నల్లగొండ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తొలి విడతలో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో నాగార్జునసాగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకుడు జానారెడ్డి తనయుడు జైవీర్‌రెడ్డి టికెట్ దక్కింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి నోముల భగత్ పోటీ చేస్తుండగా ఈ సారి అందరి చూపు నాగార్జునసాగర్ వైపే మళ్లింది. జానారెడ్డి మొదటిసారి ఎన్నికలకు దూరం కావడం విశేషం. ఇద్దరు యువ నాయకులకు యూత్ పాలోంగ్ ఉన్న నేపథ్యంలో పోరు రసవత్తరంగా మారనుంది.
జానారెడ్డి చిన్న కుమారుడు జైవీర్ రెడ్డి గిరిజన చైతన్య యాత్ర పేరుతో జనాల్లోకి వెళ్లారు. పెద్దవూర మండలం గేమ్యా నాయక్ తండా నుంచి పాదయాత్రను మొదలు పెట్టిన జైవీర్రెడ్డి.. తనతండ్రి జానారెడ్డి హయాంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయ చదరంగంలో నడయాడిన జానారెడ్డి.. తనయుని విజయం కోసం వెనక నుంచి పాటుపడనున్నారు. అయితే.. తన రాజకీయ వారసత్వాన్ని కాపాడుకోవడంలో ఎంత వరకు సఫలమవుతారో చూడాలి మరి..!
Comments
Please login to add a commentAdd a comment