సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును శనివారం సాయంత్రం క్యాంప్ ఆఫీసులో కలిశారు. ఆనం వివేకానందరెడ్డితో పాటు ఆయన సోదరుడు మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండటం తెలిసిందే. రుణ మాఫీ అమలుకు సంబంధించి చంద్రబాబు నాయుడు కమిటీవేయడం మంచి నిర్ణయ.మని ఆనం సోదరులు ఇటీవల పొగడ్తలతో ముంచెత్తుతూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆనం బాబును కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన త్వరలోనే టీడీపీ గూటికి చేరనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
బాబును కలసిన ఆనం
Published Sun, Aug 17 2014 3:05 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement