ఓటమిపై నివేదికలతో హస్తినకు | Ponnala lakshmaiah report to Delhi on Telangana defeat | Sakshi
Sakshi News home page

ఓటమిపై నివేదికలతో హస్తినకు

Published Thu, May 29 2014 10:26 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ఓటమిపై నివేదికలతో హస్తినకు - Sakshi

ఓటమిపై నివేదికలతో హస్తినకు

న్యూఢిల్లీ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గురువారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ ఓటమిపై ఆయన  పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్లకు సమగ్రంగా నివేదికలు అందచేయనున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి పూర్తి బాధ్యత నాదే.... ఇదే మాటకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నానన్న పొన్నాల మరోవైపు పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామాపై  సందిగ్ధంలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో పొన్నాల  ఢిల్లీ పర్యటన తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. పొన్నాల తక్షణమే టీపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ సొంత పార్టీ నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయి. పొన్నాల రాజీనామాపై ఓవైపు సీనియర్ల నుంచి ఒత్తిళ్లు రావడం, మరోవైపు ఆయన తీరుపై అధిష్టానం గుర్రుగా ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో ఓటమిపై నివేదికలు సమర్పించనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement