టీఆర్ఎస్ నేత ఆస్తులురూ.45 కోట్లు
ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ముత్తిరెడ్డికే ఎక్కువ ఆస్తులు
రెండో స్థానంలో కొమ్మూరి
మూడో స్థానంలో పొన్నాల
జనగామ, న్యూస్‌లైన్ జనగామ టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి రూ.45 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల అధికారులకు అంద జేసిన అఫిడవిట్ల ప్రకారం చూస్తే.. యాదగిరిరెడ్డి ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారు. ఆ తర్వాత రెండో స్థానంలో జనగామ నుంచే బీజేపీ నుంచి పోటీ చేస్తున్న కొమ్మూరి ప్రతాపరెడ్డి (రూ.26 కోట్లు), మూడో స్థానంలో టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య (రూ.21 కోట్లు) ఉన్నారు.
యాదగిరిరెడ్డి ఆస్తుల విలువ మొత్తం రూ.45,17,25,778. వీటిలో చరాస్తుల విలువ రూ.5,09,40,524 కాగా.. స్థిరాస్తుల విలువ రూ.40,07,85,254.
నగదు : ముత్తిరెడ్డి వద్ద రూ.2.45 లక్షలు, ఆయన సతీమణి పద్మలతారెడ్డి వద్ద రూ.1.30లక్షలు. బంగారం : ముత్తిరెడ్డి వద్ద 110 గ్రాములు, ఆయన సతీమణి వద్ద 800 గ్రాములు.
భూములు, భవనాలు : ఘట్కేసర్ మండలం చెంగిచెర్ల వద్ద 22.28 గుంటల భూమి, జనగామ మండలం ఎల్లంలలో 29.28 గుంటల భూమి ఉంది. హబ్సిగూడలో కమర్షియల్ భవనాలు ఉన్నాయి.ఉప్పల్ మండలం నాచారం మల్లాపూర్, నోమా కల్యాణ వేదికతో పాటు వివిధ చోట్ల నివాస గృహాలున్నాయి.
పరకాల
ఇనుగాల వెంకట్రాంరెడ్డి (కాంగ్రెస్)
పరకాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన ఇనుగాల వెంకట్రాంరెడ్డి చేతిలో రూ.10వేల నగదు ఉండగా, ఐసీఐసీఐ బేగంపేట బ్యాంకులో రూ. 2,90,860, ఇదే బ్యాంకు మరో అకౌంట్లో రూ.34,346. హెచ్డీఎఫ్సీ బంజారాహిల్స్ బ్రాంచిలో రూ.40, వేలు, ఎస్బీఐ కంఠాత్మకూరులో రూ.5వేలు ఉన్నాయి.
ఇన్లైన్ మోటార్స్‌లో షేర్ల రూపంలో రూ.67, 50లక్షలు, కాకతీయ కల్టివేటర్స్లో రూ.50 వేలు, మ్యూచ్‌వల్ ఫండ్స్ రూ.2,18,301 ఉండగా త్రిభువని ఫార్మ, గణధీశ, సుటిధ్ర ఎస్టేట్‌లో షేర్లు ఉన్నాయి.
రూ.14,23,157 విలువైన పాలసీలు ఉండగా, రూ.8 లక్షల విలువైలన టాటా వింగర్, రూ.6లక్షల విలువైన మారుతి గిస్సీ, రూ.4,50లక్షల విలువైన మారుతి ఎస్ట్రీమ్, రూ.5లక్షల విలువైన టయోటా క్వాలిస్, రూ.5లక్షల విలువైన అంబాసిడర్, రూ.18లక్షల ఇన్నోవా, రూ.24.50లక్షల జేసీబీ వాహనాలు ఉన్నాయి.
రూ.79,943 విలువైన 30 గ్రాముల బంగారంతో పాటు మహబూబ్‌నగర్‌లో వ్యవసాయ భూమి, వరంగల్ జిల్లా ఆత్మకూరు, హైదరాబాద్ సోమాజీగూడ, అశోక్‌నగర్, ముంబైలో మార్కెట్ విలువ ప్రకారం రూ.66,74,125 భవనాలు ఉన్నాయి.
వాహనాలు, షేర్ల కొనుగోలుకు బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నట్లు చూపించారు.
వెంకట్రాంరెడ్డి భార్య జ్యోతి చేతిలో రూ.10వేల నగదు ఉండగా... రూ.33,49,855 విలువైన నివాస స్థలాలు, వాహనాలు, బంగారం ఉన్నాయి.
జనగామ
పొన్నాల లక్ష్మయ్య (కాంగ్రెస్)
జనగామ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పొన్నాల లక్ష్మయ్య తన అఫిడవిట్లో ఆస్తుల వివరాలను రూ.21,24,28,675గా చూపారు.
చరాస్తులు రూ.1,08,10,497 ఉన్నాయి. సతీమణి అరుణాదేవి పేరిట రూ.1,28,52,178 ఉంది.
పొన్నాల పేరిట చరాస్తులు రూ.4,81,00,000 ఉండగా.. అరుణాదేవి పేరిట రూ.14,06,66,000.
పొన్నాల వద్ద నగదు మొత్తంగా రూ.76,338గా, సతీమణి వద్ద నగదు రూ.49,215 ఉన్నట్లు పొందుపరిచారు.
పొన్నాల బ్యాంకు డిపాజిట్లు రూ.20,89,955గా సతీమణి పేరిట రూ. 6,62,705 ఉన్నాయి. షేర్లలో లక్ష్మయ్య పేరిట రూ.23,66,400 ఉండగా, సతీమణి పేరిట రూ.30,68,000 ఉంది.
పొన్నాల పేరిట పోస్టల్ సేవింగ్స్‌లో రూ.లక్ష ఉన్నట్లు పొందుపరిచారు.
రూ.1.20లక్షల విలువైన ఆభరణాలు, రూ.6,96,804 విలువైన ఇన్నోవా.
స్థిరాస్తులకు సంబంధించి పొన్నాలకు రాంపూర్ సమీపంలో ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం రూ.4కోట్ల విలువైన ఐదెకరాల భూములు, సతీ మణి అరుణాదేవి పేరిట రంగారెడ్డి జిల్లా అమ్మపల్లిలో రూ.8,82,00,000 విలువ గల 21.02 గుంటల భూమి, వంగపల్లిలో రూ.70లక్షల విలువ గల 3.20 ఎకరాల భూమి, రాంపూర్‌లో రూ.14,66,000 విలువ గల 18.33 గుంటల భూమి ఉన్నట్లు పొందుపరిచారు.
అరుణాదేవి పేరిట ిహ మాయత్నగర్లో 9వేల గజాల భూమి ఉందని, దీని విలువ రూ.50,00,000 ఉన్నట్లు చూపారు.
పొన్నాలకు ఖిలాషాపూర్‌లో ఇల్లు ఉన్నట్లు చూపారు.
అరుణాదేవి పేరిట హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో రూ.3,50,00,000 విలువ గల బృందావనం ఇల్లు ఉన్నట్లు చూపారు. కాగా, అరుణాదేవి పేరిట రూ.91,50,000 అప్పు ఉన్నట్లు చూపారు.
భూపాలపల్లి
గండ్ర వెంకటరమణారెడ్డి (కాంగ్రెస్)
భూపాలపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన గండ్ర వెంకటరమణారెడ్డి తన అఫిడివిట్లో పేర్కొన్న ఆస్తుల వివరాలిలా ఉన్నాయి.
వెంకటరమణారెడ్డి చేతిలో రూ.8.40లక్షల నగదు ఉండగా, వివిధ బ్యాంకుల్లో రూ.6,99,087 నిల్వ ఉంది.
వివిధ పాలసీలు, ఇన్సూరెన్సుల విలువ రూ.6,09,996, ఐదు వాహనాల విలువ రూ.76,70,050, 20 గ్రాముల బంగారు విలువ రూ.30వేలు, భూములు, గృహాల విలువ రూ.3,49,35,000 గా పేర్కొన్నారు.
పలు బ్యాంకుల్లో రూ.86,88,312 రుణం తీసుకున్నట్లు తెలిపారు.
వెంకటరమణారెడ్డిపై గణపురం, భూపాలపల్లి, శాయంపేట పీఎస్‌ల్లో ఒక్కో కేసు ఉన్నట్లు అఫిడవిట్లో వివరించారు.
వెంకటరమణారెడ్డి భార్య జ్యోతి చేతిలో రూ.లక్షల నగదు, బ్యాంకుల్లో రూ.5,29,563 ఉండగా, బాలసీలు, బాండ్ల విలువ రూ.1,92,782గా పేర్కొన్నారు.
జ్యోతి పేరిట ఉన్న రూ.14,66,038 విలువైన టాటా టిప్పర్ వాహనం, రూ.9లక్షల విలువైన 600 గ్రాముల బంగారం, రూ.1,49,27,000 విలువైన భూములు, నివాసగృహాలు, వ్యాపారం ఉందని తెలిపారు. ఇంకా రూ.2,38,290 రుణం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
గండ్ర వెంకటరమణారెడ్డి కుమారుడు గౌతమ్‌రెడ్డికి రూ.45వేల విలువైన 30 గ్రాముల బంగారం, వ్యాపారాలు, నివాస గృహాల విలువ రూ.1,43,57,000 కాగా, రూ.2,38, 290 రుణం తీసుకున్నట్లు పొందుపరిచారు. ఇక గౌతమ్ చేతిలో రూ.5వేల నగదు ఉండగా, బ్యాంకులో రూ.1,13,517 నిల్వ ఉన్నట్లు తెలిపారు.
కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి(బీజేపీ)
కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తన ఆస్తులు రూ.26,08,25,095 ఉన్నట్లు అఫిడవిట్లో దాఖలు చేశారు. బ్యాంక్ డిపాజిట్లు, నగదు, పాలసీలు, వాహనాలు, బంగారు ఆభరణాల విలువ రూ.20,34,04,926 ఉంది.
సతీమణి అరుణ పేరిట రూ.5,74,20,169 ఉంది. కాగా కొమ్మూరికి, ఆయన సతీమణికి బ్యాంకులో అప్పులు రూ.28.50లక్షలు ఉంది. చరాస్తులు కొమ్మూరి వద్ద నగదు రూ.4ల క్షలు ఉన్నట్లు చూపారు. సతీమణి పేరిట రూ.2,50,000 చూపారు.
కొమ్మూరి పేరిట స్కార్పియో ఉండగా.. విలువ రూ.12,87,000 ఉంది.
సతీమణి పేరిట రూ.5లక్షల పోస్టల్ సేవింగ్స్ ఉన్నాయి. కొమ్మూరి పేరిట రూ.96వేల విలువ గల 30 గ్రాముల బంగారం, రూ.లక్ష విలువ గల డైమండ్ రింగ్ ఉంది. సతీమణి పేరిట రూ.32లక్షల విలువ గల వెయ్యి గ్రాముల బంగారం ఉంది.
స్థిరాస్తులకు సంబంధించి రూ.7,24,050 విలువ చేసే మద్దూరు మండలం నర్సాయపల్లిలో 7 ఎకరాల భూమి, అన్నోజిగూడలో ఎకరం, రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం గణపురంలో 16 ఎకరాల 8 గుంటలు, బోడుప్పల్లో 2 ఎకరాలు, లాల్గాడి మల్లక్పేటట్లో 10.01 ఎకరాలు, ఫిర్జాదిగూడలో ఎకరం 10 గుంటలు ఉంది.
సతీమణి పేరిట అన్నోజిగూడలో రూ.64లక్షల విలువ గల ఎకరం భూమి ఉంది. నాన్ అగ్రికల్చర్ భూములు కొమ్మూరి పేరిట రూ.7.50కోట్లు, సతీమణి పేరిట రూ.1,70,50,000 ఉంది. ప్రసుత్త మార్కెట్ విలువ ఆధారంగా ఇల్లు కొమ్మూరి పేరిట రూ.5,73,096 ఉంది. సతీమణి పేరిట రూ.3,04,026 ఉంది.
- న్యూస్‌లైన్, జనగామ
చల్లా ధర్మారెడ్డి (టీడీపీ)
టీడీపీ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి చేతి లో రూ.1,86,300 నగదు ఉంది.
హన్మకొండ మండలంలోని మడికొండలో నాన్ అగ్రిక ల్చర్ భూముల్లో 50శాతం వాటా, హైదరాబాద్‌లో నివాస స్థలం ఉన్నట్లు తెలిపారు.
చల్లా ఇన్ఫ్రా ప్రాజెక్ట్‌లో రూ.40,59,980 షేర్లు, రూ.13,33, 662 విలువైన బీమా పాలసీలు ఉన్నాయి.
రూ.5,61,105 విలువైన మహీంద్ర బోలోరో క్యాంపెర్, రూ.52,500 విలువైన హోండా షైన్, రూ.2,71,700 విలువైన 95 గ్రాములు బంగారం ఉంది.
ట్రస్టు కోసం రూ.43,33,059 రుణం తీసుకున్నట్లు తెలిపారు.
ధర్మారెడ్డి భార్య జ్యోతి వద్ద రూ.2,70,900 నగదు ఉంది.
ఆమె పేరిట మొత్తం 1,08,33,716 ఆస్తులు ఉన్నాయి.
ముద్దసాని సహోదర్‌రెడ్డి (టీఆర్ఎస్)
సహోదర్‌రెడ్డి చేతిలో రూ.1.10లక్షల నగదు ఉంది.
రూ.30వేల విలువైన 10గ్రాముల బంగారంతో పాటు దామెర, ఓగ్లాపూర్, దిలపూర్, యాదగిరిగుట్ట వద్ద ఉన్న చిన్నకుండూరు, ఘట్కేర్ మండలం కోర్రెముల, హన్మకొండ మండలం శాయంపేటలో వ్యవసాయ భూమి ఉంది.
హన్మకొండ అడ్వకేట్స్ కాలనీలో ఓపెన్ ప్లాట్, నక్కలగుట్ట, పాత తిరుమల టాకీస్ సమీపంలో ప్లాట్లు ఉన్నాయి. కాకాజీ కాలనీలో కమర్షియల్ భవనం, హైదరాబాద్ నాచారంలో నివాస స్థల ఉంది.
సహోదర్‌రెడ్డికి బైక్, కారు లేదని అఫిడవిట్లో తెలిపారు.
సహోదర్‌రెడ్డి భార్య వద్ద రూ.50 వేల నగదు ఉండగా, రూ.1,39,56,000 ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో చూపించారు.
- న్యూస్‌లైన్, పరకాల
వర్ధన్నపేట
కొండేటి శ్రీధర్ (కాంగ్రెస్)
వర్ధన్నపేట నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన కొండేటి శ్రీధర్ తనకు రూ.22.66,746 ఆస్తులు, రూ.23,86,474 రుణముందని అఫిడవిట్లో తెలిపారు.
శ్రీధర్ భార్య ఎలీషా పేరుపై రూ.88,20,628 ఆస్తులు ఉండగా రూ.46,68,889 రుణం ఉందని పేర్కొన్నారు.
వారి కుమారుడి పేరిట రూ.90 వేల విలువైన 30 గ్రాముల బంగారం ఉందని తెలిపారు. మొత్తం ఆస్తుల విలువ రూ.1,17,07,374 కాగా, ఇందులో రూ.82, 54, 363 వివిధ బ్యాంకుల్లో రుణాలు ఉన్నాయి. శ్రీధర్ పేరుపై ఉన్న వాటిలో టయోటా ఇన్నోవా, ఓ ట్రాక్టర్, ఇండికా కారు, 25గ్రామలు బంగారు ఆభరణాలు, వర్ధన్నపేట ఇందిరాకాలనీలో ఇల్లు.
భార్య ఎలీషా పేరుమీద బోరింగ్ మిషన్, 110 గ్రాముల బంగారు ఆభరణాలు, నాన్ అగ్రికల్చర్ ప్లాట్లు ఉన్నాయి.
అరూరి రమేష్ (టీఆర్ఎస్)
అరూరి రమేష్ కుటుంబానికి రూ.11,88,00,943 ఆస్తులు ఉండగా, ఇందులో రూ.2,08,91,414 బ్యాంకు రుణాలు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.
రమేష్ చేతిలో రూ.5లక్షల నగదు, బ్యాంకులో రూ.5వేలు ఉన్నాయి. సాయిదత్తా కన్స్ట్రక్షన్లో రూ.4, 51,38,349, రూ.1.86లక్షల విలువైన 60 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి.
రూ.7.5లక్షల విలువైన ఐకాన్ కారు, రూ.22.5లక్షల 11.17 ఎకరాల వ్యవసాయ భూమి రఘునాథపల్లి, వెల్దిలో, వ్యవసాయేతర భూములు ధర్మసాగర్ మండలం రాంపూర్, హన్మకొండ మండలం అమ్మవారిపేట, హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని బద్వేల్, మహబూబ్‌నగర్‌లోని నందిగామ, రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్, హన్మకొండ, వరంగల్‌లో విలువ రూ.1.15కోట్లుగా చూపించారు.
ఇక రూ.2.74 కోట్ల విలువైన గృహాలు హైదరాబాద్ రామంతపూర్, జఫర్‌గఢ్ మండలంలో ఉప్పుగల్లు, కాజీపేటలోని ప్రశాంత్ నగర్లో ఉన్నాయి.
రమేష్ భార్య కవితకుమారి చేతిలో నగదు రూ.1.5లక్షలు, బ్యాంకు ఖాతాలో రూ.5వేల నగదు ఉంది.
సాయిదత్త కన్స్ట్రక్షన్సలో రూ.2,71,62,238 వాటా, రూ.7.44లక్షల విలువైన 240 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి.
రఘునాథపల్లి మండలం వెల్ది, స్టేషన్‌ఘన్‌పూర్ మండలం చిన్నపెండ్యాలలో రూ.26.25లక్షల విలువైన 14.14 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
కుమారుడు విశాల్ పేరిట సాయిదత్తా కన్స్ట్రక్షన్లో రూ.80,62,553 లక్షల వాటా, రూ.68వేల విలువైన 22 గ్రాముల బంగారం, కూతురు అక్షిత పేరు మీద రూ.80,62, 553 లక్షల వాటా, రూ.68వేల విలువైన 22 గ్రాముల బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు.
మొత్తంగా రమేష్ పేరిట రూ.24, 59, 151, కవితకుమారి పేరుమీద రూ.1.84, 32,263 బ్యాంకు రుణాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
మంద కృష్ణ మాదిగ (ఎంఎస్పీ)
వర్ధన్నపేట స్థానంలో ఎంఎస్పీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అఫిడవిట్లో ఆస్తులను ప్రకటించారు.
న్యూశాయంపేటలో తల్లిదండ్రుల ద్వారా సంక్రమిం చిన రూ.5లక్షల విలువైన రెండు గదుల ఇళ్లు ఉంది.
రూ.లక్ష విలువైన 35 గుంటల వ్యవసాయ భూమి ఉంది.
మంద కృష్ణ చేతిలో రూ.20వేలు, బ్యాంకు ఖాతాలో రూ.5వేలు నిల్వ ఉన్నాయి. భార్య జ్యోతి పేరిట రూ.1.55లక్షల విలువైన ఐదు తులాల బంగారు ఆభరణాలు, రూ.5వేల నగదు ఉంది.
భార్యాభర్తల పేరిట మొత్తం రూ.8 లక్షల ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.
- న్యూస్‌లైన్, వర్ధన్నపేట
గండ్ర సత్యనారాయణరావు (బీజేపీ)
సత్యనారాయణరావు వద్ద రూ.50వేల నగదు ఉండగా, రూ.16,10,500 విలువైన వాహనం ఉంది.
రూ.56వేల విలువైన 20 గ్రాముల బం గారం, రూ.81లక్షల విలువైన భూము లు, గృహాలు ఉన్నాయి.
రెండు బ్యాంకుల్లో రూ.5లక్షల రుణం తీసుకున్నట్లు ఆయన అఫిడవిట్లో పేర్కొన్నారు.
సత్యనారాయణరావు భార్య పద్మ వద్ద రూ.20వేల నగదు ఉండగా, రూ.70లక్షల విలువైన భూములు, ఆస్తులు ఉన్నాయి.
ఆమె పేరిట రూ.లక్ష రుణం తీసుకున్నారు.
సత్యనారాయణ రావు ఇద్దరు కుమార్తెల వద్ద రూ.56వేల విలువైన 20 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి.
- న్యూస్‌లైన్, భూపాలపల్లి
సిరికొండ మధుసూదనాచారి (టీఆర్ఎస్)
టీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచిన సిరి కొండ మధుసూదనాచారి చేతిలో రూ. 30వేల నగదు ఉండగా, బ్యాంకు ఖాతాల్లో రూ.22వేలు ఉన్నాయి.
నెలకు రూ.15వేల పింఛన్ అందుతుం డగా, ఎన్ఎస్ఎస్, పోస్టల్ సేవింగ్, పాలసీల రూపంలో రూ.6 లక్షలు ఉన్నాయి.
మధుసూదనాచారికి రూ.60వేల విలువైన ఇరవై గ్రాముల బంగారం, రూ.9లక్షల విలువైన వ్యవసాయ భూమి ఉంది.
చారి భార్య సతీమణి చేతిలో రూ.10వేలు, బ్యాంకు ఖాతాల్లో రూ.26 వేల నగదు ఉంది. ఆమె పేరిట పాసీలు రూ.2.5లక్షలు ఉండగా, రూ.3లక్షల విలువైన వంద గ్రాముల బంగారం ఉంది.
ఉమాదేవి పేరిట రూ.10లక్షల విలువైన స్పార్కియో, రూ.9లక్షల విలువైన భూమి ఉండగా... కారు కొనుగోలుకు రూ.1.88లక్షల అప్పు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
మధుసూదనాచారి కుమారడు ప్రదీప్ చేతిలో రూ.3వేల విలువైన నగదు, బ్యాంకుల్లో రూ.22వేలు ఉండగా, రూ.3.78లక్షల విలువైన పాలసీలు ఉన్నాయి. అలాగే, ఆయన పేరిట రూ.90వేల విలువైన 30 గ్రాముల బంగారం ఉన్నాయి.
మూడు బాలుచౌహాన్ (టీడీపీ)
మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి బాలుచౌహాన్ తన పేరిట రూ.9,81,300 ఆస్తి, భార్య పేరు మీద రూ.9.50 లక్షల ఆస్తి ఉన్నట్లు చూపారు.
బాలుచౌహాన్ పేరిట రూ.లక్ష నగదు, బ్యాంకులో రూ.14,300, రూ.25వేల ఇన్సూరెన్స, ద్విచక్ర వాహ నం రూ.67 వేలు, రూ.8లక్షల విలువైన నాలుగుఎకరాల భూమి
భార్య పేరిట రూ.1.50 విలువైన ఆరు తులాల బంగారు ఆభరణాలు, రూ.8లక్షల విలువైన నాలుగు ఎకరాల భూమి.
బాలుచౌహాన్కు బ్యాంకులో రూ.10లక్షల అప్పు, ఆయన భార్య పేరిట రూ.3.5లక్షల అప్పు ఉన్నట్లు అఫిడవిట్లో చూపించారు.
- న్యూస్‌లైన్, మహబూబాబాద్
శంకర్‌నాయక్ (టీఆర్ఎస్)
మహబూబాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలిచిన బానోతు శంకర్‌నాయక్ తన పేరిట రూ. 1,98,70,000 ఆస్తులు, రూ.81,25,399 అప్పు చూపించారు.
చేతిలో రూ.50 వేల నగదు, బ్యాంకుల్లో రూ.2,66,000, ఆరు వాహనాల విలువ రూ.61.50 లక్షలు, ఐదు ఎకరాల వ్యవసాయా భూమిని రూ.38 లక్షలకు కొనుగోలు చేస్తే ప్రస్తుత విలువ రూ.50లక్షలు, ఆరు ప్లాట్లు రూ.9.88లక్షలు కొనుగోలు చేస్తే ప్రస్తుత విలువ రూ.18.70లక్షలు, కమర్షియల్ భవనాలు రూ.16.20లక్షలు కాగా, ఇతర ఆస్తులు రూ.50 వేలు, నివాస గృహాల ప్రస్తుత విలువ రూ.55లక్షలు.
శంకర్‌నాయక్ భార్య సీతామహాలక్ష్మి పేరిట రూ.50వేలు నగదు ఉండగా, ఎల్ఐసీలో రూ.5లక్షల ఇన్సూరెన్సు, 25 తులాల బంగారం విలువ రూ.7 లక్షలు ఉన్నాయని తెలిపారు. అలాగే, 20గుంటల భూమిని రూ.3.60లక్షలతో కొనుగోలు చేస్తే ప్రస్తుత విలువ రూ.5.80లక్షలు, మూడు ప్లాట్లు రూ.2.93లక్షలతో కొనుగోలు చేస్తే ప్రస్తుత విలువ రూ.6లక్షలు, భవనాలు రూ.4.53లక్షలతో కొనుగోలు చేస్తే ప్రస్తుత విలువ రూ.7.16వేలు, నివాస గృహాన్ని రూ.2.42లక్షలకు కొనుగోలు చేస్తే ప్రస్తుత విలువ రూ.70 లక్షలని వివరించారు. ఇక వీరి కుమారులు సూర్యచంద్ర, కుమార్తె తేజస్వి పేరిట రూ.3లక్షల విలువైన బంగారం.
తాటికొండ రాజయ్య(టీఆర్ఎస్)
రాజయ్య కుటుంబ సభ్యుల చర, స్థిరాస్తులు రూ.3,40, 92,822 ఉన్నాయి. చరాస్తులు రూ. 40, 92,822 ఉండగా.. స్థిరాస్తులు రూ.3కోట్లు.
రాజయ్య పేరిట రూ.కోటి, భార్య ఫా తిమా పేరిట రూ.1.10కోట్లు, కుమారులు క్రాంతిరాజ్ పేరిట రూ.60లక్షలు, విరాజ్ పేరిట రూ.30లక్షలు ఉన్నా యి.
చరాస్తుల్లో రాజయ్య పేరిట రూ.6,72, 822, భార్య పేరిట రూ.22.75లక్షలు, కుమారులు క్రాంతిరాజ్, విరాజ్ పేరిట రూ.8.25లక్షలు, రూ.3.20లక్షలు.
రాజయ్య భార్యకు అప్పు రూ.29,67, 570, కుమారుడు క్రాంతిరాజ్కు రూ. 30,70,337 బ్యాంకు అప్పు ఉన్నాయి.
దొమ్మాటి సాంబయ్య(టీడీపీ)
దొమ్మాటి సాంబయ్య స్థిర, చరాస్తులు రూ.కోటి 88లక్షల 55 వేలు ఉన్నట్లు పేర్కొన్నారు. స్థిరాస్తులు రూ.1,50,00,000, చరాస్తులు రూ.38,55,000 ఉన్నాయి.
చరాస్తుల్లో సాంబయ్యకు రూ.3లక్షలు, భార్య కళావతి పేరిట రూ.15.55లక్షలు, కుమారుడు సాయిక్రిష్ణ పేరిట రూ.20లక్షలు .
స్థిరాస్తులు భార్య పేరిట రూ.1.50 కోట్లు. బ్యాంకు అప్పులు భార్య పేరిట రూ.53లక్షలు, కుమారుడి పేరిట రూ.5లక్షలు.
- న్యూస్‌లైన్, స్టేషన్‌ఘన్‌పూర్
స్టేషన్‌ఘన్‌పూర్
గుండె విజయరామారావు(కాంగ్రెస్)
డాక్టర్ గుండె విజయరామారావు స్థిర, చరాస్తులు రూ. 3,72,86,509 ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. స్థిరాస్తులు రూ.2,41,44,250, చరాస్తులు రూ.1,31,42,259 ఉన్నాయి.
చరాస్తులు విజయరామారావు పేరిట రూ.76,95,802, భార్య రామానుజమ్మ పేరిట రూ.52,88,974, కుమారుడు రాహుల్ పేరిట రూ.1,57,483 ఉన్నాయి.
స్థిరాస్తులు జీవీఆర్ పేరిట రూ.1,46,04,000, భార్య పేరిట 91,40,250, కుమారుడి పేరిట రూ.4లక్షలు ఉన్నాయి. బ్యాంకు అప్పులు జీవీఆర్ పేరిట రూ.28,07,233, భార్య పేరిట రూ.1,68,401 ఉన్నట్లు తెలిపారు.
నెమరుగొమ్ముల సుధాకర్‌రావు(టీఆర్ఎస్)
డాక్టర్ ఎన్.సుధాకర్‌రావు రూ.55లక్షల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో చూపారు. వివిధ ఆర్థిక సంస్థల నుంచి రూ.21,14,254 అప్పు తీసుకున్నట్లు చూపారు.
ఎల్ఐసీ పాలసీలు, బాండ్లు, వాహనాలు, బంగారం, వ్యవసాయ భూముల విలువను ఆస్తులుగా చూపారు.
బ్యాంకు రుణాలు రూ.19,62,342, సతీమణి విజయలక్ష్మి పేరున రూ.1,51,912 ఉన్నట్లు చూపారు.
- న్యూస్‌లైన్, పాలకుర్తి
దుగ్యాల శ్రీనివాసరావు(కాంగ్రెస్)
దుగ్యాల అఫిడవిట్లో తనతోపాటు సతీమణి సుమన పేర్ల మీద రూ. 5.57 కోట్ల ఆస్తులు ఉన్నట్లు చూపారు.
తన పేర రూ.2,77,00,000 ఆస్తులు ఉండగా.. సతీమణి పేరు మీద రూ.2,80,50,000 కలిపి రూ.5.57కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు.
భవనాలు, వాహనాలు, వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు ఉన్నట్లు చూపారు. వివిధ సంస్థల నుంచి తీసుకు న్న అప్పులు శ్రీనివాసరావు పేరు మీద రూ. 1,46,39,100, సుమన పేరు మీద రూ.2కోట్లు.
పాలకుర్తి
ఎర్రబెల్లి దయాకర్‌రావు(టీడీపీ)
ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులను రూ.రూ.2,27,80,000 ఉన్నట్లు చూపారు.
భార్య ఉషారాణి పేర వ్యవసాయ భూములు, ఇళ్లు, ప్లాట్లు, వాహనాలు, బంగారు ఆభరణాలు ఉన్నట్లు చూపారు.
వివిధ బ్యాంకులు నుంచి రూ.1.23కోట్ల అప్పు ఉన్నట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు.
నర్సంపేట
పెద్ది సుదర్శన్‌రెడ్డి(టీఆర్ఎస్)
పెద్ది సుదర్శన్‌రెడ్డి అఫిడవిట్లో పొందుపర్చిన వివరాల ప్రకారం రూ.3.11లక్షల ఆస్తి వూత్రమే ఉన్నట్లు వెల్లడించారు. మిగతా ఎలాంటి ఆస్తులు తనకు లేవని పేర్కొన్నారు.
రేవూరి ప్రకాశ్‌రెడ్డి(టీడీపీ)
రేవూరి ప్రకాశ్‌రెడ్డి రూ.26,50,941 విలువ గల ఆస్తి ఉన్నట్లు పేర్కొన్నారు. రూ.5,38,867 బ్యాంకు రుణాలు ఉన్నట్లు తెలిపారు. తన వద్ద రూ.10లక్షలు, భార్య వద్ద రూ.2లక్షల నగదు ఉన్నట్లు తెలిపారు. మా టీవీలో వంద షేర్స్, ఆదిలాబాద్ జిల్లా భట్టుపల్లిలో 8.29 గుంటల భూమి ఉన్నట్లు పేర్కొన్నారు.
కత్తి వెంకటస్వామి(కాంగ్రెస్)
కత్తి వెంకటస్వామి రూ.2.42 లక్షల విలువ గల ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. రూ.10లక్షల బ్యాంకు రుణం ఉన్నట్లు తెలిపారు.
దొంతి మాధవరెడ్డి(కాంగ్రెస్ రెబల్)
దొంతి వూధవరెడ్డి తన వద్ద రూ.75వేలు, భార్య వద్ద రూ.55వేలు, తనపై, భార్య పేరుపై రూ.1.65లక్షల విలువ చేసే బంగారం ఉన్నట్లు తెలిపారు. వీటితోపాటు రూ.3,75,81,500 ఆస్తులు ఉన్నట్లు తెలిపారు.
- న్యూస్‌లైన్, నర్సంపేట
డోర్నకల్
సుజాత మంగీలాల్(వైఎస్సార్ సీపీ)
బానోతు సు జాత మంగీ లాల్ కుటుం బ సభ్యుల పేర రూ. 18.10లక్షల విలువైన ఆస్తులు ఉన్నట్లు చూపించారు. కారు, 150 గ్రాముల బంగారం తన పేరున, భర్త పేరున డోర్నకల్ మండలం చిలుకోడులో వ్యవసాయ భూమి ఉందని, దాని విలువ రూ.7లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు.
సత్యవతి రాథోడ్(టీఆర్ఎస్)
సత్యవతి రాథోడ్ స్థిర, చరాస్తులు రూ.51లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇన్నోవ కారు, హైదరాబాద్‌లో ఇల్లు, గుండ్రాతిమడుగులో వ్యవసాయ భూమి, కర్ణాటక రాష్ట్రం బస్వనగర్ జిల్లాలోని గాదేఘాన్లో తన భర్త ఇంటి వద్ద వ్యవసాయ భూమి ఉన్నట్లు చూపించారు. ఇన్నోవ కారుపై ఎస్బీహెచ్ హైదరాబాద్ శాఖలో రూ.21.50లక్షల అప్పు ఉన్నట్లు చూపించారు.
