పొన్నాల వల్లే అపోహలు
ఆయన వ్యవహారశైలే ఊహాగానాలకు కారణం: జానా
ఏదైనా మీడియాకు సూటిగా చెప్పి ఉండాల్సిందని వ్యాఖ్య
న్యూఢిల్లీ: పార్టీలో సమన్వయలోపం వార్తలపై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్య వహారశైలే అపోహలకు, ఊహాగానాలకు కారణమైందని సీఎల్పీ నేత కె.జానారెడ్డి వ్యాఖ్యానిం చారు. సమన్వయలోపంపై విలేకరులు ప్రశ్నిం చినప్పుడు ఆయన సూటిగా సమాధానం చెప్పి ఉంటే పత్రికల్లో అలాంటి కథనాలకు ఆస్కారం ఉండేది కాదని పేర్కొన్నారు. జయశంకర్ జ యంతి సందర్భంగా బుధవారం ఢిల్లీలోని తె లంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘జయశంకర్ చిరస్మరణీయుడు. క్రమశిక్ష ణ, నిబద్ధతతో కూడిన వ్యక్తిత్వం గల ఆయన త న వృత్తికి న్యాయం చేయడమే కాకుండా సామాజిక స్పృహతో అనేక కార్యక్రమాలు చేపట్టారు. సమగ్ర, సామాజిక అభివృద్ధితో కూడిన తెలంగాణ కావాలన్న ఆయన ఆకాంక్షను నెరవేర్చడమే మనం సమర్పించే నిజమైన నివాళి..’ అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ఢిల్లీ పర్యటనపై చాలా ఊహాగానాలు ఉన్నాయని, పీసీసీ చీఫ్ పదవికి పోటీపడుతున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా... ‘పత్రికలు ఏవో కథనా లు రాస్తే వాటికి ఏం సమాధానం చెప్పగలను.’ అన్నారు. డీఎస్, పొన్నాల మీపై అసహనంతో ఉన్నారన్న విష యాన్ని ప్రస్తావించగా... ‘నేను చేసే పనిని హ ర్షించేవారిలో డీఎస్ ఒకరు... ఇక పొన్నాల లక్ష్మయ్యతో అంతకంటే బాగుంది.’ అన్నారు. ‘మా వద్ద సమన్వయ లోపం ఉందని ఆయన అంటే.. నా సమక్షంలో చెప్పాలని, నీకు జరిగిన ఇబ్బంది ఏంటి? అని అడుగుతా.. పార్టీకి నష్టం జరగకుం డా జాగ్రత్త తీసుకోవాలి. ఎవరో వచ్చి మీ వద్ద సమన్వయం లేనట్టుందని ప్రశ్నించినప్పుడు.. గట్టిగా అలాంటిదేమీ లేదని, పార్టీ బలోపేతానికి అందరం కృషిచేస్తున్నామని పొన్నాల సూటిగా చెప్పి ఉండాల్సింది.’ అన్నారు.