తిరుమల : ఏపీకి ప్రత్యేక హోదా కోసం మట్టి సత్యాగ్రహం చేపడతామని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం తిరమలలో శ్రీవెంకటేశ్వరస్వామిని రఘువీరా దర్శించుకున్నారు. అనంతరం దేవాలయం వెలుపల విలేకర్లతో రఘువీరా మాట్లాడుతూ... ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని ఆయన స్పష్టం చేశారు. ప్రతి గ్రామం నుంచి మట్టి సేకరించి ప్రధాని మోదీకి పంపుతామని చెప్పారు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని మంత్రి నారాయణ, వైఎస్ఆర్ సీపీ ఎంపీ పి.మిథున్రెడ్డి దర్శించుకున్నారు.