డీఎస్.రెడ్యానాయక్(కాంగ్రెస్)
డీఎస్.రెడ్యానాయక్ తన కుటుంబ సభ్యుల పేర రూ.3కోట్ల స్థిర, చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో చూపించారు. చరాస్తులు 38.54లక్షలు, స్థిరాస్తులు రూ.2.61కోట్లు, హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే కాలనీలో తన పేరున ఖాళీ స్థలం, 1991 మోడల్ జీపు తప్ప కారు లేదు. కొడుకు పేరున ట్రాక్టర్, రెండో కొడుకు పేరున మారు తి కారు. ఉగ్గంపెల్లిలో వ్యవసాయ భూమి ఉండగా, అప్పులు లేవు.
జాటోతు రాంచంద్రునాయక్(టీడీపీ)
రాంచంద్రునాయక్ తన కుటుంబ సభ్యుల ఆస్తులు రూ.1.66కోట్లుగా చూపిం చారు. తన పేరున బొమ్మకల్‌లో వ్యవసాయ భూమి 10.30 ఎకరాలు, ఖాళీ ప్లాట్, హైదరాబాద్‌లో అపార్ట్మెంట్. భార్య ప్రమీల పేరున సూర్యాపేటలో వ్యవసాయ భూమి, ఖాళీ ప్లాట్, 400 గ్రాముల బంగారం. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో తన పేరున రూ.12లక్షలు, ప్రమీల పేరున రూ.10లక్షల అప్పు.
- న్యూస్‌లైన్, మరిపెడ
మహబూబాబాద్
మాలోతు కవిత (కాంగ్రెస్)
మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన కవిత తన అఫిడవిట్లో చూపిన ప్రకారం ఆస్తుల వివరాలిలా ఉన్నాయి.
కవితకు సంబంధించి రూ.2 లక్షల నగదు, వివిధ బ్యాంకులో రూ.1,53,507 డిపాజిట్లు, ఎల్ఐసీ, ఐసీఐసీఐలో ఇన్సూరెన్సులు రూ.5,75,000, ఇనోవా కారు విలువ రూ.16 లక్షల 30 వేలు, 30 తులాల బంగారం విలువ రూ.7,50,000 ఉన్నాయని తెలిపారు. అలాగే, రూ.18.50లక్షల వ్యవసాయేతర భూమి ఉందని తెలిపారు.
భద్రునాయక్ పేరిట రూ.50వేల నగదు, బ్యాంకులో నిల్వ రూ.2,754, డిపాజిట్ల రూపంలో రూ.1.60లక్షలు ఉండగా.. డిపాజిట్లు మినహాయించి రూ.52వేల నగదు ఉన్నట్లు చూపించారు.
ములుగు
లోకిని సంపతి (వైఎస్సార్ సీపీ)
ములుగు నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ తరఫున బరిలోకి దిగిన లోకిని సంపత్ తన ఆస్తుల వివరాలను పొందుపరిచారు.
సంపతి పేరిట రూ.వెయ్యి నగదు ఉండగా రూ.30వేల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి.
ఆయన భార్య శ్రీదేవి పేరిట రూ.1,01,400 నగదు, రూ.3లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి.
ధనసరి అనసూయ (సీతక్క - టీడీపీ)
సీతక్క చేతిలో రూ.3.50లక్షల నగదు ఉంది. రూ.2,85,280 పాలసీలు, రూ.180లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి.
రూ.1.50 లక్షల విలువైన వ్యవసాయ భూమితో పాటు, జగ్గన్నపేట, వరంగల్‌లో రూ.23.70 లక్షల విలువైన నివాస భవనాలు ఉన్నాయి. బ్యాంకులో రూ.9,81,357 అప్పు.
పొదెం వీరయ్య (కాంగ్రెస్)
వీరయ్య వద్ద రూ.2.65లక్షల నగ దు ఉండగా, రూ.68వేల విలువైన పాలసీలు, రూ.18.60లక్షల ఇన్నో వా, రూ.10లక్షల విలువైన భూమి, రూ.50లక్షల భవనాలు ఉన్నాయి. రూ.58,09,016 అప్పు ఉంది. ఆయన భార్య పద్మ పేరిట వద్ద వివిధ రూపాల ఆస్తులతో పాటు రూ.54.33లక్షల అప్పు.
అజ్మీరా చందూలాల్ (టీఆర్ఎస్)
చందూలాల్‌కు రూ.5లక్షల నగదు, రూ.2,26,926 పాలసీలు. రూ.6ల క్షల ట్రాక్టర్, రూ.60వేల ఆభరణా లు. రూ.2.60కోట్ల విలువైన భవనాలు, బ్యాంకుల్లో రూ.17,56,708 అప్పు.
చందూలాల్ భార్యకు ఆస్తులతో పాటు రూ.3,19,937 అప్పు.
- న్యూస్‌లైన్, గోవిందరావుపేట