జనగామ, న్యూస్‌లైన్ : అకాల వర్షానికి పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించేలా టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య చర్యలు తీసుకోవాలి.. లేకుంటే ఆయన ఇంటిని ముట్టడిస్తామని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హెచ్చరించారు. ఆయన పార్టీ నేతలతో కలిసి శనివారం మండలంలో వర్షానికి నష్టపోయిన పంటలను పరిశీలించి బాధితరైతులను పరామర్శించారు.
మధ్యాహ్నం జనగామ మార్కెట్ యార్డును సందర్శించి నష్టం వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తొర్రూరుకు చెందిన మహిళా రైతు గోనె సోమలక్ష్మి తాను పండించిన 30 బస్తాల్లో 20 బస్తాల వడ్లు వర్షానికి కొట్టుకుపోయాయని విలపించింది. మరో రైతు మాట్లాడుతూ మార్కెట్‌లో దళారులు, హమాలీ లు అప్పనంగా ధాన్యం తీసుకుంటున్నారని, వ్యాపారులు కూడా క్వింటాలుకు రూ.1345 చెల్లించాల్సి ఉండగా రూ.1000 నుంచి 1200ల వరకే ధర పెడుతున్నారని వాపోయింది.
పొన్నాల లక్ష్మయ్యకు పంటనష్టం వివరాలను తెలిపేందుకు ఎన్ని మార్లు ఫోన్ చేసినా కలువడం లేదని.. ఆయనకు రైతులపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్ కార్యదర్శి గంగుతో ముత్తిరెడ్డి మాట్లాడుతూ మార్కెట్‌లో అక్రమాలను అరికట్టాలని చెప్పారు.
పొన్నాల ఇంటిని ముట్టడిస్తాం
Published Sun, May 4 2014 3:37 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 AM
Advertisement