పశ్చిమాన...పరేషాన్! | Ponnalaku turned test segment | Sakshi
Sakshi News home page

పశ్చిమాన...పరేషాన్!

Published Tue, Mar 18 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM

పశ్చిమాన...పరేషాన్!

పశ్చిమాన...పరేషాన్!

  • పొన్నాలకు పరీక్షగా మారిన సెగ్మెంట్    
  •  ఆశావహులు ఆరుగురూ సన్నిహితులే...
  •  క్యూలో జంగా రాఘవరెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ, నాయిని రాజేందర్ రెడ్డి, కొండపల్లి దయాసాగర్, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఘంటా నరేందర్‌రెడ్డి
  •  1999 నుంచి ఇక్కడ మొండి‘చేయి’
  •  సాక్షి ప్రతినిధి, వరంగల్ : సాధారణ ఎన్నికల వేళ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం... టీపీసీసీ చీఫ్ పొన్నాలకు పరీక్షగా మారింది. కాంగ్రెస్‌తో పొత్తు లేదని టీఆర్‌ఎస్ తేల్చిచెప్పడంతో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ‘హస్తం’ అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తుతున్నారుు. టికెట్ కోసం చేతులు చాపుతున్న వారి సంఖ్య అమాంతంగా పెరిగింది. దశాబ్దకాలంగా జిల్లాలో కీలక నేతగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ పీసీసీ పీఠాన్ని అధిరోహించడంతో... ఆయనకు సన్నిహితంగా ఉన్న నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు.

    పొన్నాల సన్నిహితులు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నప్పటికీ... సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో టికెట్ల విషయంలో ఆయనపై పెద్దగా ఒత్తిళ్లు లేవు. కానీ... వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న ప్రతి ఒక్కరూ ఆయనతో సాన్నిహిత్యంగా ఉండేవారే. ఇదే పొన్నాలకు తల నొప్పి తెచ్చిపెట్టింది.

    కాంగ్రెస్‌లో క్రియాశీల కంగా ఉన్న ముఖ్య నేతలు జంగా రాఘవరెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ, నాయిని రాజేందర్‌రెడ్డి, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఘంటా నరేందర్‌రెడ్డి, కొండపల్లి దయాసాగర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. ‘తెలంగాణ ప్రజల సుదీర్ఘ ఆకాంక్ష నెరవేర్చాం. మా దగ్గరి నేత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. వరంగల్ పశ్చిమ టికెట్ కచ్చితంగా నాకే. మా పార్టీకి ఉన్న సానుకూలతతో విజయం సాధిస్తాం’... ఎవరికి వారు ఇలాగే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ కోసం పోటీలో ఉన్న ఆరుగురిలో ఎన్నికలో బరిలో ఉండేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది.
     
    డీసీసీ జాబితానా.. పీసీసీ జాబితానా...
     
    సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నాయకుల పేర్లతో జాబితా ఇవ్వాలనే పీసీసీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి ఇటీవల జాబితా అందజేశారు. వరంగల్ పశ్చిమ సెగ్మెంట్‌కు సంబంధించి గ్రంథాలయ కమిటీ జిల్లా చైర్మన్ నాయిని రాజేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేర్లు జాబితాలో ఉన్నాయి. అధిష్టానం వీటినే పరిశీలనలోకి తీసుకుంటుందా... పీసీసీ ఇచ్చే ప్రతిపాదనలు పరిశీలిస్తుందా... అనేది టికెట్ ఖరారుతో తేలనుంది.
     
    1999 నుంచి మొండి‘చేయే’
     వరంగల్ పశ్చిమ(హన్మకొండ) నియోజకవర్గానికి గతంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు ప్రాతిని థ్యం వహించారు. 1999 నుంచి కాంగ్రెస్‌కు ఇక్కడ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 1999 లో బీజేపీ, 2004లో కాంగ్రెస్ పొత్తుతో టీఆర్‌ఎస్ దక్కించుకుంది. 2009లో కాంగ్రెస్ పోటీ చేసినా... విజయం దక్కలేదు. టీఆర్‌ఎస్ అభ్యర్థి వినయ్‌భాస్కర్ గెలిచారు. 2010 ఉప ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి.
     
    2009లో అనూహ్యంగా ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని పోటీ చేసిన కొండపల్లి దయాసాగర్... మళ్లీ పోటీ చేసే ఉద్దేశంతోనే ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే దయాసాగర్‌కు టికెట్ కేటాయిస్తే పార్టీకి నష్టమేనని, ఇది అంతిమంగా పొన్నాలకు ఇబ్బందులు కలిగిస్తుందని పలువురు నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2009, 2010 ఎన్నికల్లో వరుసగా ఓడిపోవడం ఆయనకు ప్రతికూలతలుగా వీరు చెబుతున్నారు.
     
     జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ గంటా నరేందర్‌రెడ్డి, డీసీసీ జిల్లా అధికార ప్రతినిధి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ‘పశ్చిమ’ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నా రు. గంటా నరేందర్‌రెడ్డి సైతం పొన్నాలనే నమ్ముకున్నారు.  
     
     జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ) చైర్మన్ జంగా రాఘవరెడ్డి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎన్నికల్లో తనకు టికెట్ కావాలని పొన్నాలతోపాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌ను కలిశారు. డీసీసీబీ ఎన్నికలతో జంగా రాఘవరెడ్డి... పొన్నాలకు దగ్గరయ్యారు. ప్రస్తుతం జిల్లా స్థాయిలో కీలకమైన పదవిలో ఉన్న జంగా రాఘవరెడ్డికి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందా.. అని టికెట్ ఆశించే మిగిలిన నాయకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
     
     మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ... వరంగల్ పశ్చిమ నుంచి పోటీ చేసేందుకు ఏర్పా ట్లు చేసుకుంటున్నారు. టికెట్‌కు సంబంధించి పూర్తిగా పొన్నాలనే నమ్ముకున్నారు. స్వర్ణ భర్త ఎర్రబెల్లి వరద రాజేశ్వరరావు సుదీర్ఘకాలంగా పొన్నాలకు సన్నిహితుడు. వ్యక్తిగతంగాను వీరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. మిగిలిన నేతలు కొన్ని సందర్భాల్లో పొన్నాల లక్ష్మయ్యకు దూరంగా ఉండడం, కొత్తగా దగ్గరవడం జరిగింది కానీ... వరద రాజేశ్వరరావు పదవులతో నిమిత్తం లేకుండా పొన్నాలకు దగ్గరగా ఉన్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు.
     
     గ్రంథాయల సంస్థ జిల్లా చైర్మన్ నాయిని రాజేందర్‌రెడ్డి టికెట్ విషయంలో ధీమాగా ఉన్నారు. పొన్నాలకు సన్నిహితుడిగా ఉండడం, యువకుల కోటాలో తనకు సీటు వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. ఐదేళ్లుగా నియోజకవర్గంపై దృష్టి పెట్టి కార్యక్రమాలు చేస్తున్నానని... పార్టీ అన్నీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని, పొన్నాల తనకు మద్దతు ఇస్తారని భావిస్తున్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement