుక్రవారం గాంధీభవన్‌లో మీడియాతో వ్యాఖ్యానించారు. 

నాయకత్వ లోపం వల్లే రాష్ట్రంలో పార్టీ నష్టపోయిందంటూ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పొన్నాల ఈ విధంగా స్పందించారు. టీపీసీసీ తరఫున త్వరలో ‘బంగారు తెలంగాణ’ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించబోతున్నామని వెల్లడించారు. ఇకపై ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలతోపాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో జరుగుతున్న తప్పిదాలపై తెలంగాణ ప్రజలు ఈ వేదిక ద్వారా అభిప్రాయాలు పంచుకోవచ్చు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement